Pawan Kalyan Hydra : హైడ్రా కరెక్టే.. కానీ మానవత్వం ఉండాలి – పవన్ కళ్యాణ్
రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా వచ్చాక అక్రమ నిర్మాణాలను కూలగొట్టేస్తామంటున్నారు. ఆయన చేస్తున్నది రైటే
- By Sudheer Published Date - 10:00 PM, Wed - 4 September 24
తెలంగాణ (Telangana) లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తీసుకొచ్చిన ‘హైడ్రా'(Hydra) వ్యవస్థకు ప్రతి ఒక్కరు జై కొడుతున్నారు. తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) సైతం ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ లో చెరువులు, నదీ పరీవాహక ప్రాంతాల్లో ఇళ్లు కట్టడం చూశాను. ఇబ్బందులు రావా అనుకునేవాడ్ని! కానీ ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి హైడ్రా ను తీసుకొచ్చి మంచి పని చేసారు. అక్రమ నిర్మాణాలు కూల్చేస్తున్నారు..అలాగే నోటీసులు జారీ చేస్తున్నారు. కాకపోతే ఇప్పుడు కట్టే వాటికీ నోటీసులు జారీ చేస్తే బాగుంటుంది. ఒకవేళ ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే కట్టిన నిర్మాణాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని.. మానవతా కోణంలో కూడా ఆలోచించాలని పవన్ సూచించారు.
ఎందుకంటే ఎంతో ఖర్చు పెట్టి , అప్పులు చేసి సొంత ఇంటి కళను నెరవేర్చుకుంటారు..కానీ వారికీ ఆ క్షణం అవి అక్రమ నిర్మాణాలని తెలియవు..అధికారులు పర్మిషన్ తో పాటు ఇంటి నిర్మాణానికి కావాల్సిన పర్మిషన్లు ఉండడం తో వారు ఇల్లులు కట్టుకోవడం , లేదా కొనడం చేస్తారు..ఇప్పుడు వాటిని కూల్చేస్తాం అనే కాస్త వారిని ఇబ్బంది. ప్రస్తుతం నిబంధనల ప్రకారం నిర్మాణాలు ఉండేలా చూడాలని ఆయన పేర్కొన్నారు. అన్నీ కట్టేసిన తర్వాత కూల్చేయడం కాదు… ఇలాంటి వాటిని ముందే నివారించేలా చర్యలు తీసుకోవాలి. ముఖ్యంగా అధికారులు వాళ్ల బాధ్యతను వాళ్లు నిర్వర్తించాలి. మనం కూడా ఇలాగే వ్యవహరించాలంటే… అనేక సామాజిక సమస్యలు, సామాజిక ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉంది. దీని గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది” అని పవన్ కల్యాణ్ పేర్కొంన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రికి ఓ సలహా ఇచ్చారు. ఎఫ్టీఎల్, బఫర్ జోన్ పరిధిలో ఇప్పటికే కట్టిన నిర్మాణాలకు పరిహారం ఇచ్చి కూల్చివేయాలని.. మానవతా కోణంలో ఆలోచించాలని పవన్ సూచించారు.
We’re now on WhatsApp. Click to Join.
మరోపక్క ఏపీ ప్రజలు సైతం ఈరోజు విజయవాడ నగరం నీట మునిగిన తర్వాత హైడ్రా వ్యవస్థ ఇక్కడ కూడా తీసుకరావాలని డిమాండ్ చేస్తున్నారు. చెరువులు కబ్జా చేసి ఇళ్ల నిర్మాణం చేయడం వల్ల ఈరోజు విజయవాడ నగరం జలమయంగా మారిందని వాపోతున్నారు. ఇంత జలమయం కావడానికి ప్రధాన కారణం బుడమేరు వాగు (Budameru Floods) ను కబ్జా చేయడమే అని అంటున్నారు. ఆలా కట్టడాలు చేసే సరికి ఈరోజు విజయవాడ నగరం నీట మునిగిందని , అక్రమ కట్టడాలు నిర్మాణం లేకపోతే ఇంత నష్టం వాటిల్లేది కాదని అంటున్నారు. ఏది ఏమైనప్పటికి రేవంత్ తీసుకొచ్చిన హైడ్రా కు రోజు రోజుకు మద్దతు పెరుగుతుండడం కాంగ్రెస్ శ్రేణుల్లో సంతోషం నింపుతుంది.
Read Also : Highest Tax-Paying Cricketers : అత్యధిక ట్యాక్స్ కట్టిన క్రికెటర్ల లిస్ట్… టాప్ ప్లేస్ లో ఉన్నది ఎవరంటే ?
Related News
Floods in AP & TG : అగ్ర హీరోయిన్లు..అనన్యను చూసి బాధ్యత తెచ్చుకోండి
ఇంత డబ్బు తెలుగు ప్రజలు వారిని ఆదరిస్తేనే కదా..వారు సినిమాలు చూడపోతే..వారిని అబిమానించకపోతే వారికీ ఛాన్సులు ఎక్కడివి..వారికీ ఈ లగ్జరీ లైఫ్ ఎక్కడిది