Liquor : తెలంగాణలో మూడు రోజులు వైన్స్ బంద్
Liquor : ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు
- By Sudheer Published Date - 12:53 PM, Sun - 23 February 25

తెలంగాణ రాష్ట్రంలో మద్యం ప్రియులకు నిరాశ కలిగించే వార్త వచ్చేసింది. ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) నేపథ్యంలో రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం షాపులు మూడు రోజులపాటు (Liquor Shops Bandh) మూసివేయనున్నారు. ఫిబ్రవరి 25 ఉదయం 6 గంటల నుంచి ఫిబ్రవరి 27 ఉదయం 6 గంటల వరకు మద్యం విక్రయాలను పూర్తిగా నిలిపివేయాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ అవినాష్ మొహంతి ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా హైదరాబాద్ శివారు ప్రాంతాలైన కొల్లూరు, ఆర్‌సీ పురం పరిధిలోని వైన్ షాపులు, బార్లు, స్టార్ హోటళ్లు, క్లబ్బులు మూసివేయనున్నారు.
Rowdy Baby Step: రౌడీ బేబీ పాటకు స్టెప్పులు ఇరగదీసిన ధనుష్,ప్రభుదేవా.. నెట్టింట వీడియో వైరల్!
మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల్లో గ్రాడ్యుయేట్, టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికలు ఫిబ్రవరి 27న జరగనున్నాయి. ఎన్నికల సమయంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా, ఓటర్లను ప్రభావితం చేయకుండా ఉండేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. మద్యం నిషేధం సమయంలో ఏ వ్యక్తి నిబంధనలను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
Rajalingamurthy Murder Case: రాజలింగమూర్తి హత్య.. నిందితుల్లో బీఆర్ఎస్ నేత.. మర్డర్‌కు కారణమిదీ
మార్చి 3న ఓట్ల లెక్కింపు జరగనుంది. తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి సుదర్శన్ రెడ్డి తాజాగా జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, ఎన్నికల ఏర్పాట్లపై సమీక్ష చేశారు. పోలింగ్ కేంద్రాలు, స్ట్రాంగ్ రూమ్‌లు, వెబ్‌కాస్టింగ్, మైక్రో అబ్జర్వర్ల నియామకం వంటి అంశాలను సమీక్షించి భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేయాలని సూచించారు. ఎన్నికల శాంతిభద్రతల దృష్ట్యా మద్యం షాపుల మూసివేత నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.