HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Cinema
  • >The Girlfriend Teaser

The Girlfriend Teaser : రష్మిక ‘ది గర్ల్ ఫ్రెండ్’ టీజర్ కు విజయ్ దేవరకొండ మాట సాయం

The Girlfriend Teaser : ఈ టీజర్ ప్రారంభం కాగానే.. 'నయనం నయనం కలిసే తరుణం.. యదనం తరిగి పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. విసిరి నవ్వుల్లో వెలుగులు చూసా.. నీ నవ్వు ఆపితే చీకటి పగులును తెలుసా.. నీకై మనసును రాసి చేశా.. పడ్డానేమో ప్రేమల బహుశా.. అంటూ విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్

  • Author : Sudheer Date : 09-12-2024 - 12:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
The Girlfrnd
The Girlfrnd

పుష్ప 2 (Pushpa 2)తో భారీ హిట్ అందుకున్న నేషనల్ బ్యూటీ రష్మిక(Rashmika)..త్వరలో ‘ది గర్ల్ ఫ్రెండ్'(The Girlfriend ) సినిమా తో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. రష్మిక, దీక్షిత్ శెట్టి (Rashmika Mandanna – Dheekshith Shetty) ప్రధాన పాత్రలు పోషించిన ఈ చిత్రానికి రాహుల్ రవీంద్రన్ దర్శకత్వం వహించగా.. హేశమ్ అబ్దుల్ వాహబ్ మ్యూజిక్ అందించారు. గీతా ఆర్ట్స్‌ బ్యానర్‌పై అల్లు అరవింద్‌ ఈ సినిమాకు నిర్మాణ బాధ్యతలు చేపడుతున్నారు. ప్రేమ కథతో లేడీ ఓరియంటెడ్‌ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తెలుగుతో పాటు హిందీ, తమిళ్‌, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కాబోతుంది. ఈ సినిమా నుంచి గతంలోనే ఫస్ట్‌ లుక్ వచ్చి ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే.

ఇక ప్రమోషన్లో భాగంగా ఈ సినిమా టీజర్ ను సోమవారం రిలీజ్ చేసారు. ఈ టీజర్ కి విజయ్ దేవరకొండ (Vijay Devarakonda)వాయిస్ ఇచ్చాడు. ఈ టీజర్ ప్రారంభం కాగానే.. ‘నయనం నయనం కలిసే తరుణం.. యదనం తరిగి పెరిగే వేగం.. నా కదిలే మనసుని అడిగా సాయం.. ఇక మీదట నువ్వే దానికి గమ్యం.. విసిరి నవ్వుల్లో వెలుగులు చూసా.. నీ నవ్వు ఆపితే చీకటి పగులును తెలుసా.. నీకై మనసును రాసి చేశా.. పడ్డానేమో ప్రేమల బహుశా.. అంటూ విజయ్ దేవరకొండ తన వాయిస్ ఓవర్ ను తన గర్ల్ ఫ్రెండ్ రష్మిక మందాన సినిమా గర్ల్ ఫ్రెండ్ కోసం ఇచ్చేశాడు. లాస్ట్ లో ‘ఇదేదో పికప్ లైన్ కాదు కదా’ అంటూ రష్మిక మందాన క్యూట్ డైలాగ్ వేస్తుంది. ఓవరాల్ గా ఓ ప్రేమ కవితతో ఈ టీజర్ సాగింది. రష్మిక మందన్న ఓ కాలేజీలో జాయిన్ అవ్వడం, కాలేజీ హాస్టల్ లో జాయిన్ అవ్వడం, ఒక అబ్బాయితో ప్రేమలో పడటం, ఆ ప్రేమలో బాధలు ఉండటం.. టీజర్లో చూపించారు. ఈ టీజర్ చూస్తుంటే ఒక అమ్మాయి కోణంలో సాగే లవ్ స్టోరీ సినిమా అని తెలుస్తుంది.

ఇక అల్లు అర్జున్- రష్మిక మందాన జంటగా నటించిన పుష్ప 2 సినిమా డిసెంబర్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తో దూసుకెళ్తుంది. ఈ సినిమా గత రికార్డులను బ్రేక్ చేసి నయా రికార్డులను సృష్టిస్తుంది. కేవలం 4రోజుల్లోనే 600 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించి బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డుల సునామీని సృష్టిస్తుంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ కు ఎంత క్రేజ్ వచ్చిందో హీరోయిన్ రష్మిక మందానాకు కూడా అంతే క్రేజ్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాతో రష్మిక మందాన పాపులాటి మరింత పెరిగింది.

Read Also : Manchu Manoj Medical Report : వెన్నెముకకు తీవ్ర గాయాలు


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Dheekshith Shetty
  • Rahul Ravindran
  • Rashmika Mandanna
  • The Girlfriend
  • The Girlfriend Teaser
  • vijay devarakonda

Related News

Rashmika Workouts

Rashmika : రోజుకు 8 గంటలు..వామ్మో ఏంటి రష్మిక ఇది !!

ప్రస్తుతం ఆమె బ్యాంకాక్‌లో 'మైసా' చిత్రం కోసం అత్యంత కఠినమైన యుద్ధ శిక్షణ తీసుకుంటోంది. ఈ సినిమాలో ఆమె ఒక పోరాటం చేసే గోండు మహిళగా కనిపించబోతోంది. ఆ పాత్రకు న్యాయం చేసేందుకు అంతర్జాతీయ స్టంట్ కొరియోగ్రాఫర్ ఆండి లాంగ్ పర్యవేక్షణలో

  • Vijay New Film

    Vijay Devarakonda : నాని డైరెక్టర్ తో విజయ్ దేవరకొండ మూవీ !!

Latest News

  • మారుతున్న శాలరీ స్ట్రక్చర్.. ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

  • సీఎస్కేకు గుడ్ న్యూస్‌.. స్టార్ ప్లేయ‌ర్ ఎంట్రీ!

  • TGSRTC : రేపటి నుంచి RTC బంద్..ప్రయాణికులకు కష్టాలు తప్పవా ?

  • IPL 2026 : SRH హ్యాట్రిక్ కొట్టబోతుందా..? ఉప్పల్ స్టేడియం లో నేడు పరుగుల వారదేనా ?

  • IPL 2026 : ఇక ముంబై ని ఆపడం కష్టమేనా ?

Trending News

    • రేపు బ్యాంకుల‌కు సెల‌వు ఉందా?

    • వేసవిలో ఏసీలు ఎందుకు పేలుతాయి?

    • అమెరికా-ఇరాన్ చర్చలకు నో చెప్పిన టెహ్రాన్‌.. ఇస్లామాబాద్‌లో మాత్రం లాక్‌డౌన్!

    • రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి పెరగనున్న కష్టాలు!

    • మ‌రోసారి మెటాలో ఉద్యోగాల కోత‌?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd