HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Stop Vehicle To Clear Pending Challan Sick Infant Dies

Infant Death: ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహం.. ప్రాణాలు కోల్పోయిన చిన్నారి

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది.

  • Author : Hashtag U Date : 01-06-2022 - 1:50 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Infant Death
Infant Death

యాదాద్రి భువ‌న‌గిరి జిల్లాలో ట్రాఫిక్ పోలీసుల అత్యుత్సాహానికి చిన్నారి ప్రాణాలు కోల్పోయింది. పెండింగ్‌లో ఉన్న చలాన్‌పై సుమారు గంటపాటు ట్రాఫిక్‌ పోలీసులు వాహనం ఆపడంతో ఆస్పత్రికి చేరుకోవడంలో ఆలస్యమై మూడు నెలల పసికందు మృతి చెందింది. ఈ ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.

జనగాం జిల్లా మరిగడి గ్రామానికి చెందిన ఓ దంపతులు తమ మూడు నెలల పసికందును హైదరాబాద్‌లోని ఆసుపత్రికి తీసుకెళ్లేందుకు కారును అద్దెకు తీసుకున్నారు. కారు డ్రైవర్ సీటు బెల్టు పెట్టుకోకపోవడంతో యాదాద్రి సమీపంలోని వంగపల్లి వద్ద ట్రాఫిక్ కానిస్టేబుళ్లు కారును ఆపారు. అనంతరం కారుకి చ‌లానా పెండింగ్ లో ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు. డ్రైవర్ చలాన్ చెల్లించడానికి దాదాపు అరగంట సమయం పట్టింది. మూడు నెలల శిశువు రేవంత్ రెండ్రోజుల క్రితం అస్వస్థతకు గురయ్యాడు. మంగళవారం అతన్ని జనగాంలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించాలని వైద్యులు తల్లిదండ్రులకు సూచించారు.తల్లిదండ్రులు హైదరాబాద్‌కు వెళుతుండగా వారి కారును పోలీసులు అడ్డుకున్నారు. తమ కుమారుడికి అత్యవసర వైద్యం అవసరమని.. హైదరాబాద్ వెళ్లేందుకు అనుమతించాలని బాధితులు కోరినప్పటికీ పోలీసులు పట్టించుకోలేదు.

చలాన్‌ చెల్లింపునకు దాదాపు అరగంట సమయం పట్టింది. దంపతులిద్దరూ తార్నాకకు చేరుకోగా.. పాప కదలికలు కనిపించలేదు. ఆసుపత్రికి చేరుకోగా అరగంట క్రితం చిన్నారి మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. సకాలంలో ఆసుపత్రికి చేరుకుని ఉంటే తమ కొడుకు బతికేవాడని చిన్నారి తల్లిదండ్రులు వాపోయారు. మరోవైపు మెడికల్ ఎమర్జెన్సీకి వెళ్లే వాహనాలను ఎప్పటికీ ఆపబోమని యాదగిరిగుట్ట ట్రాఫిక్ సీఐ సైదయ్య తెలిపారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Infant death
  • pending challan
  • telangana police

Related News

Hyderabad Commission of Police, V.C. Sajjanar

పెళ్లి ముసుగులో పొంచి ఉన్న ప్రమాదం: సీపీ సజ్జనార్

Telangana police  పెళ్లి పేరుతో జరుగుతున్న కొత్త తరహా మోసాలు ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతున్నాయి. కేవలం ప్రేమ వ్యవహారాల్లోనే కాకుండా, పెద్దలు కుదిర్చిన సంబంధాల్లో కూడా యువతులు మోసపోతుండటంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ కీలక హెచ్చరికలు జారీ చేశారు. నిశ్చితార్థం అయిన తర్వాత కూడా యువతులు అప్రమత్తంగా ఉండాలని ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం మోసగాళ్లు తమ పంథాను మార్చుకున్నారని, ముం

    Latest News

    • బాణాసంచా పేలుడు ఘటన క్షతగాత్రులను పరామర్శించిన పవన్

    • తాడేపల్లి ప్యాలెస్‌లో ఆ ఇద్దరి నేతల మధ్య వార్ !!

    • తెలంగాణలో సరికొత్త రికార్డు నెలకొల్పిన అపోలో ఫార్మసీ

    • Mega CSR Programme : కరీంనగర్‌లో కిస్నా మెగా CSR కార్యక్రమం

    • TVK Vijay Illegal Affair : ఆ నటి వల్ల టీవీకే విజయ్‌ పొలిటిల్ కెరియర్ ప్రమాదంలో పడబోతుందా ?

    Trending News

      • Science Day: ఫిబ్రవరి 28నే సైన్స్ డే ఎందుకు?

      • టీమిండియా కోసం దైవ ద‌ర్శ‌నాలు మొద‌లుపెట్టిన కోచ్ గంభీర్‌!

      • తెలంగాణలో మార్చి 1 నుంచి కొత్త రూల్స్‌!!

      • 2 ఓవర్లలోనే 46 పరుగులు.. ఇదేం బౌలింగ్ దూబే!!

      • టీమిండియాను టెన్ష‌న్ పెడుతున్న వెస్టిండీస్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd