Hyderabad: రెయిన్ అలర్ట్.. హైదరాబాద్ లో మూడు రోజుల పాటు వర్షాలు
ఆగస్టు 31 వరకు నగరంలో తేలికపాటి వర్షాలు, చినుకులు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది.
- By Balu J Published Date - 12:17 PM, Mon - 28 August 23

ఉక్కపోతతో ఇబ్బందులు పడుతున్న హైదరాబాద్ ప్రజలకు ఉపశమనం కల్గించే వార్త. ఆగస్టు 31 వరకు నగరంలో తేలికపాటి వర్షాలు, చినుకులు కురుస్తాయని భారత వాతావరణ విభాగం (IMD) హైదరాబాద్ అంచనా వేసింది. వాతావరణ శాఖ సూచన ప్రకారం.. సిటీలో ఉదయం వేళల్లో పొగమంచు వాతావరణం, సాధారణంగా మేఘావృతమైన ఆకాశం ఉంటుంది. తెలంగాణ స్టేట్ డెవలప్‌మెంట్ ప్లానింగ్ సొసైటీ (టీఎస్‌డీపీఎస్) కూడా ఇదే అంచనా వేసింది. ఆగస్టు 30 వరకు నగరంలో తేలికపాటి వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు కురుస్తాయని అంచనా.
రాష్ట్రంలో గరిష్ఠ ఉష్ణోగ్రత 34 నుంచి 37 డిగ్రీల సెల్సియస్, హైదరాబాద్‌లో 33 నుంచి 35 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని టీఎస్‌డీపీఎస్ అంచనా వేసింది. కాగా నిన్న హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిశాయి. రాష్ట్రంలో అత్యధికంగా రంగారెడ్డి జిల్లాలో 73 మిల్లీమీటర్లు, హైదరాబాద్‌లోని బండ్లగూడలో అత్యధికంగా 9.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఎండ వేడిమి భరించిన నగరవాసులకు ఈ వర్షం ఉపశమనం కలిగించింది.
ఆగస్టులో హైదరాబాద్, ఇతర తెలంగాణ జిల్లాల్లో అనుకున్న వర్షాలు కురిశాయి. అయితే సెప్టెంబర్‌లో కూడా సరిపడా వర్షాలు కురుస్తాయని అంచనా. ప్రస్తుత రుతుపవనాల సీజన్‌లో ఇప్పటివరకు తెలంగాణలో సాధారణ వర్షపాతం 551.8 మిల్లీమీటర్లు కాగా, సగటున 640 మి.మీ. ముఖ్యంగా, కరీంనగర్, వరంగల్‌లో అధిక వర్షపాతం నమోదైంది.
Also Read: Balakrishna: బాలయ్య ఆల్ టైమ్ క్లాసిక్ ‘భైరవద్వీపం’ 4కె క్వాలిటీతో రిలీజ్ కు రెడీ!