Asha Workers : హైదరాబాద్లో ఆశా వర్కర్లపై పోలీసుల దాడి
Asha Workers : ఆశాలకు లెప్రెసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆశలు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అనేక సార్లు నిరసన చేపట్టినా పట్టించుకోవడం లేదని ఆశలు ఆరోపించారు
- By Sudheer Published Date - 03:03 PM, Mon - 9 December 24

హైదరాబాద్ (Hyderabad) కోఠి డీఎంఈ కార్యాలయం వద్ద ఆందోళన చేపడుతున్న ఆశా వర్కర్స్ (asha Workers ) పై పోలీసులు దాడి(Police Attack) చేయడం పై బిఆర్ఎస్ పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఇచ్చిన హామీ మేరకు ఆశా వర్కర్లకు రూ.18000 ఫిక్స్‌డ్ జీతాలు అందించాలని డిమాండ్ చేస్తూ, వారు ఆందోళన చేస్తుండగా, పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించడంతో విషయాలు ఉద్రిక్తంగా మారిపోయాయి. శాంతియుతంగా ఆందోళన చేస్తున్న ఆశా వర్కర్స్ పై పోలీసులు ఎగిరెగిరి కొట్టారు. ఈ దెబ్బలకు తాళలేక బాధితురాలు తీవ్రంగా కన్నీరుపెట్టుకుంది. అంతేకాదు మహిళా పోలీసులు సైతం అసభ్యకర పదజాలంతో దూషణలు చేసారని బిఆర్ఎస్ వాపోయింది. పోలీసు జులుం నశించాలంటూ పెద్ద ఎత్తున ఆశావర్కర్లు నినాదాలు చేశారు. ఇక ఆశావర్కర్లకు మద్దతు నిలిచిన బీఆర్ఎస్ కార్యకర్తలను కూడా పోలీసులు అరెస్టు చేశారు.
ఆశాలకు లెప్రెసీ, పల్స్ పోలియో పెండింగ్ డబ్బులు చెల్లించిన తర్వాతనే కొత్త సర్వేలు చేయించాలని ఆశలు కోరారు. వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ కార్యాలయం ముందు అనేక సార్లు నిరసన చేపట్టినా పట్టించుకోవడం లేదని ఆశలు ఆరోపించారు. డిసెంబర్ 2 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లేప్రసి సర్వే చేయాలని ఆశాలకు జిల్లా అధికారులు చెప్తున్నారని వెంటనే లెప్రసీ సర్వే కోసం ట్రైనింగ్ కూడా ప్రారంభించారని తెలిపారు. ఈ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఆపాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డబ్బులపై అధికారులు స్పందిస్తూ ప్రభుత్వం నుంచి డబ్బులు రాలేదని ప్రొసీడింగ్ ఆర్డర్స్ ఇచ్చినంత మాత్రాన డబ్బులు ఇచ్చినట్టు కాదని అంటున్నారన్నారు. రెండు సంవత్సరాల నుంచి చేసిన లెప్రసి సర్వే, 2024లో చేసిన పల్స్ పోలియో డబ్బులు రాక ఆశాలు ఆర్థికంగా తీవ్రంగా నష్టపోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. సంవత్సరాల తరబడి చేసిన పనికి డబ్బులు చెల్లించకుండా రాష్ట్ర ప్రభుత్వం మోసం చేస్తుందన్నారు. ఇప్పుడు మళ్లీ కొత్తగా లెప్రసి సర్వే చేయాలని ఒత్తిడి చేయడం ఎంతవరకు న్యాయమని ఆశా వర్కర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఆశా కార్యకర్తలపై పోలీసుల దౌర్జన్యం.
ఆడబిడ్డలు అని కూడా చూడకుండా చీర లాగుతూ, కొడుతున్న మగ పోలీసులు.
ఇది ప్రజా పాలనా లేక కాంగ్రెస్ కౌరవ పాలనా? pic.twitter.com/60uSlFDfoy
— BRS Party (@BRSparty) December 9, 2024
Read Also : The Girlfriend Teaser : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ కు విజయ్ దేవరకొండ మాట సాయం