Rahul Gandhi – Kodandaram : రాహుల్ తో భేటీ తర్వాత కోదండరామ్ కీలక ప్రకటన
Rahul Gandhi - Kodandaram : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది.
- By Pasha Published Date - 10:50 AM, Fri - 20 October 23

Rahul Gandhi – Kodandaram : రాహుల్ గాంధీ తెలంగాణ పర్యటన వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేయాలని తెలంగాణ జన సమితి (టీజేఎస్) చీఫ్ కోదండరామ్ ను హస్తం పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ కోరారు. ఇవాళ ఉదయం కరీంనగర్ లోని వీ పార్క్ హోటల్ లో రాహుల్‌తో కోదండరామ్ భేటీ అయ్యారు. ఈ మీటింగ్ అనంతరం మీడియాతో మాట్లాడిన కోదండరామ్ .. ఈమేరకు వివరాలను వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join.
‘‘రాష్ట్ర రాజకీయాలపై ఇద్దరం చర్చించాం. తెలంగాణలో నిరంకుశ పాలన పోవాలని రాహుల్ ఆకాంక్షించారు. నేను రాహుల్ ను మర్యాదపూర్వకంగానే కలిశాను. అంతకుమించి మరొకటి లేదు. పొత్తులు, సీట్లపై చర్చ మా మధ్య చర్చ జరగలేదు. ప్రజాస్వామ్య పాలనను పునరుద్ధరించేందుకు అందరం ఏకం కావాలని రాహుల్ అభిప్రాయపడ్డారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తాం’’ అని కోదండరామ్ చెప్పారు. ‘‘కాంగ్రెస్‌తో సీట్ల సర్దు బాటుపై మరోసారి సమావేశం అవుతాను. రాష్ట్ర కాంగ్రెస్ నేతలతో భేటీ తర్వాత క్లారిటీ వస్తుంది. నా లక్ష్యం కేసీఆర్‌ను ఓడించడమే’’ అని ఆయన (Rahul Gandhi – Kodandaram) స్పష్టం చేశారు. కాగా, పొత్తులో భాగంగా ముథోల్, ఎల్లారెడ్డి, కోరుట్ల, జహీరాబాద్ స్థానాలను తెలంగాణ జనసమితి ఆశిస్తున్నట్లు తెలుస్తోంది.