HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Phone Tapping Case Sit Records Statements Shanti Kumari Raghunandan

Phone Tapping: ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో కీలక పరిణామం

తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకూ కీలక మలుపులు తీసుకుంటోంది.

  • Author : Kavya Krishna Date : 23-06-2025 - 2:09 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Phone Tapping Case
Phone Tapping Case

Phone Tapping: తెలంగాణలో సంచలనం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజు రోజుకూ కీలక మలుపులు తీసుకుంటోంది. ఇప్పటికే రాష్ట్ర ఇంటెలిజెన్స్ విభాగం (SIB) మాజీ చీఫ్ ప్రభాకర్ రావుపై విచారణ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఇప్పుడు కేసు దర్యాప్తులో కీలకంగా భావించే అధికారుల స్టేట్మెంట్లు సిట్ అధికారులు నమోదు చేయడం గమనార్హం.

తాజాగా, మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) శాంతికుమారి, జిఏడి (జనరల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్‌మెంట్) పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ స్టేట్మెంట్లను సిట్ నమోదు చేసింది. వీరిద్దరూ రివ్యూ కమిటీ సభ్యులుగా గత ప్రభుత్వ హయాంలో పనిచేశారు. రివ్యూ కమిటీ చైర్మన్ హోదాలో శాంతికుమారి 2023 నవంబరులో 618 ఫోన్ నెంబర్ల లిస్ట్‌ను టెలికమ్యూనికేషన్స్ శాఖ (DoT)కు పంపించినట్లు సమాచారం. ఈ లిస్టును SIB చీఫ్ ప్రభాకర్ రావు అందించారని తెలుస్తోంది.

దర్యాప్తులో భాగంగా సిట్ ఇప్పటికే ఐపీఎస్ అధికారులు జితేందర్, అనిల్ కుమార్ ల స్టేట్మెంట్లు కూడా నమోదు చేసింది. వివరాల్లోకి వెళితే, ప్రతి రెండు నెలలకోసారి ప్రభాకర్ రావు రివ్యూ కమిటీకి కొత్త ఫోన్ నెంబర్లను అందజేసే పద్ధతిలో వ్యవహరించారని తెలుస్తోంది. వాటిలో అధిక సంఖ్యలో రాజకీయ నాయకులు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్ నెంబర్లు ఉన్నట్లు సమాచారం.

గత సాధారణ ఎన్నికల సమయంలో ఈ కమిటీ చాలా పెద్ద లిస్టును ఆమోదించిందని, 2023 నవంబరులో పంపిన 618 ఫోన్ నెంబర్ల వ్యవహారంపై సిట్ అధికారులు ప్రాధాన్యతతో స్టేట్మెంట్లు నమోదు చేస్తున్నారు.

ఈ స్టేట్మెంట్లు విచారణలో కీలక ఆధారాలుగా మారే అవకాశం ఉండగా, ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ వర్గాల ప్రమేయంపై స్పష్టత తీసుకురావచ్చని భావిస్తున్నారు. అధికార, ప్రతిపక్ష పార్టీల నాయకులతోపాటు కీలక అధికారులు కూడా ఈ వ్యవహారానికి ఎలా సంబంధించినారన్నదానిపై త్వరలోనే స్పష్టత వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి.

Nara Lokesh : ఇంకొల్లులో డీవీఆర్ సైనిక్ స్కూల్‌ను ప్రారంభించిన మంత్రి లోకేశ్


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 2023 elections
  • DoT
  • IAS IPS Officers
  • Phone tapping
  • Prabhakar Rao
  • Raghunandan
  • Review Committee
  • Shanti Kumari
  • SIT Investigation
  • telangana politics

Related News

Bail period ends... Bandi Bhagirath returns to Cherlapally Jail.

Bandi Bhageerath: ముగిసిన బెయిల్ గడువు.. మళ్లీ చర్లపల్లి జైలుకు బండి భగీరథ్

గత కొన్ని రోజులుగా తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇటీవలే బెయిల్‌పై విడుదలైన ఆయన్ను పోలీసులు తిరిగి చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. న్యాయస్థానం మంజూరు చేసిన మధ్యంతర బెయిల్ గడువు ముగియడంతో గురువారం అర్థరాత్రి వేళ పోలీసులు అతడిని అదుపులోకి తీసుకుని జైలుకు పంపించారు. గతంలో నమోదైన ఈ తీవ్రమైన న

  • BRS leader Balka Suman released on bail from Chanchalguda Jail.

    Balka Suman: చంచల్‌గూడ జైలు నుంచి బీఆర్‌ఎస్‌ నేత బాల్క సుమన్‌కు బెయిల్‌ పై విడుదల

  • We will not spare anyone regarding the SIR issue; CM Revanth issues key directives to MLAs.

    Cm Revanth Reddy: SIR విషయంలో ఎవరినీ ఉపేక్షించబోము.. ఎమ్మెల్యేలకు సీఎం రేవంత్ కీలక ఆదేశాలు

  • Janasena strengthens its position in Telangana politics; another key decision taken recently.

    Janasena Party: తెలంగాణ రాజకీయాల్లో జనసేన బలోపేతం.. తాజాగా మరో కీలక నిర్ణయం

Latest News

  • NTR: ఎన్టీఆర్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్.. ‘గాడ్ ఆఫ్ వార్’ అనౌన్స్​మెంట్​కు టైమ్ ఫిక్స్​

  • Cm ChandraBabu: సీఎం చంద్రబాబు రైతులకు ఏరువాక పున్నమి శుభాకాంక్షలు..

  • Shreyas Iyer: సిరీస్ క్లీన్‌స్వీప్ చేసిన ఐర్లాండ్.. శ్రేయాస్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు

  • Rain Alert: తెలంగాణ జిల్లాల్లో విస్తారంగా భారీ వర్షాలు

  • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

Trending News

    • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd