TS : అయ్యా..రేవంత్ గారు మాకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చెయ్యండి – సగటు మగవారి ఆవేదన
- By Sudheer Published Date - 02:08 PM, Fri - 22 December 23

తెలంగాణ (Telangana) లో అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీ (Congress Party) ..రెండు రోజుల్లోనే రెండు హామీలను నెరవేర్చింది. ముఖ్యంగా మహిళల కోసం మహాలక్ష్మి పథకం కింద ఫ్రీ బస్సు (women free bus Telangana) ప్రయాణ సౌకర్యాన్ని తీసుకొచ్చింది. ఈ పథకంపై మహిళలు హర్షం వ్యక్తం చేస్తుంటే..మగవారు మాత్రం విమర్శలు చేస్తున్నారు. ముఖ్యంగా ఫ్రీ అని చెప్పిన దగ్గరి నుండి మహిళలు ఇంట్లో ఉండడం తగ్గించేశారు..టైం పాస్ కోసం కొంతమంది..చిన్న చితక పనుల కోసం కూడా బస్సు ప్రయాణం చేస్తున్నారంటే..అర్ధం చేసుకోవాలి.
బస్సు స్టాండ్ లలో బస్సు వచ్చిందంటే చాలు..నెట్టేసుకుంటా ఎక్కి సీట్లలో కూర్చుంటున్నారు. ఇక డబ్బులు పెట్టి టికెట్ తీసుకున్న మగవారు నిల్చొనే ప్రయాణం చేస్తున్నారు. గంటల కొద్దీ నిల్చుని ప్రయాణం చేయాలంటే మా వల్ల కాదంటూ సీఎం రేవంత్ రెడ్డి కి మోర పెట్టుకుంటున్నారు. తాజాగా హైదరాబాద్ నుండి ప్రయాణం చేస్తున్న ఓ వ్యక్తి తన ఆవేదనను వీడియో రూపంలో వ్యక్తం చేసి సోషల్ మీడియా లో షేర్ చేసాడు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియో లో సదరు వ్యక్తి తన బాధను స్పష్టంగా తెలియజేసారు.
We’re now on WhatsApp. Click to Join.
ఫ్రీ బస్సు పెట్టి మహిళలకు మంచి పనే చేసారు కానీ బస్సు లో మగవారికి కూడా కొన్ని సీట్లు కేటాయిస్తే బాగుంటుందని..లేదంటే ప్రత్యేకంగా మగవారికి బస్సులు ఏర్పాటు చేయాలనీ కోరారు. గంటలకొద్దీ నిల్చుని ప్రయాణం చేయాలంటే మా వల్ల కావడం లేదని మొరపెట్టుకున్నాడు. ఈయన మాత్రమే కాదు చాలామంది మగవారు ఇలాగే తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరి దీనిపట్ల సీఎం రేవంత్ ఏమైనా నిర్ణయాలు తీసుకుంటారేమో చూడాలి.
టికెట్ కొని బస్సులో నిలబడి ప్రయాణించాలా అంటూ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తూ ఆవేదనని వ్యక్తపరిచిన ప్రయాణికుడు pic.twitter.com/kTkhhJmu5U
— Telugu Scribe (@TeluguScribe) December 22, 2023
Read Also : Corona Cases: ఇండియాలో 640 కరోనా కేసులు నమోదు, ఒకరు మృతి!