KTR : రాహుల్‌గాంధీతో పోచారం.. ప్రశ్నాస్త్రాలు సంధించిన కేటీఆర్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు.
- By Pasha Published Date - 10:30 AM, Tue - 25 June 24

KTR : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీపై బీఆర్ఎస్ అగ్రనేత కేటీఆర్ ధ్వజమెత్తారు. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్‌ను సవరించి ఫిరాయింపు చేసే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేస్తామని పెద్దపెద్ద మాటలు చెబుతున్న రాహుల్ గాంధీ.. బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు ఫిరాయించేలా ప్రోత్సహించారని ఆయన ఆరోపించారు. ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హతపై 3 నెలల్లోగా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ ఉల్లంఘించారని మండిపడ్డారు. ఇది రాజ్యాంగాన్ని రక్షించడమా ? అపహాస్యం చేయడమా ? అని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ అంశాన్ని సుప్రీం కోర్టుకు తీసుకెళ్తామని ఆయన వెల్లడించారు.
We’re now on WhatsApp. Click to Join
ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మాజీ అసెంబ్లీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఢిల్లీకి వెళ్లారు. ఆ సందర్భంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ, పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేను పోచారం కలిశారు. దానికి సంబంధించిన ఓ ఫొటోను తాజాగా ట్విట్టర్ వేదికగా షేర్ చేసిన కేటీఆర్(KTR).. రాహుల్ గాంధీ తీరుపై విమర్శలు గుప్పిస్తూ వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ ఓ చేత్తో రాజ్యాంగాన్ని పట్టుకుని.. మరోవైపు ఎమ్మెల్యేల ఫిరాయింపును ప్రోత్సహిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
Also Read :Netanyahu : గాజాపై యుద్ధాన్ని ఆపం.. మా నెక్ట్స్ టార్గెట్ హిజ్బుల్లా : నెతన్యాహు
పోచారం శ్రీనివాస్‌రెడ్డికి మంత్రి పదవి ?
తెలంగాణ మంత్రివర్గంలోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డిని తీసుకొనేందుకు కాంగ్రెస్ హైకమాండ్ పెద్దల నుంచి గ్రీన్‌సిగ్నల్ వచ్చిందని తెలుస్తోంది. పోచారానికి ఉన్న అపార అనుభవం, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఆయనకున్న పట్టును దృష్టిలో పెట్టుకొని మంత్రి పదవి ఇచ్చేందుకు సానుకూలత వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక తెలంగాణ పీసీసీ చీఫ్ పదవి రేసులో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతోపాటు మంత్రి పొన్నం ప్రభాకర్, పార్టీ సీనియర్ నేతలు మహేశ్‌కుమార్‌గౌడ్, మధుయాష్కీగౌడ్, మంత్రి సీతక్క, ఎంపీలు బలరాం నాయక్, సురేశ్ షెట్కర్ ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే ఇంకా ఎవరి పేరును ఖరారు చేయలేదని తెలుస్తోంది. రాష్ట్ర సీనియర్లతో చర్చించి పీసీసీ చీఫ్ పేరును ఫైనల్ చేయనున్నారు.
Rahul Gandhi holds the constitution in one hand, talks big that they will amend schedule 10 of constitution to facilitate defected Public representatives’ automatically disqualification
Same @RahulGandhi promotes defection of 5 BRS MLAs against the anti-defection provisions of… pic.twitter.com/Wjh0WEk4xS
— KTR (@KTRBRS) June 24, 2024