Parigi MLA Ram Mohan Reddy : హరీష్ రావు నీ తాటతీస్తా జాగ్రత్త.. ఆ ఎమ్మెల్యే వార్నింగ్
కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు
- Author : Sudheer
Date : 10-04-2024 - 3:22 IST
Published By : Hashtagu Telugu Desk
బిఆర్ఎస్ ఎమ్మెల్యే , మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) ఫై కాంగ్రెస్ పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి (Parigi MLA Ram Mohan Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. ప్రస్తుతం రాష్ట్రంలో లోక్ సభ ఎన్నికల హోరు నడుస్తుంది. గత అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించిన కాంగ్రెస్..లోక్ సభ ఎన్నికల్లో కూడా అదే మాదిరి విజయం సాధించాలని సన్నాహాలు చేస్తుంటే..బిఆర్ఎస్ మాత్రం లోక్ సభ ఎన్నికలతో తమ సత్తా చాటుకోవాలని చూస్తుంది. దీంతో ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం నడుస్తుంది. రీసెంట్ గా తుక్కుగూడ సభలో సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై హరీష్ రావు స్పందిస్తూ..రేవంత్ రెడ్డి కేసీఆర్ పై తిట్ల పురాణం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసింది..రేవంత్ రెడ్డి తిట్ల కోసమా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఫేక్ వార్తలు, లీకులతో దుష్ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇవే రేవంత్ ఫై పలు వ్యాఖ్యలు చేసారు. అయితే హరీష్ రావు వ్యాఖ్యలపై పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్ రెడ్డి స్పందిస్తూ మాస్ వార్నింగ్ ఇచ్చారు.
We’re now on WhatsApp. Click to Join.
హరీష్ రావు … మా సీఎంపై నోటికొచ్చినట్టు మాట్లాడితే తాటతీస్తా జాగ్రత్త… మా సీఎంని చెడ్డీ గ్యాంగ్ సభ్యుడంటావా…? కేసీఆర్ చెడ్డీ గ్యాంగ్ లీడర్ అయితే, కేటీఆర్, కవిత, హరీష్ రావులు చెడ్డీ గ్యాంగ్ సభ్యులు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. పదేళ్ల పాటు తెలంగాణను దోచుకున్న కుల్వకుంట్ల కుటుంబమే పెద్ద చెడ్డీ గ్యాంగ్ అని ఆగ్రహం వ్యక్తం చేసారు. చెడ్డీ గ్యాంగ్ అర్ధ నగ్నంగా దొంగతనాలు చేస్తుంది.. కానీ కేసీఆర్ గ్యాంగ్ తెలంగాణ ప్రజలను పట్టపగలు నిలువునా దోచేశారని విమర్శించారు. హరీష్ రావు కాదు ఆయన కాళేశ్వరం కమిషన్ రావు అని, అడ్డదిడ్డంగా కమిషన్లు బొక్కి ఆ డబ్బు మదం తో నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నాడని..రామ్మోహన్ ఫైర్ అయ్యారు.
Read Also : Kurnool Politics: వైసీపీతో టచ్ లోకి కీలక నేత.. కర్నూల్ టీడీపీకి షాక్