Inter First Year Practicals : ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు ఇక ప్రాక్టికల్స్
Inter First Year Practicals : ఇంటర్మీడియట్ విద్యను సంస్కరించే దిశగా మరో ముందడుగు పడనుంది.
- By Pasha Published Date - 12:08 PM, Sat - 30 September 23

Inter First Year Practicals : ఇంటర్మీడియట్ విద్యను సంస్కరించే దిశగా మరో ముందడుగు పడనుంది. ఈ అకాడమిక్ ఇయర్ నుంచే తెలంగాణలోని ఇంటర్ ఫస్టియర్ స్టూడెంట్స్ తో ఇంగ్లిష్ సబ్జెక్టులోనూ ప్రాక్టికల్స్ చేయించనున్నారు. ఇప్పటివరకు ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ సబ్జెక్టులను చదివే ఇంటర్ సెకండియర్ విద్యార్థులకు మాత్రమే ప్రాక్టికల్స్ ఉండేవి. తొలిసారిగా ఈ విద్యా సంవత్సరం చివరిలో 20 మార్కుల కోసం ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థులకు ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహించనున్నారు.
Also read : Pawan Kalyan : పవన్ కళ్యాణ్ ఫై వైసీపీ అవినీతి మరక వేసేందుకు ట్రై చేస్తుందా..?
దీనికి అనుగుణంగా ఫస్టియర్ ఇంగ్లిష్ థియరీ పరీక్ష పేపర్ ను కేవలం 80 మార్కుల కోసం రూపొందిస్తారు. థియరీలో మార్కులను తగ్గించినందున ఆమేరకు సిలబస్ ను కూడా తగ్గించారు. ఇంగ్లిష్ ప్రాక్టికల్స్ నిర్వహణతో స్టూడెంట్స్ లో ఆంగ్ల భాషా సామర్థ్యాలను పెంచొచ్చని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రాక్టికల్స్ కోసం ‘ఏ హ్యాండ్‌బుక్ ఆఫ్ కమ్యూనికేటివ్ ఇంగ్లిష్-1’ పేరిట 90 పేజీలతో కూడిన ప్రత్యేక సిలబస్ ను ఇంటర్మీడియట్ బోర్డు రూపొందించింది. ఇప్పటికే ఈ బుక్స్ జూనియర్ కాలేజీలకు (Inter First Year Practicals) చేరాయి.