Pawan Kalyan Election Campaign : రేపటి నుండి తెలంగాణ ఎన్నికల ప్రచారంలో పవన్ బిజీ బిజీ
రేపు , ఎల్లుండి పవన్ కళ్యాణ్ వరంగల్ , కొత్తగూడెం , సూర్యాపేట , దుబ్బాక లలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు.
- Author : Sudheer
Date : 21-11-2023 - 7:48 IST
Published By : Hashtagu Telugu Desk
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రేపటి నుండి (నవంబర్ 22) తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు. ఈ మేరకు పార్టీ అధికారిక ప్రకటన చేసింది. ఈసారి తెలంగాణ ఎన్నికల ప్రచారం ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. అధికార పార్టీ , ప్రతిపక్ష పార్టీలే కాదు చిన్న చితక పార్టీలు సైతం తమ ప్రచారం తో హోరెత్తిస్తున్నారు. గతంలో కంటే ఈసారి ఎన్నికలు కాకరేపుతున్నాయి. వరుసగా రెండుసార్లు అధికారం చేపట్టిన బిఆర్ఎస్ ఈసారి కూడా బరిలో గెలిచి హ్యాట్రిక్ విజయం సాధించాలని చూస్తుంటే..ఆ ఛాన్స్ ఇవ్వకూడదంటూ కాంగ్రెస్ , బిజెపి లు చూస్తున్నాయి. ఇప్పటికే ఈ మూడు పార్టీలు పోటాపోటీగా ప్రచారం చేస్తూ ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇక తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (TS Polls) బిజెపి (BJP) తో కలిసి జనసేన (Janasena) పోటీ చేస్తున్న సంగతి తెలిసిందే. 8 స్థానాల్లో జనసేన పోటీ చేస్తుండగా..మిగతా స్థానాల్లో బిజెపి కి మద్దతు తెలుపుతుంది. ఈ సందర్బంగా పవన్ కళ్యాణ్ ..బిజెపి , జనసేన అభ్యర్థుల విజయం కోసం ప్రచారం చేయబోతున్నారు. రేపు , ఎల్లుండి పవన్ కళ్యాణ్ వరంగల్ , కొత్తగూడెం , సూర్యాపేట , దుబ్బాక లలో నిర్వహించే భారీ బహిరంగ సభల్లో పవన్ కళ్యాణ్ పాల్గొనబోతున్నారు. ఈ మేరకు షెడ్యూల్ ను జనసేన పార్టీ అధికారికంగా విడుదల చేసింది.
రేపు (నవంబర్ 22) ఉదయం 11 గంటలకు కొత్తగూడెం లో జరిగే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు. ఆ తర్వాత మధ్యాహ్నం 2 గంటలకు వరంగల్ సభలో పాల్గొంటారు.
ఎల్లుండి (నవంబర్ 23) మధ్యాహ్నం 2 గంటలకు సూర్యాపేట లో జరగబోయే సభలో పాల్గొంటారు. సాయంత్రం 4 : 30 కు దుబ్బాక లో జరగబోయే సభలో పవన్ కళ్యాణ్ పాల్గొంటారు.

Read Also : Attack On Barrelakka : కొల్లాపూర్ ఇండిపెండెంట్ అభ్యర్థి బర్రెలక్క పై దాడి