HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Pawan Kalyan Inaugurated The Jana Sena Party Office In Telangana

Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Author : Vamsi Chowdary Korata Date : 19-06-2026 - 5:03 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.
Pawan Kalyan inaugurated the Jana Sena Party office in Telangana.

ఆంధ్రప్రదేశ్‌లో జనసేన పార్టీ అధికార కూటమిలో భాగం కాగా.. ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఉపముఖ్యమంత్రి పదవిలో ఉన్నారు. ఈ క్రమంలోనే ఇటీవలి కాలంలో తెలంగాణలో జనసేన పార్టీని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా హైదరాబాద్‌లో జనసేన పార్టీ సభ నిర్వహణకు పోలీసులు, హైకోర్టు అనుమతులు ఇవ్వకపోవడం.. అధికార కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు చేయడంతో.. వాటన్నింటికీ సమాధానంగా.. తెలంగాణలో జనసేన పార్టీ ఉంటుందని తేల్చి చెప్పిన పవన్ కళ్యాణ్.. ఏ పార్టీ కలిసి వచ్చినా, రాకపోయినా.. ఒంటరిగానైనా బరిలోకి దిగుతామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

ఈ క్రమంలోనే తెలంగాణలోనూ జనసేన పార్టీకి క్షేత్రస్థాయిలో బలం పెంచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో భాగంగానే తెలంగాణ‌పై జ‌న‌సేన పార్టీ ఫుల్ ఫోక‌స్ పెట్టింది. ఇటీవలి కాలంలో పవన్ కళ్యాణ్ హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టడం, ఆ తర్వాత ఢిల్లీలో జరిగిన సేన ప్రస్థానం కార్యక్రమంలో తెలంగాణ గురించి ప్రస్తావించడం.. హనుమకొండలో తన అభిమాని నిరంజన్‌ను కలవడం వంటి వరుస సంఘటనలతో.. పవన్ కళ్యాణ్ తెలంగాణపై దృష్టి పెట్టినట్లు స్పష్టంగా అర్థం అవుతోంది. దీంతో తెలంగాణ జనసేన నేతల్లో సరికొత్త ఉత్సాహం నెలకొంది.

ఇందులో భాగంగానే రాష్ట్రంలో జనసేన పార్టీని విస్తరించడంలో భాగంగా హైద‌రాబాద్ మ‌ణికొండ‌లో కొత్తగా నిర్మించిన జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర కార్యాల‌యాన్ని ప‌వ‌న్ క‌ళ్యాణ్ పూజా కార్యక్రమాల‌తో ఘ‌నంగా ప్రారంభించ‌నున్నారు. రానున్న గ్రేట‌ర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ) ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌డ‌మే ల‌క్ష్యంగా జనసేన పార్టీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. పార్టీ సంస్థాగ‌త నిర్మాణం కోసం ఈ కొత్త ఆఫీసును ప్రారంభించనున్నట్లు జనసేన వర్గాలు చెబుతున్నాయి.

తెలంగాణ‌లో జనసేన పార్టీని బ‌లోపేతం చేసేందుకు తానే స్వయంగా రంగంలోకి దిగుతానని ఇప్పటికే పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ఈ క్రమంలోనే కొత్త ఆఫీస్ ప్రారంభోత్సవం సంద‌ర్భంగా పవ‌న్ కళ్యాణ్ ఏం మాట్లాడ‌నున్నారు అనేది ఇప్పుడు సర్వత్రా ఆస‌క్తిక‌రంగా మారింది. ఇక ఇప్పటికే పవన్ కళ్యాణ్ చేస్తున్న వ్యాఖ్యలు, ఆయన పర్యటనలపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తుండగా.. తాజాగా జనసేన పార్టీ ఆఫీస్ ప్రారంభోత్సవం గురించి ఎలా స్పందిస్తారోననే ఉత్కంఠ నెలకొంది.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Andhra Deputy CM Pawan Kalyan
  • hyderabad
  • janasena party
  • Manikonda
  • Opening
  • Telangana State Office

Related News

Pawan Kalyan visits Niranjan's home; the Janasena chief is set to fulfill a fan's last wish!

Pawan Kalyan: నిరంజన్ ఇంటికి పవన్ కళ్యాణ్.. అభిమాని చివరి కోరిక తీర్చనున్న జనసేనాని!

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తెలంగాణలోని హన్మకొండలో పర్యటించారు. స్థానిక హనుమాన్ నగర్‌కు చెందిన 15 ఏళ్ల నిరంజన్ అనే బాలుడు తీవ్రమైన నరాల సమస్యతో బాధపడుతున్నాడు. దురదృష్టవశాత్తూ వయసు 15 ఏళ్లయినా ఆ వ్యాధి కారణంగా కేవలం రెండు, మూడేళ్ల పిల్లాడిలాగే కనిపిస్తాడు, పైగా కాళ్లు కూడా పనిచేయవు. జీవితంతో పోరాడుతున్న ఆ చిన్నారికి తన అభిమాన హీరో పవన్ కల్యాణ్‌ను కలిసి, ఆయన సినిమా డై

  • Pawan Kalyan's tour in Telangana... Janasena chief to fulfill a young child's last wish.

    Pawan Kalyan: తెలంగాణలో పవన్ కళ్యాణ్ పర్యటన.. చిన్నారి చివరి కోరిక తీర్చనున్న జనసేనాని

  • Leaving behind a high-paying job for an Uber gig in Hyderabad... An inspiring story everyone should know.

    లక్షల ఉద్యోగం వదిలి హైదరాబాద్‌లో ఊబర్ జాబ్.. ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన ఇన్స్పిరేషనల్ స్టోరీ

  • ACB Raids Deputy Director Narahari

    ACB Raids: హైదరాబాద్‌లో ఏసీబీ సోదాల కలకలం

  • Heavy rain forecast for Telangana.

    Telangana: తెలంగాణకు భారీ వర్ష సూచన

Latest News

  • CM Chandrababu : సీఎం చంద్ర‌బాబుని క‌లిసిన గాదె సాయికృష్ణ త‌ల్లి

  • Missing Case : ఫిన్లాండ్‌లో తెలుగు విద్యార్థి అదృశ్యం.. ఆచూకీ కోసం హైకోర్టును ఆశ్రయించిన తల్లిదండ్రులు

  • Janasena: తెలంగాణలో జనసేన పార్టీ ఆఫీస్‌ను ప్రారంభించిన పవన్ కల్యాణ్

  • Shani Anugraham: శని పీడ తొలగిపోవాలంటే శనీశ్వరుడికి.. ఈ వస్తువు సమర్పించాల్సిందే!

  • Pista: ఈ సీజన్‌లో పిస్తా తినడం వల్ల కలిగే ప్రయోజనాలు!

Trending News

    • Kodali Nani: కొడాలి నానిపై ప్రాసిక్యూషన్‌కు ప్రభుత్వ గ్రీన్ సిగ్నల్

    • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd