Phone Tapping Case : అమెరికా నుంచి ప్రభాకర్ రావు, శ్రవణ్‌రావులను రప్పించేందుకు కీలక యత్నం
త్వరలోనే ఈ నివేదిక భారత విదేశాంగ శాఖ నుంచి అమెరికా ప్రభుత్వానికి(Phone Tapping Case) చేరనుంది.
- By Pasha Published Date - 09:10 AM, Mon - 20 January 25

Phone Tapping Case : బీఆర్ఎస్ హయాంలో తెలంగాణలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితులుగా టి.ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్‌రావు ఉన్నారు. అప్పట్లో తెలంగాణ స్పెషల్ ఇంటెలీజెన్స్ బ్రాంచ్(ఎస్‌ఐబీ) ఓఎస్డీగా టి.ప్రభాకర్‌రావు వ్యవహరించారు. ప్రస్తుతం ఈ ఇద్దరు నిందితులు అమెరికాలో ఉన్నారు. వారిని భారత్‌కు రప్పించేందుకు తెలంగాణ సీఐడీ విభాగం ముమ్మర కసరత్తు చేస్తోంది. ఈక్రమంలోనే భారత హోంశాఖ ద్వారా భారత విదేశాంగ శాఖకు ఒక నివేదికను పంపింది. అమెరికాతో కుదుర్చుకున్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారం టి.ప్రభాకర్‌రావు, అరువుల శ్రవణ్‌రావులను భారత్‌కు తిరిగి తీసుకురావాలని తెలంగాణ సీఐడీ ఆ నివేదికలో కోరింది.
Also Read :Donald Trump Swearing In : కాసేపట్లో అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్.. ప్రమాణ స్వీకారోత్సవం జరిగేది ఇలా
వాళ్లిద్దరూ ఎక్కడున్నారు ?
త్వరలోనే ఈ నివేదిక భారత విదేశాంగ శాఖ నుంచి అమెరికా ప్రభుత్వానికి(Phone Tapping Case) చేరనుంది. ఆ తర్వాత ఇద్దరు నిందితుల అప్పగింతతో ముడిపడిన చర్యలు మొదలయ్యే అవకాశం ఉంది. ప్రభాకర్‌రావు 2023 మార్చి 11నే అమెరికాలోని ఇల్లినోయీ రాష్ట్రం అరోరా ప్రాంతంలో ఉంటున్నారు. శ్రవణ్‌రావు 2023 మార్చి 15న తొలుత లండన్‌కు, అక్కడి నుంచి 2023 మార్చి 20న అమెరికాకు చేరుకున్నారు. ప్రస్తుతం ఫ్లోరిడా రాష్ట్రంలోని మియామిలో ఉంటున్నారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంపై పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 2023 మార్చి 10న కేసు నమోదైంది. ఆ మరుసటిరోజే డీఎస్పీ దుగ్యాల ప్రణీత్‌రావును పోలీసులు అరెస్టు చేశారు. ఆ వెంటనే ప్రభాకర్‌రావు, శ్రవణ్‌రావులు అమెరికాకు పరారయ్యారు.
Also Read :Inquiry On Kaleshwaram Project : నేడు KCRకు నోటీసులు?
అక్రమ వలసదారుడిగా శ్రవణ్‌రావు
ఈ ఇద్దరూ తెలంగాణ కోర్టులో వేర్వేరుగా మెమోలు దాఖలు చేశారు. అమెరికాలో తమ వివిధ పనులు పూర్తయ్యాక తెలంగాణకు తిరిగి వస్తామని చెప్పారు. అయినా ఇప్పటివరకు తిరిగి రాలేదు. వారిద్దరి వీసా గడువు కూడా ముగిసిపోయింది. రెన్యూవల్ కోసం తెలంగాణ రీజనల్ పాస్‌పోర్ట్ కార్యాలయానికి అప్లై చేయలేదు.ప్రభాకర్‌రావు అమెరికాలోనే గ్రీన్‌కార్డు తీసుకున్నట్లు తెలిసింది. శ్రవణ్‌రావు వీసా గడువు ముగిసింది. అయినా అమెరికాలోనే అక్రమ వలసదారుడిగా ఉంటున్నారు.