TG Assembly : బిఆర్ఎస్ ఎమ్మెల్యేలకు తొడగొట్టి సవాల్ విసిరిన కాంగ్రెస్ ఎమ్మెల్యే
బడ్జెట్ సమావేశాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి సభలో తొడగొట్టారు
- By Sudheer Published Date - 09:18 PM, Sat - 27 July 24

తెలంగాణ అసెంబ్లీలో (TG Assembly ) ఆసక్తికర సన్నివేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి (Parigi MLA Ram Mohan Reddy) సభలో తొడగొట్టారు. మాములుగా తొడగొట్టే సన్నివేశాలు ఎక్కువగా సినిమాల్లో..ఆ తర్వాత పలు రాజకీయ సమావేశాల్లో చూస్తుంటాం..కానీ అసెంబ్లీ లో కూడా తొడగొట్టి అదరగొట్టారు ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని BRS నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. తొడగొట్టడానికి సిద్ధమంటూ ఆయన తొడగొట్టి మరీ సవాల్ విసిరారు.
We’re now on WhatsApp. Click to Join.
కాంగ్రెస్ పార్టీ ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఫై శనివారం అసెంబ్లీ లో చర్చ పెట్టారు. ఈ క్రమంలో బిఆర్ఎస్ – కాంగ్రెస్ నేతల మధ్య మాటల వార్ నడిచింది. ఇరువురు ఎక్కడ తగ్గేదేలే అంటూ విమర్శలు , ప్రతి విమర్శలు , ఆరోపణలు చేసుకున్నారు. భట్టి బడ్జెట్ అంకెలకు పరిమితం అయ్యిందని..ఇచ్చిన హామీలకు..ప్రవేశ పెట్టిన బడ్జెట్ కు పొంతన లేదని హరీష్ రావు అంటే..పదేళ్లలో బిఆర్ఎస్ పాలన లో రాష్ట్రం అప్పుల్లో మునిగిపోయిందని..అనేక అక్రమాలకు పాల్పడ్డారని సీఎం రేవంత్ అన్నారు.
వందశాతం వాస్తవ బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని ఆర్ధిక మంత్రి భట్టి పునరుద్ఘాటించారు. గత ప్రభుత్వం మాదిరి, గొప్పలకు పోలేదని ,అంతకుముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి వల్లే హైదరాబాద్‌కు వెల్లువలా పెట్టుబడులు వచ్చాయన్న భట్టి విక్రమార్క, గత పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం చేసింది శూన్యమని విమర్శించారు. మహిళలకు వడ్డీలేనిరుణాల కోసం రూ. 20వేల కోట్లు కేటాయించామన్న ఆయన హైదరాబాద్ ప్రగతికి రూ. 10 వేల కోట్లు పెట్టిన ఘనత తమదేనని స్పష్టం చేశారు. నూటిని నూరుశాతం గ్యారంటీలను అమలుచేస్తామని తేల్చిచెప్పారు. ఇదే క్రమంలో తెలంగాణ అసెంబ్లీలో ఆసక్తికర సన్నివేశం జరిగింది. బడ్జెట్ సమావేశాలపై చర్చ సందర్భంగా మాట్లాడిన పరిగి ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి సభలో తొడగొట్టారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని BRS నేతలు వ్యాఖ్యానిస్తున్నారని.. తొడగొట్టడానికి సిద్ధమంటూ ఆయన తొడగొట్టి మరీ సవాల్ విసిరారు. అన్ని రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యత ఉందని, బీఆర్ఎస్ మ్మెల్యే లు ఇప్పటికైనా తమ ప్రభుత్వానికి సహకరించాలని రామ్మోహన్ కోరారు.
Read Also : Devara 2nd Single : ‘దేవర’ నుండి బిగ్ అప్డేట్ రాబోతుంది..