MLC Balmuri Venkat : ఓయూ లో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు నిరసన సెగ
- By Sudheer Published Date - 02:55 PM, Tue - 6 February 24

కాంగ్రెస్ పార్టీ (Congress) ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు (MLC Balmuri Venkat) నిరసన సెగ తగిలింది. మంగళవారం ఉస్మానియా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ పాల్గొనగా..విద్యార్థులు ఆయన్ను అడ్డుకున్నారు. జీవో 46 రద్దు చేయాలని నిరుద్యోగులు నిరసనకు దిగారు. దీంతో ఆ కార్యక్రమంలో గందరగోళంగా మారింది.
We’re now on WhatsApp. Click to Join.
గ్రామీణ విద్యార్థులకు తీవ్ర నష్టాన్ని కలిగించే జీ వో నెం.46ను తక్షణమే రద్దు చేయాలని వారంతా డిమాండ్ చేసారు. టీఎ్‌సఎల్‌పీఆర్‌బీ, తెలంగాణ ప్రభుత్వం తెచ్చిన జీవో 46 వల్ల ఉమ్మడి హైదరాబాద్ అభ్యర్థులకే అధిక మేలు జరుగుతుందని అన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఆర్థిక వ్య య ప్రయాసాల కోర్చి ఫిజికల్ టెస్టులు, పరీక్షల్లో బాగా ప్రిపేర్ అయి 130 మా ర్కులు తెచ్చుకున్నప్పటికీ టీఎ్‌సపీ్‌సలో ఉద్యోగం వచ్చే అవకాశం లేకుండా పో తోందని అవేదన వ్యక్తం చేశారు. సెటిలర్లు ఎక్కవగా ఉన్నా హైదరాబాద్‌లో 90 మార్కులు సాధించిన అభ్యర్థులకు ఉద్యోగం వచ్చే అవకాశం ఏర్పడిందన్నారు. తక్షణమే ప్రభుత్వం జీవో 46ను రద్దు చేసి 2015, 2018 ప్రకారం నియామకాలను చేపట్టాలని కోరారు.
ఈ కార్యక్రమానికి ముందే..నిన్న రాత్రి పోలీసులు ఉస్మానియా యూనివర్సిటీలో (Osmania University) విద్యార్థులను అరెస్ట్ చేశారు. ఉస్మానియా యూనివర్సిటీకి కాంగ్రెస్ నాయకులు వస్తుండటంతో అర్ధరాత్రి హాస్టల్లో ప్రవేశించి విద్యార్థులను ముందస్తు అరెస్ట్ చేశారు పోలీసులు. అయినప్పటికీ విద్యార్థులు ఎక్కడ తగ్గకుండా తమ నిరసనను వ్యక్తం చేసారు.
ఉస్మానియా యూనివర్సిటీలో ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్‌కు నిరసన సెగ
జీఓ 46 రద్దు చేయాలంటూ నిరుద్యోగుల నిరసన. pic.twitter.com/5k0GYL9LqM
— Telugu Scribe (@TeluguScribe) February 6, 2024
Read Also : Gruha Jyothi Scheme : అద్దె ఇంట్లో ఉంటున్న వారికీ ‘గృహ జ్యోతి’ పథకం అమలు అవుతుందా..?