Peddgattu Jatara: పెద్దగట్టు జాతర.. భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు!
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల నేటి నుంచి 20 వరకు జరగనుంది.
- By Gopichand Published Date - 04:32 PM, Sun - 16 February 25

Peddgattu Jatara: తెలంగాణలో రెండో అతిపెద్ద జాతరగా పేరొందిన పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర (Peddgattu Jatara) నేటి నుంచి ఈనెల 20 తేది వరకు జరగనుంది. జాతర ప్రారంభానికి 15 రోజుల ముందు ఆనవాయితీగా చేసే తొలి ఘట్టమైన దిష్టిపూజ కార్యక్రమాన్ని యాదవులు ఘనంగా నిర్వహించారు. రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకువస్తారు. లింగమంతుల స్వామి- చౌడమ్మ దేవతతో పాటు ఇతర విగ్రహాలను కలిగి ఉన్న దేవరపెట్టె పెద్దగట్టు జాతరకు కీలకమైంది.
సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం దురాజ్‌పల్లి గ్రామంలోని శ్రీలింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతర ఈనెల నేటి నుంచి 20 వరకు జరగనుంది. రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద జాతర కావడంతో జిల్లా యంత్రాంగం అన్ని రకాల మౌలిక వసతులు కల్పించారు. ఆలయాన్ని సుందర వనంగా తీర్చిదిద్దారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి జరిగే ఈ జాతరకు.. రెండు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌ఘడ్, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. జాతరకు వచ్చే భక్తుల కోసం వినోద శాలలను ఏర్పాటు చేశారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. 2 వేల మంది సిబ్బందిని నియమించారు. ప్రత్యేకంగా 100 మందితో షీ టీమ్స్ ఏర్పాటు చేశారు. జాతర పరిసర ప్రాంతాలలో మొత్తం 60 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యుత్ కి అంతరాయం లేకుండా ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేశారు. భక్తులకు తాగు నీటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. జాతరకు భక్తుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశారు.
Also Read: IPL 2025 Schedule: మరికాసేపట్లో ఐపీఎల్ 2025 షెడ్యూల్ విడుదల..!
పెద్దగట్టు జాతరనే గొల్లగట్టు జాతర అని కూడా అంటారు. ఇక్కడ లింగమంతులు స్వామి, చౌడమ్మ దేవతలు కొలువుదీరుతారు. అదివారం రాత్రి కేసారం గ్రామం నుంచి దేవరపెట్టెను ఊరేగింపుగా ఆలయ ప్రాంగణానికి తీసుకువస్తారు. గంపలతో గుడిచెట్టు ప్రదక్షణ చేస్తారు. సోమవారం చౌడమ్మకు బోనాలు సమర్పించుట, మొక్కుల సమర్పణ నిర్వహిస్తారు. మంగళవారం గుడి ముందు పూజారులు చంద్ర పట్నం కార్యక్రమం నిర్వహిస్తారు. బుధవారం నెల వారంతో పాటు.. దేవరపెట్టెను కేసారం గ్రామనికి తీసుకువెళ్లాడు. గురువారం మకర తోరణం ఊరేగింపుతో జాతర ముగిస్తుంది. పెద్దగట్టు జాతరలో యాదవులు కీలకపాత్ర పోషిస్తారు.
పెద్దగట్టు జాతర నేపధ్యంలో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై వాహనాల దారి మళ్లింపు చేపట్టినట్లు జిల్లా ఎస్పీ సన్ ప్రితీ సింగ్ తెలిపారు. నేటి నుంచి ఈ నెల 19 వరకు ఆంక్షలు ఉంటాయన్నారు. జాతరకు వచ్చే భక్తుల వాహనాల కోసం పార్కింగ్ స్థలం కేటాయించారు .మెుత్తం 2 వేల మంది పోలీసు సిబ్బంది జాతరలో పాల్గొంటారు. తెల్లవారుజాము నుంచే లింగ మంతులు స్వామి వారిని దర్శించుకోడానికి భక్తులు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్నారు.