HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pesticides On The Plate How Safe Is Your Food

Pesticides In Food : పంట ఉత్పత్తుల్లో కెమికల్స్.. రైతుల రక్తంలో పురుగు మందుల అవశేషాలు

పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల రైతుల(Pesticides In Food)  శరీరంలోకి పురుగు మందులు చేరినట్లు గుర్తించారు.

  • Author : Pasha Date : 24-11-2024 - 5:40 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pesticides In Food Healthy Food

Pesticides In Food :  ‘అతి సర్వత్రా వర్జయేత్’ అన్నారు పెద్దలు. ఏ విషయంలోనూ అతి మంచిది కాదు. ఇటీవల కాలంలో పంటలపై అవసరానికి మించిన మోతాదులో క్రిమి సంహారకాల(పెస్టిసైడ్స్)ను పిచికారీ చేస్తున్నారట.  దీనివల్ల ప్రజల ఆరోగ్యానికి అపాయం కలుగుతుంది. ఎందుకంటే.. పంటలపై పిచికారీ చేసే పెస్టిసైడ్స్, అగ్రో కెమికల్స్‌లో సగటున 10 శాతమే పంటలోని  పురుగులు, తెగుళ్ల నివారణకు పనిచేస్తుంది. మిగతా దానిలో కొంత గాలిలో కలిసిపోతుంది. ఇంకొంత భూమిపై పడుతుంది. మరికొంత నీళ్లలో కలుస్తుంది.  ఇంకొంత మోతాదులో పెస్టిసైడ్స్ నేరుగా ఆ పంట ఉత్పత్తుల లోపలికి ఇంకిపోతాయి.

Also Read :Prisoners Salary: జైలు సిబ్బంది కంటే ఖైదీలే ఎక్కువ సంపాదిస్తున్నారట.. ఎలా ?

తదుపరిగా వాటిని మనుషులు తింటారు ఆ రకంగా మనుషుల శరీరంలోకి అగ్రో పెస్టిసైడ్స్, కెమికల్స్ చేరుతున్నాయి. అవి శరీరంలోకి ప్రవేశించాక సైలెంటుగా పనిని మొదలుపెట్టి.. కొత్త కొత్త ఆరోగ్య సమస్యలను క్రియేట్ చేస్తున్నాయి. చివరకు మనిషి ఆయుర్దాయాన్ని తగ్గించేస్తున్నాయి.  పశువులకు వేసే పచ్చిగడ్డిలో కూడా పెస్టిసైడ్స్ ఉంటున్నాయి. వాటిని తిన్న గేదెలు, ఆవులు ఇచ్చే పాలలో కూడా ఆ పెస్టిసైడ్స్ మూలాలు కనిపిస్తున్నాయి. అవే పాలను మనుషులు తాగుతున్నారు. పరిస్థితి ఎలా తయారైందంటే.. చివరకు తల్లిపాలలో సైతం పెస్టిసైడ్స్ మూలాలు ఉన్నట్లు ఇటీవలే పలు అధ్యయనాల్లో గుర్తించారు.

తెలంగాణ, ఏపీలలో డేంజర్ బెల్స్

మన దేశంలో పురుగుమందుల వినియోగంలో పంజాబ్, హర్యానా తర్వాత ఏపీ, తెలంగాణ రాష్ట్రాలే ఉన్నాయి.తెలంగాణలోని వికారాబాద్, యాదాద్రి, సంగారెడ్డి జిల్లాల్లోని 490 మంది రైతులపై నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ న్యూట్రిషన్‌ (ఎన్‌ఐఎన్‌), ఉస్మానియా బయోకెమిస్ట్రీ విభాగం శాస్త్రవేత్తలు ఇటీవలే అధ్యయనం చేశారు. 341 మంది రైతుల రక్తంలో, మూత్రంలో 11 రకాల హానికారక పురుగు మందుల అవశేషాలు ఉన్నాయని టెస్టింగ్ రిపోర్టుల్లో తేలింది. పిచికారీ సమయంలో అజాగ్రత్త వల్ల రైతుల(Pesticides In Food)  శరీరంలోకి పురుగు మందులు చేరినట్లు గుర్తించారు.

Also Read :NTR First Remuneration : ఎన్‌టీఆర్‌కు సినిమాల్లో ఛాన్స్ ఎలా వచ్చింది ? తొలి రెమ్యునరేషన్ ఎంత ?

పండ్లు, కూరగాయలు, ధాన్యాలలో  పిండి పదార్థాలు, ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు, మినరల్స్‌ ఉంటాయన్నది నిజం. వాటిలోనే పురుగు మందులు, రసాయనాలు కూడా ఉంటాయన్నది కూడా నిజమే. ఎందుకంటే అధిక పంటల దిగుబడి, చీడపీడల నివారణ కోసం రైతన్నలు పెస్టిసైడ్స్, కెమికల్స్‌‌ను విచ్చలవిడిగా వాడేస్తున్నారు. వివిధ రకాల కెమికల్స్ కలిసి ఫుడ్స్ తీసుకోవడం వల్ల చాలామందిలో క్యాన్సర్లు, అల్జీమర్స్, శ్వాస సమస్యలు, జీర్ణకోశ సమస్యలు, గుండె జబ్బులు,  కిడ్నీ సమస్యలు, ఊపిరితిత్తుల సమస్యలు, కాలేయ సమస్యలు  వస్తున్నాయని అధ్యయన నివేదికలు చెబుతున్నాయి. ఈ పెస్టిసైడ్స్, కెమికల్స్ వల్ల పురుషుల లైంగిక సామర్థ్యం కూడా దెబ్బతింటోందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • food
  • Food Quality
  • Food Safety
  • healthy food
  • Pesticides
  • Pesticides In Food

Related News

Zepto

Zepto : ఎక్స్‌పైరీ ఫుడ్ డెలివరీపై చర్యలు.. జెప్టో వేర్‌హౌస్‌లో సోదాలు

హైదరాబాద్‌లో ఫుడ్ సెఫ్టీ అధికారులు త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. న‌గ‌రంలోని ప‌లు ప్రాంతాల్లో అధికారులు దాడులు నిర్వ‌హిస్తున్నారు. ఈ దాడుల్లో విస్తుపోయే వాస్త‌వాలు వెలుగులోకి వ‌స్తున్నాయి. తాజాగా నగరంలోని చంద్రాయణగుట్ట ప్రాంతంలో ఉన్న జెప్టో (Zepto) వేర్‌హౌస్‌పై ఫుడ్ సెప్టీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ త‌నిఖీల్లో గడువు ముగిసిన పలు ఆహార ఉత్పత్తులను స్వాధీనం చే

  • Boys should not eat these foods—if they do, they're in for serious trouble!

    Men Food: అబ్బాయిలు ఈ ఆహార పదార్థాలు తినకూడదు.. తింటే ఇక అంతే సంగతులు!

Latest News

  • YOGA : ఆర్టీసీ హౌస్‌లో ఘనంగా అంతర్జాతీయ యోగా దినోత్సవం

  • Rains : వారం రోజుల పాటు తెలంగాణ‌లో భారీ వ‌ర్షాలు.. ఎల్లో అలెర్ట్ జారీ

  • Jnaneswari: చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసులో ఎన్నో కొత్త మలుపు.?

  • Wedding : జర్మనీలో మొదలైన ప్రేమ.. పల్నాడులో పెళ్లి పీటలు

  • Happy Fathers Day: నాన్నకు ప్రేమతో…

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd