Telangana
-
Rain Alert: బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఈ రాష్ట్రాల్లో అతి భారీ వర్షాలు
గత కొన్ని రోజులుగా దేశంలో అనేక ప్రాంతాల్లో వానలు తగ్గి ఎండలు, ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) చల్లని కబురు చెప్పింది. మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకోనున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడుతున్న ఒక బలమైన వాతావరణ వ్యవస్థ (అల్పపీడన ద్రోణి) కారణంగా ఈ రుతుపవనాలు తిరిగి చురుగ్గా మారేందుకు అనుకూలమైన పరిస్థితులు ఏర్పడ్డాయని శాస్త్రవేత
Date : 15-07-2026 - 10:45 IST -
Revanth Reddy Cabinet: కాంగ్రెస్‌లో పదవుల జాతర.. ఆ ఇద్దరికి మంత్రి పదవులు ఖాయం.. రేసులో ఉన్నది వీరే
తెలంగాణలో అధికార కాంగ్రెస్ ప్రభుత్వం కీలకమైన రాజకీయ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శాసనమండలి సభ్యులుగా (MLCs), ప్రభుత్వ విప్‌లుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న అద్దంకి దయాకర్ మరియు బల్మూర్ వెంకట్లకు ‘రాష్ట్ర మంత్రి హోదా’ (Cabinet Rank status) కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు వారిద్దరికీ కేబినెట్ మంత్రులకు అందించే అధికారాలు, ప్రొటోకాల్ మరియు ఇతర సదుపాయాలను కల్పించాల
Date : 15-07-2026 - 10:05 IST -
Ram Mohan Naidu: 2028 జూన్ 2 నాటికి వరంగల్ లో ఎయిర్ పోర్ట్ : రామ్మోహన్ నాయుడు
తెలంగాణలోనే చారిత్రక ప్రాధాన్యత కలిగిన వరంగల్ నగరానికి అంతర్జాతీయ స్థాయి విమానయాన సౌకర్యం కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. వరంగల్ మామునూర్ ఎయిర్పోర్ట్ నిర్మాణ పనులను 2028 జూన్ 2 నాటికి (తెలంగాణ అవతరణ దినోత్సవం నాటికి) సంపూర్ణంగా పూర్తి చేస్తామని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. ఈ విమానాశ్రయాన్ని కేవలం ఒక రవాణా కేంద్రంగాన
Date : 15-07-2026 - 9:42 IST -
Revanth Reddy: తెలంగాణ అభివృద్ధికి.. సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ ప్లాన్!
తెలంగాణ రాష్ట్ర సమగ్ర అభివృద్ధిని కాంక్షిస్తూ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాజకీయాలకు అతీతంగా ఒక కీలకమైన ముందడుగు వేశారు. ఎన్నికలు, రాజకీయం కేవలం పోలింగ్ వరకే పరిమితం కావాలని, రాష్ట్రాభివృద్ధి విషయంలో రాజకీయ పార్టీలన్నీ విభేదాలను పక్కనబెట్టి కలిసికట్టుగా పనిచేయాలని సీఎం పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో, కేంద్ర ప్రభుత్వం వద్ద సుదీర్ఘ కాలంగా పెండింగ్‌లో ఉన్న వివిధ
Date : 14-07-2026 - 2:53 IST -
Perni Nani: నిరంజన్ చావుకు పేర్ని నానినే కారణం.. బాలుడు తండ్రి షాకింగ్ కామెంట్స్
అరుదైన జన్యుపరమైన వ్యాధితో పోరాడుతూ ఇటీవల కన్నుమూసిన హనుమకొండకు చెందిన పవన్ కళ్యాణ్ అభిమాని నిరంజన్ వ్యవహారం మరోసారి రాజకీయ చర్చకు దారి తీసింది. నిరంజన్‌ను పరామర్శించేందుకు పవన్ కళ్యాణ్ స్వయంగా అతని ఇంటికి వెళ్లి ధైర్యం చెప్పడమే కాకుండా.. భవిష్యత్తులో ఓజీ-2 సినిమా కలిసి చూస్తామని హామీ ఇచ్చారు. అయితే ఆ కోరిక నెరవేరకముందే నిరంజన్ మృతి చెందడం అందరినీ కలచివేసింది. నిరంజ
Date : 14-07-2026 - 9:27 IST -
Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు
గోదావరి జలాల వినియోగంతోపాటు.. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, బనకచర్ల లింక్ ప్రాజెక్టు వంటి అంశాలపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి ఉపశమనం లభించలేదు. తెలంగాణ సర్కార్ దాఖలు చేసిన పిటిషన్‌లో సాంకేతిక లోపాలను సరిదిద్దే వరకు ఈ పిటిషన్లపై విచారణ చేపట్
