Devara 2nd Single : ‘దేవర’ నుండి బిగ్ అప్డేట్ రాబోతుంది..
అతి త్వరలో సెకండ్ సాంగ్ రాబోతుందని, ఈసారి లవ్ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది
- By Sudheer Published Date - 08:33 PM, Sat - 27 July 24

నందమూరి అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న మూవీ ‘దేవర’ (Devara). ఎన్టీఆర్ (NTR) తో జనతా గ్యారేజ్ వంటి సూపర్ హిట్ మూవీ ని తెరకెక్కించిన కొరటాల శివ(Koratala Shiva)..మరోసారి ఎన్టీఆర్ తో దేవర పేరుతో ఓ భారీ యాక్షన్ మూవీ చేస్తున్నాడు. రెండు పార్ట్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా తాలూకా ఫస్ట్ పార్ట్ సెప్టెంబర్ 27న మూవీ పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కానుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటూ వస్తున్న ఈ చిత్రం తాలూకా అప్డేట్స్ ఒక్కోటిగా బయటకు వస్తూ సినిమాపై అంచనాలు పెంచేస్తున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ సాంగ్ (ఫియర్ సాంగ్) విడుదలైంది. ప్రేక్షకులను ఈ సాంగ్ అద్భుతంగా అలరించింది. సినిమాపై భారీగా అంచనాలు పెంచింది. ఈ నేపథ్యంలోనే సెకెండ్ సింగిల్ ఎప్పుడెప్పుడు వస్తుందా? అని ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలో ఈ చిత్రంలోని సెకండ్ సింగిల్ ఆగస్టు 2 లేదా 3న రాబోతున్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ ఓ అప్డేట్ ఇచ్చారు. అతి త్వరలో సెకండ్ సాంగ్ రాబోతుందని, ఈసారి లవ్ సాంగ్ ని విడుదల చేయబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు సోషల్ మీడియాలో హింట్ ఇచ్చింది.
ఇక ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ మూవీలో జూనియర్ ఎన్టీఆర్, జాన్వీ కపూర్ తోపాటు ప్రకాష్ రాజ్, శ్రీకాంత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా వస్తున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో విడుదలకానుంది. తీర ప్రాంతం కథ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుంది. కాగా ఈ మూవీ లో విలన్ గా సైఫ్ అలీ ఖాన్ తో పాటు ‘యానిమల్’ ఫేమ్ బాబీ డియోల్ నటిస్తున్నారు.
Read Also : Heart Patiants : హార్ట్ పేషెంట్లు జిమ్‌లో ఈ తప్పులు చేయకూడదు, ఈ విషయాలు గుర్తుంచుకోండి..!