HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Rahuls Visit To Suryapet District

Rahul Tour : సూర్యాపేట జిల్లాలో రాహుల్ పర్యటన

Rahul Tour : హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని

  • Author : Sudheer Date : 30-01-2025 - 3:06 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

జాతీయ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఫిబ్రవరి రెండవ వారంలో సూర్యాపేట జిల్లాలో పర్యటించబోతున్నారు. ఈ సందర్భంగా భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయనున్నట్లు తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్ వెల్లడించారు. గురువారం గాంధీ భవన్ వద్ద మీడియాతో మాట్లాడుతూ పలు కీలక విషయాలను వెల్లడించారు. హైదరాబాద్ నగరంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తున్నామని, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అధిక సీట్లు గెలిచి మేయర్ పదవి తిరిగి కాంగ్రెస్ దక్కించుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ప్రజలకు సమానత్వం అందించడమే తమ ప్రభుత్వ ప్రధాన ఉద్దేశమని, సంక్షేమ పథకాలను అన్ని వర్గాలకు చేరవేస్తున్నామని అన్నారు.

TG Govt : విద్యుత్ సామర్థ్యము పెంపులో తెలంగాణ ప్రభుత్వం మరో ముందడుగు

ఫిబ్రవరి 5న కుల గణన నివేదిక క్యాబినెట్ సబ్ కమిటీకి అందజేయనున్నట్లు మహేష్ గౌడ్ తెలిపారు. రిజర్వేషన్ల పెంపుపై కేబినెట్‌లో చర్చించి, తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. అంతేగాక, కాంగ్రెస్ ప్రభుత్వం విదేశీ పెట్టుబడులను రాష్ట్రానికి ఆకర్షించేందుకు ప్రయత్నిస్తోందని, టీఆర్‌ఎస్ హయాంలో కుదేలైన రియల్ ఎస్టేట్ రంగాన్ని గమనించాలని రియల్టర్లకు సూచించారు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించి ఇప్పటికే ముగ్గురు అభ్యర్థుల పేర్లను అధిష్టానానికి నివేదించినట్లు మహేష్ గౌడ్ తెలిపారు. మరో రెండు మూడు రోజుల్లో కాంగ్రెస్ అభ్యర్థిని ప్రకటిస్తామని స్పష్టం చేశారు. రాహుల్ గాంధీ పర్యటనను పురస్కరించుకుని సూర్యాపేటలో ప్రజాభిప్రాయాన్ని సేకరించి, స్థానిక సమస్యలను హైలైట్ చేయాలని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.

రైతులకు రుణ మాఫీ అమలు చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వంపై, బీఆర్ఎస్ అనవసరమైన ఆరోపణలు చేస్తోందని మహేష్ గౌడ్ అన్నారు. రాహుల్ గాంధీ పర్యటన ద్వారా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు తన విధానాలను స్పష్టంగా తెలియజేసే అవకాశం ఉందని తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • mlc elections
  • Rahul Tour
  • Suryapet District
  • telangana
  • TPCC Mahesh Kumar

Related News

Liquor Price

Liquor Price Hike : తెలంగాణ మద్యం ప్రియులకు బిగ్ షాక్.. !!

ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం, సాధారణ బ్రాండ్ల (Ordinary Brands) ఫుల్ బాటిల్‌పై రూ. 20 నుండి రూ. 60 వరకు, ఇక ప్రీమియం బ్రాండ్ల (Premium Brands) పై ఏకంగా రూ. 100 నుండి రూ. 120 వరకు ధరలు పెరిగే అవకాశం ఉంది

  • Restraint is needed on water disputes: CM Revanth Reddy

    Telangana : సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలకు అందించే వస్తువుల సరఫరా పై సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • CV Anand Assumes Charge as Telangana DGP

    CV Anand: తెలంగాణ డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్

  • Ashu Reddy

    Ashu Reddy : హైకోర్టును ఆశ్రయించిన అషురెడ్డి

Latest News

  • BREAKING: ప్రభుత్వ ఏర్పాటులో విజయ్ కు బిగ్ షాక్ ఇచ్చిన గవర్నర్!

  • Rajinikanth: స్టాలిన్‌తో రజనీకాంత్ భేటీ.. క్లిష్ట సమయంలో అండగా ఉంటానని హామీ ఇచ్చిన రజనీ

  • TVK VIJAY: విజయ్‌ని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించిన గవర్నర్‌

  • Papikondalu: పాపికొండలు విహార యాత్ర తాత్కాలిక నిలిపివేత

  • Hyderabad CP Sumathi: అర్ధరాత్రి నడి రోడ్డుపై మహిళా పోలీస్ కమిషనర్ కు వేధింపులు.. 40 మంది పోకిరీలకు దిమ్మతిరిగే షాక్!

Trending News

    • AIADMK: తమిళ్ పాలిటిక్స్‎లో బిగ్ ట్విస్ట్.. అన్నాడీఎంకే లో రగడ

    • TVK Vijay Trisha: ఎమ్మెల్యేగా త్రిష అక్కడ నుంచే పోటీ..?

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd