TS : తెలంగాణలో రాహుల్ పాదయాత్ర…రూట్ మ్యాప్ ఇదే…!!
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. కాగా ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణలో అడుగుపెట్టనుంది.
- Author : hashtagu
Date : 01-10-2022 - 4:14 IST
Published By : Hashtagu Telugu Desk
కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్ర విజయవంతంగా ముందుకు సాగుతోంది. కాగా ఈ నెల 24వ తేదీ నుంచి తెలంగాణలో అడుగుపెట్టనుంది. శనివారం హైదరాబాద్ లోని AICC సెక్రటరీ సంపత్ కుమార్ నివాసంలో భారత్ జోడో యాత్ర గురించి సమావేశం జరిగింది. అనంతరం తెలంగాణలో రాహుల్ యాత్ర గురించి రూట్ మ్యాప్ విడుదల చేశారు. మొత్తం 13రోజులపాటు సాగునుంది. 359 కిలోమీటర్ల మేర తెలంగాణలో నడవనున్నారు రాహుల్ గాంధీ.
కాగా నియోజకవర్గాల జాబితాను రెడీ చేశారు. మక్తల్ నియోజకవర్గం నుంచి తెలంగాణలోకి ఎంట్రీ కానున్నారు రాహుల్.
1 రోజు మక్తల్, కొడంగల్, నారాయణపేట, గద్వాల్, అలంపూర్ నియోజకవర్గ నేలతోపాటు రాష్ట్ర ముఖ్యనేతలు పాల్గొంటారు.
2 వరోజు దేవరకద్ర నియోజకవర్గంలోని కల్వకుర్తి, దేవరకొండ, వనపర్తి, అచ్చంపేట,
3 వరోజు మహబూబ్ నగర్ తాండూ్, పరిగి, దేవరకొండ
4వరోజు జడ్చర్ల నాగర్ కర్నూల్, ఖమ్మం
5వరోజు షాద్ నగర్ మహేశ్వరం, భువనగిరి
6 వరోజు శంషాబాద్ రాజేంద్రనగర్, ఎల్బీనగర్, ఉప్పల్
7. శేరిలింగంపల్లి చేవెళ్ల, మహేశ్వరం,
8వరోజు బీహెచ్ఈఎల్, మల్కాజ్ గిరి, మహబూబాబాద్,
9. వ రోజు సంగారెడ్డి
10వరోజు జోగిపేట
11 వ రోజు శంకరం పేట
12 రోజు ఆదిలాబాద్
13 వరో జుక్కల్ ప్రాంతాల్లో సాగునుంది రాహుల్ గాంధీ. 13వ రోజు సాయంత్రం తెలంగాణ రాహుల్ యాత్ర ముగుస్తుంది.