HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Plight Of Sex Workers In Yadadri

Sex workers: నాడు ‘ఒళ్లు’ అమ్ముకున్నాం.. నేడు ‘బిచ్చం’ అడుక్కుంటున్నాం!

యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది.

  • Author : Siddartha Kallepelly Date : 26-12-2021 - 7:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
21 Imresizer
21 Imresizer

(యాదాద్రి నుంచి వీడియో జ‌ర్న‌లిస్ట్ వెంక‌ట్‌తో మా ప్ర‌తినిధి సిద్ధార్ధ‌)

‘ఇంతకముందు ఒళ్లు అమ్ముకొని బ్రతికేవాళ్ళం, ఇప్పుడు బిచ్చం అడుక్కొని బతకాల్సివస్తోంది’ యాదాద్రిలో ఓ సెక్స్ వర్కర్ల మాటలివి.

యాదగిరి గుట్టను యాదాద్రిగా మార్చి డెవలప్ చేస్తోన్న సమయంలో అక్కడి ఇబ్బందులన్నీ తొలగించాలని ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగా గుట్ట కింద ఉన్న సెక్స్ వర్కర్స్ కి పునరావాసం కల్పిస్తామని, తాము చేసేవృత్తి మానుకోవాలని ప్రభుత్వం సూచించింది. ప్రభుత్వ సూచనపై ఆలోచించిన సెక్స్ వర్కర్స్ తాము పనిచేసుకొని గౌరవంగా బ్రతుకుతామని అనుకున్నా తమ కులం కారణంగా ఎవరూ పనిలోకి తీసుకోవడం లేదని, దిక్కు లేక ఈ పని చేస్తున్నామని, ప్రభుత్వం పునరావాసం కల్పిస్తే మా బాధలన్నీ తీరుతాయని భావించి సెక్స్ వర్క్ చేయడం ఆపేసారు. దారిచూపుతామని ప్రకటించిన ప్రభుత్వం పత్తా లేకుండా పోయింది. భరోసా ఇస్తారన్న అధికారులే తమ పాలిట గుదిబండలయ్యారని సెక్స్ వర్కర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పునరావాసం కల్పిస్తామని ప్రభుత్వమే చెప్పిందని, ప్రభుత్వం ఇచ్చిన మాట తప్పిందని అన్నప్పుడల్లా మా ఇండ్లపై దాడులు చేసి సెక్స్ వర్క్ చేస్తున్నామని వేధిస్తూ తమ ఇండ్లల్లో అవి దొరికాయ్ ఇవి దొరికాయని ఆరోపిస్తూ తమపై తప్పుడు కేసులు పెట్టి జైళ్ల పాలు చేస్తున్నారని, ప్రశ్నిస్తే పీడీ యాక్టులు పెడుతున్నారని మహిళలు బాధపడుతున్నారు. చేయని తప్పులకు దోషుల్లా చూస్తున్నారని, ఇంట్లోకి వచ్చి మొగుడ్ని, కుటుంబసభ్యులను, అప్పుడప్పుడు వచ్చే చుట్టాలను పట్టుకొని, వీడి దగ్గర ఎంత తీసుకున్నావనో, ఇంకా నడిపిస్తున్నావా అనో చెప్పుకోవడానికి వీలుకాని భాషతో ఇబ్బంది పెడుతున్నారని సెక్స్ వర్కర్స్ చెప్పుకొని బాధపడుతున్నారు.

సెక్స్ వర్క్ మానేసాక తమ పరిస్థితి దారుణంగా అయ్యిందని, తమలో హెచ్ఐవి సోకిన వారు ఉన్నారని, కనీసం నెలనెల మెడిసిన్స్ తెచ్చుకోవడానికి కుడా డబ్బులు ఉండట్లేవని, చూసుకునేవాళ్ళు ఎవరులేరని, కంట్రోల్ బియ్యం ఉంటే తినడం, అది కూడా లేకపోతే నీళ్లు తాగి పడుకుంటున్నామని బాధితులు చెప్తున్నారు. పిల్లల స్కూలు ఫీజులు కట్టలేక బడి మానేపిస్తున్నామని సీఎంని కలిసి తమ బాధలు చెప్పుకోవాలని ఉందని బాధితులు తెలిపారు.

