HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Police Gave A Shock To Those Four Pubs In Hyderabad

New Year Celebrations : హైదరాబాద్ లో ఆ నాల్గు పబ్బులకు షాక్ ఇచ్చిన పోలీసులు

New Year Celebrations : హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు గత వివాదాలు, పోలీసు కేసుల నేపథ్యంలో అనుమతులేమని స్పష్టం చేశారు

  • Author : Sudheer Date : 29-12-2024 - 4:48 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Police Gave A Shock To Thos
Police Gave A Shock To Thos

న్యూ ఇయర్ వేడుకలకు (New Year Celebrations) యావత్ ప్రజలు సిద్ధం అవుతున్నారు. మరికొద్ది గంటల్లో కొత్త ఏడాదిలో అడుగుపెట్టబోతున్న సందర్బంగా చాలామంది 2024 కు గ్రాండ్ గా వీడ్కోలు పలకాలని చూస్తున్నారు. ఇక హైదరాబాద్ (Hyderabad) లో ప్రతి ఏడాది న్యూ ఇయర్ వేడుకలు అంబరాన్ని తాకుతాయనే సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పోలీసులు న్యూ ఇయర్ వేడుకలపై నిఘా పెట్టారు. పబ్‌లు, బార్‌లు, హోటళ్లలో జరిగే సెలబ్రేషన్స్‌కు పటిష్ఠమైన చర్యలు చేపట్టారు. నార్కోటిక్, ఎక్సైజ్, ఎస్ఓటీ విభాగాలతో కలిసి పోలీసులు ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తున్నారు. మైనర్లను బార్లకు అనుమతిస్తే యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పబ్ యజమానులకు సౌండ్ పొల్యూషన్ తగ్గించేందుకు సౌండ్‌ప్రూఫ్ ఫెసిలిటీస్ కల్పించాలని ఆదేశాలు జారీ చేశారు.

పబ్‌లు, హోటళ్లపై పోలీసుల ఆంక్షలు :

జూబ్లీహిల్స్‌లోని మొత్తం 36 పబ్‌లలో నాలుగు పబ్‌లకు అనుమతులు నిరాకరించారు. హార్డ్ కప్, అమ్నేషియా, బ్రాడ్ వే, బేబీలాన్ పబ్‌లకు గత వివాదాలు, పోలీసు కేసుల నేపథ్యంలో అనుమతులేమని స్పష్టం చేశారు. అర్ధరాత్రి ఒంటి గంటలోగా వేడుకలు ముగించుకోవాలని సూచించారు. మద్యం సేవించిన వారికి వాహనాలు నడపనీయకూడదని, అలాంటి వ్యక్తుల ప్రయాణానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని పబ్ యాజమాన్యాలకు సూచించారు.

ట్రాఫిక్ ఆంక్షలు :

నగరంలోని ముఖ్యమైన ఫ్లైఓవర్లు డిసెంబర్ 31 రాత్రి 11 గంటల నుంచి జనవరి 1 ఉదయం 5 గంటల వరకు మూసివేయనున్నారు. శిల్పా లేఅవుట్, గచ్చిబౌలి, షేక్‌పేట్, దుర్గంచెరువు కేబుల్ బ్రిడ్జి వంటి ప్రధాన రహదారులపై ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేస్తున్నారు. ప్రజల భద్రత కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని పోలీసులు తెలిపారు.

క్యాబ్స్, ఆటో డ్రైవర్లకు సూచనలు :

క్యాబ్‌లు, ఆటో డ్రైవర్లు తమ వాహనాలకు సంబంధించిన డాక్యుమెంట్స్ కలిగి ఉండాలని, యూనిఫామ్ ధరించాలని పోలీసులు సూచించారు. ప్రయాణికులను మర్యాదగా అందుకోవాలని, ఎటువంటి అదనపు ఛార్జీలు వేయకూడదని స్పష్టం చేశారు. రైడ్ రిజెక్ట్ చేస్తే ఫిర్యాదులు అందించే ప్రత్యేక నంబర్‌ను అందుబాటులో ఉంచారు.

డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు :

రాత్రి 8 గంటల నుంచే డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు. మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తామని హెచ్చరించారు. మైనర్లు డ్రైవింగ్ చేస్తే వాహనాలను సీజ్ చేస్తామని, సంబంధిత యజమానులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసు సూచనలను గౌరవించాలని, నిబంధనలను పాటించడంలో ప్రజలు సహకరించాలని కోరారు.

Read Also : Social Media : ‘సోషల్ మీడియాను మంచికే వాడుదాం’ అంటూ సరికొత్త క్యాంపెయిన్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • hyderabad pubs
  • new year celebrations

Related News

Murder Sketch On Second Wif

Murder Sketch : రెండో భార్యపై మర్డర్ స్కెచ్ చేసి పోలీసులకు అడ్డంగా దొరికిన వ్యక్తి

నిందితుడు అరుణ్ కుమార్‌కు మల్కాజిగిరికి చెందిన మహమ్మద్ అబ్బు మరియు యాకుత్‌పురకు చెందిన మీర్ ముజమ్మిల్ సహకరించారు. ముఖ్యంగా ముజమ్మిల్ అక్రమ ఆయుధాలకు నిలయమైన బీహార్‌లోని ముంగేర్ ప్రాంతానికి

  • Shivapratap Shukla Appointed As Telangana New Governor

    నేడు హైదరాబాద్‌కు కొత్తగవర్నర్ రాక.. స్వాగతం పలకనున్న సీఎం రేవంత్ రెడ్డి

  • Fish In Beer Bottle

    మద్యం ప్రియుడికి షాక్..బీర్ బాటిల్‌లో చేప పిల్ల కలకలం

  • Ghmc

    జీహెచ్ఎంసీలో పన్నులు ఎగ్గొట్టిన వారి జాబితా సిద్దం.. త్వరలో వీరి ఆస్తులు సీజ్..!

  • Kuktapally Nallacheruvu

    Hyderabad : మరో రెండు చెరువులకు పునరుజ్జీవం పోసిన హైడ్రా !!

Latest News

  • Tata Power : దేశ ఇంధన రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్న టాటా పవర్

  • BSE : మెయిన్‌బోర్డ్‌లోకి ఇన్సోలేషన్ ఎనర్జీ.. పెట్టుబడిదారులకు కొత్త భరోసా

  • Kerala Assembly Election 2026 : కేరళ అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా కాంగ్రెస్

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd