PM Modi: నవంబర్ 7న హైదరాబాద్ కు ప్రధాని మోడీ
ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
- By Praveen Aluthuru Published Date - 09:42 PM, Sat - 4 November 23
PM Modi: ప్రధాని నరేంద్ర మోడీ తెలంగాణ పర్యటన ఖరారైంది. నవంబర్ 7న హైదరాబాద్ ఎల్ బీ స్టేడియంలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించే బీసీ సమావేశంలో పాల్గొనేందుకు తెలంగాణ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోడీ రానున్నారు.
ఢిల్లీ నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని 7వ తేదీ సాయంత్రం 5.05 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నేరుగా ఎల్బీ స్టేడియానికి రానున్నారు. సాయంత్రం 5.30 నుంచి 6.10 గంటల వరకు బీసీ బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తారు . సమావేశం అనంతరం ఆయన సాయంత్రం 6.35 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణమవుతారు.
ఎల్బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన సభను బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లక్ష మందితో సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. బీజేపీ ప్రతినిధుల బృందం ఏర్పాట్లను పరిశీలించింది.
Also Read: world cup 2023: డక్వర్త్ లూయిస్ పద్ధతిలో న్యూజిలాండ్ పై పాక్ విజయం