HYDRA : మీరే అనుమతి ఇచ్చి..మీరే కూల్చేస్తే ఎలా..? – కిషన్ రెడ్డి
అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం తో మోపుతూ..ఎక్కడిక్కడే కూల్చేస్తు వస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు..అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారంతా భయపడుతున్నారు
- By Sudheer Published Date - 09:36 PM, Sat - 24 August 24

హైదరాబాద్ (Hyderabad) లో గత కొద్దీ రోజులుగా ‘హైడ్రా’ (HYDRA ) వణుకుపుట్టిస్తుంది. అక్రమ కట్టడాలపై ఉక్కుపాదం తో మోపుతూ..ఎక్కడిక్కడే కూల్చేస్తు వస్తుంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులే కాదు..అక్రమంగా భవనాలు నిర్మించుకున్న వారంతా భయపడుతున్నారు. తాజాగా ఈరోజు నాగార్జున కు సంబదించిన n కన్వెన్షన్ (N Convention) ను హైడ్రా కూల్చేసింది. ఈ కూల్చివేత కు సంబంధించి ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మాట్లాడుకుంటున్నారు. కొంతమంది హైడ్రా చర్యలపై ప్రశంసలు కురిపిస్తుంటే..మరికొంతమంది మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వాలు కట్టడాలకు గ్రీన్ సిగ్నల్ ఇస్తేనే కట్టుకున్నారు..ఇప్పుడు ప్రభుత్వం మరి..కట్టడాలను కూల్చేస్తాం అంటే ఎలా అంటూ ప్రశ్నిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఇదే విషయాన్నీ కేంద్రమంత్రి కిషన్ రెడ్డి (Kishan Reddy) పేర్కొన్నారు. హైదరాబాద్ నగరంలో ఆక్రమణల కూల్చివేతలపై ఆయన స్పందించారు. హైడ్రా పేరుతో ప్రభుత్వం హైడ్రామా ఆడుతోందని , గతంలో అక్రమ నిర్మాణాలకు ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి… ఇప్పుడు ప్రభుత్వమే కూల్చివేయడం విడ్డూరమన్నారు. అసలు అప్పుడు అనుమతులు ఎలా ఇచ్చారో చెప్పాలని నిలదీశారు. అక్రమ కట్టడాలపై సమగ్ర చర్చ జరగాల్సి ఉందన్నారు. అక్రమ నిర్మాణాలపై ఎలాంటి చర్యలు తీసుకున్నా అందరికీ వర్తింప చేయాలన్నారు. కానీ ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారు చేస్తామంటే కుదరదన్నారు. గతంలో కాంగ్రెస్, బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఇష్టారాజ్యంగా చెరువులు, కుంటలను ఆక్రమించుకునేలా పాలన చేశాయని, ఇప్పుడేమో కూల్చివేస్తున్నాయని విమర్శించారు.
Read Also : Telangana: రైతులను పట్టించుకోని రేవంత్, సీపీఎం భారీ ధర్నాకు పిలుపు