Raja Singh : తెలంగాణ బీజేపీలో సంచలనం.. బీజేపీకి రాజాసింగ్ రాజీనామా
Raja Singh : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు.
- By Kavya Krishna Published Date - 04:18 PM, Mon - 30 June 25

Raja Singh : తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ బీజేపీకి గుడ్ బై చెప్పారు. ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఇవాళ నాంపల్లి బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో, రాజా సింగ్ తన అనుచరులతో కలిసి భారీగా అక్కడికి చేరుకున్నారు. అయితే, తన అనుచరులను బెదిరించారని ఆరోపిస్తూ.. ఇక బీజేపీలో కొనసాగలేనని స్పష్టం చేశారు. ఉగ్రవాదులకు శత్రువుగా మారి, పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశానని గుర్తుచేశారు. “మీకు దండం, మీ పార్టీకి ఓ దండం” అంటూ ఆవేదనతో రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్ రెddyకి పంపారు. కాగా, గత కొంతకాలంగా పార్టీ నేతల వైఖరిపై ఆయన అసంతృప్తితో ఉన్న విషయం తెలిసిందే.
Raja Singh : అధ్యక్షుడిని ఓటింగ్ ద్వారా ఎన్నుకోవాలని డిమాండ్