yadadiri sex wrkers

దేశంలో ఎన్నో చోట్ల సెక్స్ వర్క్ జరుగుతోందని, హైటెక్ సెక్స్ వర్కర్స్ ని ప్రభుత్వం ఎందుకు వదిలేస్తుందని యాదాద్రి సెక్స్ వర్కర్స్ ప్రశ్నిస్తున్నారు. తాము మాత్రమే తప్పు చేస్తున్నట్లు తమతో దందా బందు చేయించారని, అన్ని వర్గాల ప్రజలకు ఉపాధి అవకాశాలను కల్పిస్తోన్న ప్రభుత్వం కొత్త జీవితం మొదలుపెట్టాలనుకుంటున్న తమకు ఏదైనా సహాయం చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు 25ఎకరాల భూమిని ఇస్తామని, దానిలో పూలు పండ్లు పెంచడం లాంటి పనులు చేసుకోవచ్చని అప్పటి పోలీస్ అధికారి మహేష్ భగవత్ హామీ ఇచ్చారని కానీ ఇప్పటికీ మాకు ఏం ఇవ్వలేదని యాదాద్రి టెంపుల్ ప్రారంభోత్సవ సమయంలోపైనా తమకు కనీసం గుడిలో స్వీపర్ ఉద్యోగాలైనా ఇవ్వాలని సెక్స్ వర్కర్స్ కోరుతున్నారు.

యాదాద్రిలో దాదాపు 150 కుటుంబాలు తమపూర్వికుల నుండి సెక్స్ వర్క్ చేస్తున్నామని సెక్స్ వర్కర్స్ తెలిపారు. ఇంట్లో ఇద్దరు అమ్మాయిలు పుడితే ఒక అమ్మాయిని చదివించి, ఇంకో అమ్మాయిని సెక్స్ వర్క్ లోకి దించేవాళ్లమని దానికి ప్రధానకారణం కులం కారణంగా తమపై చూపే వివక్షతతో పనిచేద్దామనుకున్నా తమని దూరం పెట్టారని, సమాజంలోని ప్రతి ఒక్కరూ దీనికి బాధ్యత వహించాలని సెక్స్ వర్కర్స్ తమ దీనగాథను తెలిపారు. తినడానికి తిండి లేక, చేద్దామంటే పనిదొరక్క, అప్పులబాధతో చావు బ్రతుకుల మధ్య బతుకు బండిని లాగుతున్నామని,
కేసీఆర్ ని కలిస్తే తమ జీవితాలకు ఒకదారిని చూపిస్తారని ఆశిస్తున్నామని కానీ కలిసే అవకాశం దొరకట్లేదని బాధితులు తమ కన్నీళ్లను hashtagU తో పంచుకున్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • appeal to KCR
  • rehabilitation
  • telangana government
  • yadadiri

Related News

A New Look for the Kaleswaram Temple

Kaleshwaram Temple: కాళేశ్వరం ఆలయానికి కొత్త రూపురేఖలు

తెలంగాణలో ప్రసిద్ధ, చారిత్రక త్రిలింగ క్షేత్రాలలో ఒకటైన జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి క్షేత్రం త్వరలోనే సరికొత్త ఆధ్యాత్మిక వైభవంతో వెలిగిపోనుంది. కాళేశ్వర క్షేత్ర ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చి భక్తులకు అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించేందుకు దేవాదాయ శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. శృంగేరి శారదా పీఠాధిపతి జగద్గురు శ్రీ విదుశే

  • Telangana government fixes the date for the Rythu Bharosa deposit into your account.

    Telangana Rythu Bharosa Status: ఆ రోజు మీ అకౌంట్ లోకి రైతు భరోసా…డేట్ ఫిక్స్ చేసిన తెలంగాణ ప్రభుత్వం

Latest News

  • AP : ఐదు బోధనాసుపత్రుల్లో కృత్రిమ అవయవాల తయారీ యూనిట్లు!

  • Plants: కుబేరుడికి ఎంతో ఇష్టమైన ఈ 3 చెట్లను ఇంట్లో ఈ దిక్కున నాటితే చాలు.. కాసుల వర్షం కురుస్తుంది.

  • Stock Market: స్టాక్ మార్కెట్ జోరు..లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • Accident : విధి నిర్వహణలో విషాదం.. లారీ ఢీకొని రవాణా శాఖ అధికారి వెంకన్న మృతి

  • Keir Starmer: బ్రిటన్‌ ప్రధాని కీర్‌ స్టార్మర్‌ రాజీనామా..అసలు కారణాలు ఇవే!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd