Maoists: ‘‘నక్సలిజం వద్దు.. అభివృద్ధి మాత్రమే కావాలి’’
తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 21వ వార్షికోత్సవాన్ని నిషేధిత మావోయిస్టు పార్టీ జరుపుకుంటుండగా.. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లోని గోడలపై మావోయిస్టులపై పోరాడాలంటూ
- By Balu J Published Date - 03:56 PM, Tue - 7 December 21

తెలంగాణ-ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో మావోయిస్టు పార్టీ పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ (పీఎల్‌జీఏ) 21వ వార్షికోత్సవాన్ని నిషేధిత మావోయిస్టు పార్టీ జరుపుకుంటుండగా.. భద్రాచలం ఏజెన్సీ గ్రామాల్లోని గోడలపై మావోయిస్టులపై పోరాడాలంటూ పలు పోస్టర్లు, కరపత్రాలు ప్రత్యక్షం కావడం కలకలం రేపింది. అయితే పోస్టర్లలో వ్యక్తికానీ, సంస్థ సంతకంకానీ లేకపోవడంతో గ్రామాల్లో పెను సంచలనం సృష్టించింది. ‘నక్సలిజం వద్దు, అభివృద్ధి మాత్రమే కావాలి’ అనే క్యాప్షన్‌తో మావోయిస్టులు అమాయక గిరిజన సమాజాన్ని ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొడుతున్నారని పోస్టర్లు చెబుతున్నాయి.
రోడ్డు రోలర్‌కు నిప్పంటించిన వ్యక్తి అరెస్ట్
ఏటూరునాగారంలో రోడ్డు రోలర్‌కు నిప్పంటించిన రెండు రోజుల తర్వాత, సోమవారం పోలీసులు ఈ చర్యకు కారణమైన వ్యక్తిని అరెస్టు చేశారు. ములుగు ఆఫీసర్ ఆన్ స్పెషల్ డ్యూటీ (ఓఎస్‌డి) పి శోభన్ కుమార్ మాట్లాడుతూ గ్రామంలోని భూవివాదాన్ని పరిష్కరించడంలో సహాయం కోసం నిందితుడు ఎస్ దుర్గైహ మావోయిస్టు నాయకుడు దామోదర్‌ను సంప్రదించినట్లు తెలిపారు. ప్రతిగా, దామోదర్ తన వారోత్సవాలను విజయవంతం చేయడంలో సహాయపడటానికి రోడ్ రోలర్‌కు నిప్పంటించమని కోరినట్టు తెలుస్తోంది.