Ponguleti Prasad Reddy: ఖమ్మంలో పొంగులేటి బ్రదర్ హామీలు
లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది.
- Author : Praveen Aluthuru
Date : 25-03-2024 - 11:58 IST
Published By : Hashtagu Telugu Desk
Ponguleti Prasad Reddy: లోకసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఖమ్మం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. ఖమ్మం ఎంపీ సీటు ఎవరికి దక్కుతుందనేది హాట్ టాపిక్‌గా మారింది. ఖమ్మం నుంచి గతంలో ప్రాతినిథ్యం వహించిన రేణుకా చౌదరికి రాజ్యసభ అవకాశం రావడంతో ఇప్పుడు లోక్‌సభ అభ్యర్థి ఎవరనేది సస్పెన్స్‌గా మారింది. అయితే ఇప్పటికే ఖమ్మంలో పొంగులేటి సోదరుడు హామీలు ఇవ్వడం మొదలు పెట్టాడు. దీంతో ఖమ్మం సీటు పొంగులేటి బ్రదర్ కేనని స్పష్టం అవుతుంది.
వచ్చే హోలీ నాటికి అర్హులైన ప్రతి పేదవాడికి సొంత ఇంటి కలను రాష్ట్ర ప్రభుత్వం నెరవేరుస్తుందని కాంగ్రెస్ జిల్లా నాయకులు పొంగులేటి ప్రసాద్ రెడ్డి హామీ ఇచ్చారు. కూసుమంచిలోని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన హోలీ సంబరాల్లో ఆయన మాట్లాడుతూ.. ఇచ్చిన హామీ మేరకు ఆరు హామీల అమలుకు శ్రీకారం చుట్టామని, అర్హులందరికీ లబ్ధి చేకూరుతుందన్నారు.
ఈ సందర్భంగా ఆయన భార్య శ్రీలక్ష్మి కూడా వివిధ తాండాలకు చెందిన నేతలతో సమావేశం అయ్యారు. ప్రాధాన్యత మేరకు అందరికీ న్యాయం జరిగేలా కృషి చేస్తున్నారన్నారు. అందరికీ హోలీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో అధిక సంఖ్యలో ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, పొంగులేటి మద్దతుదారులు పాల్గొన్నారు.
Also Read: Talasani Srinivas Yadav: కాంగ్రెస్ లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్