Pawan Kalyan : నేడు తాండూరు నియోజకవర్గంలో జనసేనాధినేత పర్యటన
పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న యువతకు కావాల్సిన పలు రకాల అంశాలను ఈ సభలో ప్రసగించనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు
- Author : Sudheer
Date : 25-11-2023 - 11:24 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కాసేపట్లో తాండూరు నియోజకవర్గం (Tandur Constituency)లో పర్యటించబోతున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల బరిలో బిజెపి (BJP) తో కలిసి జనసేన పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన (Janasena) పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి సపోర్ట్ చేస్తుంది. ఈ తరుణంలో పవన్ కళ్యాణ్ గత నాల్గు రోజులుగా తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఇప్పటికే సూర్యపేట, దుబ్బాక, కొత్తగూడెంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈరోజు వికారాబాద్ జిల్లాలోని తాండూరు నియోజకవర్గంలో జనసేన అభ్యర్థి నేమూరి శంకర్ గౌడ్ తరపున ప్రచారంలో పాల్గొనబోతున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాండూరు పట్టణంలోని ఇందిరా చౌక్ లో బీజేపీ-జనసేన నిర్వహించే బహిరంగ సభ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. ఈ సభలో పవన్ కళ్యాణ్ నియోజకవర్గంలో ఉన్న యువతకు కావాల్సిన పలు రకాల అంశాలను ఈ సభలో ప్రసగించనున్నారని పార్టీ నేతలు చెపుతున్నారు. గతంలో ఉన్న నాయకులు తాండూర్ నియోజకవర్గానికి చేసింది ఏమి లేదు.. చాలా మంది యువత ఉద్యోగాలు లేక.. నిరుద్యోగులుగా మిగిలి పోవడమే కాకుండా ఈ ప్రాంతంలోని కర్మాగారాలలో రోజువారి కూలీలుగా పనిచేయడం జరుగుతుందని జనసేన ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గౌడ్ తెలిపారు. ఇదే విషయాన్నీ పవన్ ప్రస్తావించనున్నారని తెలిపారు. ఇదిలా ఉంటె నిన్న శుక్రవారం పవన్ కళ్యాణ్ వైజాగ్ లో పర్యటించారు. ఫిషింగ్ హార్బర్ అగ్ని ప్రమాద ఘటనలో నష్టపోయిన బాధితులకు తావంటూ సాయం అందజేశారు.
Read Also : Vizag Fishing Harbour : ఉప్పు చేప ఫ్రై ..40 బోట్లను కాల్చేసింది