HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pm Modi Says That Bjp Fights For Telangana Development Who Is Hindering

Telangana Politics: తెలంగాణ అభివృద్ధికి బీజేపీ పోరాటం చేస్తుందన్న ప్రధాని మోదీ.. మరి అడ్డుపడుతోంది ఎవరు?

తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడంపై బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి.

  • Author : Hashtag U Date : 27-05-2022 - 2:51 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Modi
Modi

తెలంగాణ అభివృద్ధికి పోరాటం చేస్తామని సాక్షాత్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనడంపై బీజేపీ మినహా ఇతర పార్టీలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నాయి. అధికారం అంతా వారి చేతుల్లో పెట్టుకుని ఇప్పుడు తెలంగాణ ప్రగతికి ఎవరిపై పోరాటం చేస్తారని ప్రశ్నిస్తున్నాయి? తెలంగాణకు యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన ఐటీఐఆర్ ప్రాజెక్టును రద్దు చేసింది ఎన్డీఏ ప్రభుత్వమే. ఇప్పుడు దానిని మళ్లీ ఇవ్వాల్సింది కేంద్రమే. అక్కడ అధికారంలో ఉన్నది మోదీ ప్రభుత్వమే. ఇక ఆ ఫైల్ పై సంతకం పెడతానని నరేంద్రమోదీ అంటే ఎవరైనా అడ్డు చెప్పగలరా? అలాంటప్పుడు ఎవరిపై పోరాటం చేస్తారంటూ విమర్శలు ఎదురవుతున్నాయి.

తెలంగాణలో అభివృద్ధికి పోరాటం చేస్తామని బీజేపీ రాష్ట్ర నేతలు చెబితే అర్థముంది. వాళ్లు ఢిల్లీ వెళ్లి ప్రధానిని అభ్యర్థించి.. తెలంగాణకు కావలసిన నిధులు, ప్రాజెక్టులు, సంక్షేమ పథకాల్లో కేటాయింపుల పెంపు లాంటివి సాధించుకోవచ్చు. అలాంటిది నిర్ణయాధికారాలు తన వద్దే పెట్టుకుని మోదీ అలా ఎలా అంటారంటూ మేధావి వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. దీంతో మోదీ మాటలు చర్చనీయాంశంగా మారాయి.

తెలంగాణలో కాజీపేటకు రావలసిన కోచ్ ఫ్యాక్టరీని గుజరాత్ కు తీసుకెళ్లింది ఎవరు? భువనగిరిలో ఎయిమ్స్ కు కావలసిన మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాల్సింది ఎవరు? పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదాను ఇవ్వాల్సింది ఎవరు? ఆయుష్ ను చివరి నిమిషంలో గుజరాత్ కు తరలించుకుపోయింది ఎవరు? నిజానికి మోదీ తలచుకుంటే ఒక్క సంతకంతో ఇవన్నీ తెలంగాణలో ఏర్పాటు చేయచ్చు. అభివృద్ధి చేయచ్చు. కానీ అలా చేయలేదు సరికదా వాటి ఏర్పాటు కోసం పోరాటం చేస్తామంటున్నారు.

నరేంద్రమోదీ తలచుకుంటే.. ఐఐఎం, ట్రిపుల్ ఐటీ, పసుపు బోర్డు, గిరిజన విశ్వవిద్యాలయం ఇవన్నీ తెలంగాణకు ఇవ్వడానికి కచ్చితంగా అవకాశం ఉంది. కానీ వాటిని ఇవ్వాల్సిన వారే ఇలా మాట్లాడితే ఎలా అని ఇతర పార్టీలు ప్రశ్నిస్తున్నాయి. పైగా ఇది ఎన్నికల సమయం కూడా కాదు. అయినా మోదీ ఇలా వ్యాఖ్యానించారంటే కచ్చితంగా ఇది దీర్ఘకాలిక రాజకీయ ప్రయోజనాలను ఆశించే అయ్యుంటుందంటున్నారు విశ్లేషకులు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • development issue
  • pm modi
  • Telangana CM KCR
  • telangana politics

Related News

V.D. Satheesan Sworn In as Kerala CM

Kerala CM : నేడు ప్ర‌ధాని మోదీతో కేర‌ళ సీఎం భేటీ.. ప‌లు కీల‌క అంశాల‌పై చ‌ర్చ‌

కేరళ ముఖ్యమంత్రి వి.డి. సతీశన్ నేడు న్యూఢిల్లీలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కలవనున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ప్రధాని మోదీని ఆయ‌న తొలిసారి క‌ల‌వ‌నుండ‌టంతో దీనికి రాజకీయ ప్రాధాన్యత ఏర్పడింది. కేరళలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ (యూడీఎఫ్) ప్రభుత్వం ఇటీవల అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో ఈ భేటీ ఆసక్తికరంగా మారింది. అధికారికంగా సమావేశ అజెండా వెల్లడి

    Latest News

    • RCB : ఐపీఎల్ 2026 విజేత ఆర్సీబీ.. వ‌రుస‌గా రెండోసారి టైటిల్ గెలుచుకున్న రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్‌

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్ : ఆర్‌సీబీ బౌలర్ల ధాటికి కుప్పకూలిన గుజరాత్ బ్యాట్స్‌మ‌న్స్‌

    • Forever New : వైజాగ్‌లో ఫరెవర్ న్యూ సరికొత్త స్టోర్

    • PM-Setu Scheme : ఏపీకి దక్కిన అరుదైన గౌరవం

    • RCB vs GT : ఐపీఎల్ 2026 ఫైనల్: టాస్ గెలిచిన ఆర్‌సీబీ.. రెండో టైటిల్ కోసం ఇరుజ‌ట్లు పోటీ

    Trending News

      • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd