HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Prashant Kishore Joins Hands With Congress

Prashant Kishor : కాంగ్రెస్ కు ప్రశాంత్ కిషోర్ షేక్ హ్యాండ్? మరప్పుడు టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి?

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది.

  • Author : Hashtag U Date : 19-04-2022 - 12:07 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt

ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ పేరు ఇప్పుడు తెలంగాణ గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపిస్తోంది. పీకేతో ఒప్పందం కుదుర్చుకోవడానికి కాని, లేదా ఆయనను పార్టీలో చేర్చుకుని ఎన్నికల వ్యూహాలను అమలు చేయడానికి కాని కాంగ్రెస్ పార్టీ సీరియస్ గా ఆలోచిస్తోంది. ఇంతవరకు ఓకే. ఒకవేళ కాంగ్రెస్ తో కాని పీకేకు లంకె కుదిరితే.. తెలంగాణలో టీఆర్ఎస్ పరిస్థితి ఏమిటి? ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ టీఆర్ఎస్ పీకే సేవలను ఉపయోగించుకుంటోంది.

కాంగ్రెస్ పార్టీ దేశమంతా పీకే సేవలను ఉపయోగించుకుంటే.. ఆటోమేటిగ్గా తెలంగాణలో కూడా ఆయన సేవలు హస్తానికి అందుతాయి. అయితే ఇప్పటికే ఇక్కడ టీఆర్ఎస్ కు ఆయన సేవలు అందిస్తున్నారు. మరప్పుడు ఆయన గులాబీ పార్టీకి సేవలు ఆపేస్తారా? అదే జరిగితే టీఆర్ఎస్ కు ఇబ్బందులు తప్పవా? పీకే వాదన చూస్తే.. జాతీయస్థాయిలో మాత్రమే కాంగ్రెస్ విజయానికి వ్యూహాలు తయారుచేస్తానని.. రాష్ట్ర స్థాయి ఎన్నికల విషయంలో తన సేవలు హస్తానికి అందించనని చెప్పారు. కానీ తాజా పరిణామాలు చూస్తే మాత్రం.. కాంగ్రెస్ పార్టీ పీకే సర్వీసును అసెంబ్లీ ఎన్నికలు, లోక్ సభ ఎన్నికలకు కలిపి వినియోగించుకోవాలని భావిస్తోంది. దీంతో టీఆర్ఎస్ పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.

మరో వాదన ప్రకారం. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గూటికి టీఆర్ఎస్ ను చేర్చాలని పీకే ప్రయత్నిస్తున్నట్టు సమాచారం. దీనివల్ల ఇక్కడ అందించే సేవల విషయంలో ఆయనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. పైగా అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల పరంగా గట్టి బంధం ఉంటుంది కనుక ఈజీగా ఎక్కువ సీట్లను సొంతం చేసుకోవచ్చన్నది పీకే ప్లాన్. కానీ ఇప్పటికే టీఆర్ఎస్, టీపీసీసీలు ఉప్పు-నిప్పులా ఉన్నాయి. అలాంటప్పుడు వీటి మధ్య పొత్తు సాధ్యమా?

రాజకీయాల్లో ఏదైనా సాధ్యమే అంటారు. ఒకవేళ కాంగ్రెస్ తో పీకే జట్టు కడితే.. అది హస్తానికి బూస్ట్ ఇచ్చినట్టే. దేశమంతా దాని పరిస్థితి ఎలా ఉన్నా… తెలంగాణలో మాత్రం క్లారిటీ రావాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ కాంగ్రెస్ కు ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు తన సేవలు అందిస్తు్న్నారు. పైగా ఆయన వ్యూహాలు కూడా పనిచేస్తున్నాయని పార్టీలో టాక్ ఉంది. అందుకే డిజిటల్ సభ్యత్వాలు 40 లక్షలు దాటాయని అంటోంది. సునీల్ కనుగోలు కూడా పీకేకు శిష్యుడే. ఒకవేళ పీకేతో ఒప్పందం కుదిరితే.. సునీల్ కనుగోలు విషయాన్ని టీపీసీసీ ఏం చేస్తుందో చూడాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • aicc
  • PCC Chief revanth reddy
  • prashant kishor
  • rahul gandhi
  • sonia gandhi
  • Telangana CM KCR

Related News

Rahul Gandhi

రాహుల్ గాంధీ సభ్యత్వం రద్దుకు బీజేపీ డిమాండ్‌..సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు..!

Rahul Gandhi లోక్ సభ ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ బీజేపీ ఎంపీలు డిమాండ్ చేశారు. ఈ మేరకు లోక్ సభలో బీజేపీ ఓ నోటీసును ఫైల్ చేసినట్లు సమాచారం. అయితే, రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ప్రివిలేజ్ మోషన్ దాఖలు చేయలేదని తెలుస్తోంది. బడ్జెట్ సమావేశాల సందర్భంగా బుధవారం రాహుల్ గాంధీ లోక్ సభలో ప్రసంగించిన విషయం తెలిసిందే. రాహుల్ తన ప్రసంగంలో కేంద్ర ప్ర

    Latest News

    • Tiger : తూర్పుగోదావరి జిల్లాలో పట్టుకున్న పులిని వదిలేశారా..? అదేంటి ?

    • టీమిండియా హెడ్ కోచ్ గంభీర్ కి రాజస్థాన్ రాయల్స్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్లు!

    • బంగారం ప్రియులకు గుడ్ న్యూస్

    • చిన్నారులపై లైంగిక దాడి..అమెరికాలో భారతీయ యువకుడి అరెస్ట్!

    • New Airports : ఏపీలో ఏకంగా 09 కొత్త ఎయిర్‌పోర్ట్‌లకు ప్రణాళిక..ఎక్కడెక్కడంటే !!

    Trending News

      • టీ20 వరల్డ్ కప్ 2026.. పాకిస్థాన్‌తో సహా ఈ 5 జ‌ట్లు క‌ష్ట‌మే!

      • బంగారం ధ‌ర ప‌డిపోనుందా? విశ్లేష‌కులు ఏం చెబుతున్నారంటే?

      • భార‌త్‌- పాక్ మ‌ధ్య మ‌రోసారి మ్యాచ్ జ‌ర‌గ‌నుందా?

      • మహాశివరాత్రి.. జాగరణ చేస్తున్నారా?

      • కోహ్లీ రికార్డుల క్లబ్‌లోకి ఇషాన్ కిష‌న్‌..!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd