Modi 2lakh Ex-gratia: మృతుల కుటుంబాలకు మోడీ రూ. 2లక్షల ఎక్స్ గ్రేషియా
సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు.
- By Balu J Published Date - 11:51 AM, Tue - 13 September 22

సికింద్రాబాద్‌లో జరిగిన అగ్ని ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రధాని నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. మృతుల కుటుంబాలకు PMNRF నుండి 2 లక్షలు గాయపడిన వారికి 50,000 రూపాయలను ప్రధాని మోడీ ప్రకటించారు. తెలంగాణలోని సికింద్రాబాద్‌లో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా ప్రాణాలు కోల్పోయినందుకు బాధగా ఉంది.
మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తూ.. మృతుల కుటుంబీకులకు రూ. 2 లక్షల చొప్పున పీఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుంచి అందజేస్తామని ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. క్షతగాత్రులకు రూ.50,000 చెల్లిస్తామని మోడీ వెల్లడించారు. సికింద్రాబాద్‌లోని రూబీలో జరిగిన అగ్ని ప్రమాదంలో 8 మంది చనిపోయారు.