Police Grills Allu Arjun: అల్లు అర్జున్‌ను 4 గంటలపాటు విచారించిన పోలీసులు.. ఎమోషనల్ అయిన బన్నీ!
సంధ్య థియేటర్ ఘటనలో తాజాగా విచారణకు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు సుమారు 4 గంటల పాటు (3 గంటల 35 నిమిషాలు) విచారించారు. అయితే ఈ విచారణలో అల్లు అర్జున్ పలు విషయాలపై పోలీసులకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది.
- By Gopichand Published Date - 06:34 PM, Tue - 24 December 24

Police Grills Allu Arjun: తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్‌గా నడుస్తున్న విషయం సంధ్య థియేటర్ ఘటన. సంధ్య థియేటర్ ఘటనపై మంగళవారం పోలీసులు చూపిన వీడియో చూసి అల్లు అర్జున్ (Police Grills Allu Arjun) భావోద్వేగానికి లోనైనట్లు తెలిసింది. 18 ప్రశ్నలకు గాను 15 ప్రశ్నలకి సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. తన వల్ల కొన్ని తప్పులు జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నట్లు సమాచారం. మళ్ళీ విచారణకు పిలిస్తే ఎప్పుడైనా హాజరు అవుతానని అల్లు అర్జున్ చెప్పినట్లు వార్తలు వస్తున్నాయి.
సంధ్య థియేటర్ ఘటనలో తాజాగా విచారణకు హాజరైన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ను పోలీసులు సుమారు 4 గంటల పాటు (3 గంటల 35 నిమిషాలు) విచారించారు. అయితే ఈ విచారణలో అల్లు అర్జున్ పలు విషయాలపై పోలీసులకు స్పష్టత ఇచ్చినట్లు తెలుస్తోంది. అయితే సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటన వీడియోను పోలీసులు బన్నీకి చూపినట్లు తెలుస్తోంది. ఈ వీడియో చూసిన ఐకాన్ స్టార్ కాస్త ఎమోషనల్‌కు గురైనట్లు సమాచారం. ఈ విచారణలో మొత్తం 18 ప్రశ్నలను పోలీసులు బన్నీని అడగగా.. అందులో 15 ప్రశ్నలకు మాత్రమే అల్లు అర్జున్ సమాధానం చెప్పినట్లు టాక్.
Also Read: Sandhya Theater Incident : అల్లు అర్జున్ వివాదంపై స్పందించిన దిల్ రాజు
మిగతా మూడు ప్రశ్నలకు తనకు తెలియదని.. థియేటర్ లోపల చీకటి గా ఉన్ననందున అర్ధం కాలేదని బన్నీ సమాధానమిచ్చినట్లు తెలుస్తోంది. తన వల్ల కూడా కొన్ని మిస్టేక్స్ జరిగినట్లు అల్లు అర్జున్ ఒప్పుకున్నారని పోలీస్ వర్గాలు తెలిపాయి. పోలీసుల విచారణ సమయంలో మూడు సార్లు అల్లు అర్జున్ మంచినీరు తాగినట్లు తెలుస్తోంది. పూర్తి విచారణను పోలీసులు వీడియో రికార్డ్ చేసినట్లు చెప్పారు. విచారణ అనంతరం బన్నీ తన కారులో ఉన్న బిస్కట్స్, డ్రై ఫ్రూట్స్ తినేసి, టీ తాగేసి తన ఇంటికి వెళ్లినట్లు సమాచారం. అయితే విచారణకు 24 గంటలు అందుబాటులో ఉంటానని బన్నీ చెప్పినట్లు తెలుస్తోంది.
ఎండ్ కార్డ్ పడనుందా?
సంధ్య థియేటర్ ఘటనకు ఎండ్ కార్డ్ పడనుంది. బాధిత కుటుంబానికి భరోసా ఇచ్చేందుకు అల్లు అర్జున్ ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. రూ. 2 కోట్లతో శ్రీతేజ ట్రస్ట్ పెట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ట్రస్ట్ కోసం బన్నీ రూ. కోటి, సుకుమార్ రూ. 50 లక్షలు, మైత్రి మూవీస్ 50 లక్షలు ఇవ్వనున్నారు. ట్రస్ట్ సభ్యులుగా శ్రీతేజ్ తండ్రి, టాలీవుడ్ పెద్దలు ఉండనున్నారు. న్యాయపరమైన చిక్కులు తొలిగిన తర్వాత అల్లు అర్జునే ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ విషయాన్ని వెల్లడించనున్నట్లు టాలీవుడ్‌లో చర్చ నడుస్తోంది.