Police Recruitment : పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సీఎం గ్రీన్ సిగ్నల్.. తొలుత భర్తీ చేసే పోస్టులివే
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
- By Pasha Published Date - 07:16 AM, Sat - 16 December 23
Police Recruitment : తెలంగాణలో పోలీసు నియామకాలకు సీఎం రేవంత్ రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలీసు నియామకాల ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాతి నుంచి ఇప్పటివరకు పదేళ్లలో జరిగిన ఉద్యోగ నియామకాలపై పూర్తి రిపోర్ట్ ఇవ్వాలని ఆయన ఆర్డర్ ఇచ్చారు. దీనిపై సీఎం రేవంత్ శుక్రవారం సెక్రటేరియట్‌లో సమీక్ష నిర్వహించారు. పోలీసు నియామకాలను పారదర్శకంగా, అవినీతి రహితంగా చేయాలని నిర్దేశించారు. నియామకాలు చేపట్టే క్రమంలో ఏవైనా సమస్యలు ఉంటే తనకు తెలియజేయాలని చెప్పారు. నియామకాల ప్రక్రియలోని లోటుపాట్లు, వాటిని అధిగమించే అంశాలపై సవివరమైన నివేదిక ఇవ్వాలని సీఎం అన్నారు. పోలీస్, ఆర్టీసీ ఉద్యోగుల పిల్లల కోసం కోరుకొండ సైనిక్ స్కూల్ మాదిరిగా ప్రత్యేక రెసిడెన్షియల్ పాఠశాలలను ఏర్పాటుచేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని సూచించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలో వీటిని ఏర్పాటు చేయాలని చెప్పారు.
We’re now on WhatsApp. Click to Join.
తెలంగాణలో 8 ఏళ్లుగా హోం గార్డుల నియామకాలు లేవన్న సీఎం రేవంత్ రెడ్డి.. హోంగార్డుల నియామకాలను చేపట్టాలని(Police Recruitment) డీజీపీని ఆదేశించారు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్‌ని సరిచేసేందుకు హోం గార్డుల సేవల్ని వాడుకోవాలని సూచించారు. హోం గార్డుల ఆరోగ్యం, ఆర్థిక, వైద్య అవసరాలు తీరేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ లెక్కన తొలుత హోం గార్డుల పోస్టుల భర్తీకి పోలీసు శాఖ చర్యలు చేపట్టబోతోంది. ఆ తర్వాతే క్రమంగా మిగతా పోస్టుల భర్తీ దిశగా నోటిఫికేషన్లు ఇస్తుంది. గత పదేళ్లలో జరిగిన పోలీసు రిక్రూట్‌మెంట్లలో అక్రమాలు ఉన్నాయని తేలితే.. సంబంధిత అధికారులను, అక్రమంగా నియమితులైన ఉద్యోగులను పోస్టుల నుంచి తప్పించే అవకాశం ఉందని తెలుస్తోంది.