Lok Sabha Elections : ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి ?
ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి, కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది
- By Sudheer Published Date - 11:20 PM, Mon - 15 April 24

ఎట్టకేలకు ఖమ్మం కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ( Khammam Congress MP Candidate)ని ఫైనల్ చేసి ఉత్కంఠ కు తెరదించింది కాంగ్రెస్ పార్టీ (Congress Party). లోక్ సభ ఎన్నికల (Lok Sabha Elections) సమయం దగ్గరకు వస్తున్నప్పటికీ ఖమ్మం , హైదరాబాద్ , కరీంనగర్ ఎంపీ అభ్యర్థులను ప్రకటించకపోయేసరికి నేతల్లో , కార్యకర్తల్లో రోజు రోజుకు ఉత్కంఠ పెరుగుతూ వస్తుంది. ఎప్పుడు ఆ అభ్యర్థులను ప్రకటిస్తారు..? వారు ఎప్పుడు ప్రచారం మొదలుపెడతారు..? అసలు ఎవర్ని ఫైనల్ చేస్తారనే ఆసక్తి అందరిలో నెలకొని ఉంది. ముఖ్యంగా ఖమ్మం ఎంపీ అభ్యర్థి విషయంలో పార్టీ గత కొద్దీ రోజులుగా ఎటు తేల్చుకోలేక పోతు వస్తుంది. ఎందుకంటే ఖమ్మం స్థానం కోసం ఎంతోమంది కర్చీఫ్ వేసుకొని కూర్చున్నారు. రెండు రోజులు ఓ అభ్యర్థి పేరు గట్టిగా వినిపిస్తే..మరో రెండు రోజులు మరో అభ్యర్థి పేరు వినిపిస్తూ వచ్చింది. ఇలా రోజుకో పేరు వినిపిస్తుండడం తో ఎవర్ని ఫైనల్ చేస్తారా అని అంత అనుకుంటూ వస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక ఈరోజు ఆ ఉత్కంఠ కు తెరదించి హమ్మయ్య అనుకునేలా చేసింది అధిష్టానం. ఖమ్మం అభ్యర్థిగా పొంగులేటి ప్రసాదరెడ్డి (Ponguleti Prasad Reddy), కరీంనగర్ అభ్యర్థిగా వెలిచాల రాజేందర్ రావు, హైదరాబాద్ స్థానానికి సునితా రావులను అధిష్ఠానం ఖరారు చేసినట్లు తెలుస్తుంది. త్వరలోనే ఈ నియోజకవర్గాలకు వీళ్ల పేర్లను అధికారికంగా ప్రకటించనున్నట్లు వినికిడి. ఇక పొంగులేటి ప్రసాదరెడ్డి విషయానికి వస్తే..మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (ponguleti Srinivas Reddy) సోదరుడే పొంగులేటి ప్రసాద్.
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంలో ఖమ్మం కీ రోల్ పోషిస్తే..ఆ రోల్ వెనుక ఉన్నది పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి. పొంగులేటి వల్లే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉందనేది అంత మాట్లాడుకునేది. ఖమ్మం జిల్లాలో 9 స్థానాలు గెలుచుకొని అదే ఉత్సాహం తో ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటాలని చూస్తుంది. అందుకే ఖమ్మం ఎంపీ టికెట్ ను తన సోదరుడికి ఇవ్వాలని పొంగులేటి మొదటి నుండి పట్టుబడుతూ వచ్చారు. అధిష్టానం సైతం పొంగులేటి స్టామినా ఏంటో తెలుసు కాబట్టి ఆయన ను ఏమాత్రం నిప్పించకుండా ఆయన సోదరుడికి టికెట్ ఖరారు చేసినట్లు తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికి కాంగ్రెస్ అభ్యర్థి ఎవరో తెలియడం తో కాంగ్రెస్ శ్రేణులు , ముఖ్యంగా పొంగులేటి వర్గీయులు సంబరాలు చేసుకుంటున్నారు.
Read Also : Congress Jana Jathara : ముదిరాజ్‌లకు కీలక హామీ ఇచ్చిన సీఎం రేవంత్