Date : 13-07-2026 - 2:09 IST -
Kothagudem: భద్రాద్రి జిల్లాలో బాలికపై సామూహిక లైంగిక దాడి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో తీవ్ర కలకలం రేపిన మైనర్ బాలికపై సామూహిక అత్యాచార ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సమాజంలో నానాటికీ దిగజారుతున్న మానవీయ విలువలపై ఈ ఘటన మరోసారి ఆందోళన రేకెత్తించింది. ఒక యువకుడు సదరు మైనర్ బాలికతో నమ్మకంగా స్నేహం నటిస్తూ, ఆమెను నమ్మించాడు. ఆపై తన క్రూరమైన వంచన బుద్ధిని బయటపెట్టి, తన ఇద్దరు స్నేహ
Date : 13-07-2026 - 12:07 IST -
kavitha: ఎన్నికల సంఘానికి కల్వకుంట్ల కవిత కీలక లేఖ
తెలంగాణ రక్షణ సేన పేరుతో పార్టీని స్థాపించిన కల్వకుంట్ల కవితకు కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొత్త పార్టీకి సంబంధించిన పేరుపై అభ్యంతరాలు రావడంతో కేంద్ర ఎన్నికల సంఘం కవితకు లేఖ రాసింది. తాజాగా కవిత తరఫున తెలంగాణ రక్షణ సేన ప్రధాన కార్యదర్శి అనిల్‌కుమార్ కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. తమ తెలంగాణ రక్షణ సేన పార్టీకి (ప్రజా ప్రాతినిధ్య చట్టం, 1951 సెక్షన్ 29A కింద) గుర్తింప
Date : 13-07-2026 - 9:25 IST -
Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి
బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు త్వరలోనే భారతీయ జనతా పార్టీ (BJP) లో చేరబోతున్నారంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి అత్యంత సంచలన ఆరోపణలు చేశారు. హరీష్ రావు ఇప్పటికే కమలం పార్టీ అగ్రనేతలతో రహస్యంగా మంతనాలు జరుపుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ వ్యవహారంపై సీఎం రేవంత్ రెడ్డి బహిరంగంగా సవాల్ విసురుతూ.. “నువ్వు బీజేపీ నేతలతో మాట్లాడలేదని పవిత్ర భద
Date : 11-07-2026 - 4:32 IST -
Hyderabad: పోలీస్ స్టేషన్‌లో నాగుపాము పిల్లలు
న్యాయం కోసం, రక్షణ కోసం ప్రజలు వెళ్లే పోలీస్ స్టేషన్ ఆవరణ ఇప్పుడు అత్యంత ప్రమాదకరమైన జోన్‌గా మారిపోయింది. శాంతి, భద్రతలను కాపాడాల్సిన పీఎస్ ప్రాంగణంలోకి ఏకంగా విషసర్పాలు చొరబడుతుండటంతో అటు పోలీసులు, ఇటు సామాన్య జనం బెంబేలెత్తిపోతున్నారు. హైదరాబాద్‌లోని మధురానగర్ పోలీస్ స్టేషన్‌లో తాజాగా చోటుచేసుకున్న ఉదంతం నగరవాసులను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది. స్టేషన్ ప్రా
Date : 11-07-2026 - 2:50 IST -
Businessman Missing: స్విట్జర్లాండ్ విహారయాత్రలో అదృశ్యమైన హైదరాబాద్ దంపతులు.. రూ. 50 కోట్ల కుంభకోణంలో పోలీసుల దర్యాప్తు!
కుమార్తె ఫిర్యాదు ఆధారంగా, పోలీసులు అదృశ్యమైన కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. స్విట్జర్లాండ్‌లో విహారయాత్రకు వెళ్లిన హైదరాబాద్‌కు చెందిన ఒక జంట, తమ కుటుంబంతో సంబంధాలు తెంచుకుని అదృశ్యమయ్యారని సమాచారం అందింది. దీంతో పోలీసులు వారి ఆచూకీ కోసం దర్యాప్తు ప్రారంభించారు. పెట్టుబడిదారుల నుంచి భారీ మొత్తంలో డబ్బు వసూలు చేసిన తర్వాత ఈ జంట దేశం విడిచి పారిపోయి ఉండవచ
Date : 11-07-2026 - 12:08 IST -
Kavitha: కాంగ్రెస్ ప్రభుత్వానికి కవిత వార్నింగ్
ఖమ్మం జిల్లా సత్తుపల్లిలోని సింగరేణి జేవీఆర్ ఓపెన్ కాస్ట్ (JVR OC) గని వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. బిఆర్ఎస్ నాయకురాలు, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన సింగరేణి ‘బాయిబాట’ ముగింపు కార్యక్రమం సందర్భంగా ఈ హైడ్రామా చోటుచేసుకుంది. భద్రతా కారణాల దృష్ట్యా కవితను గని లోపలికి అనుమతించలేమంటూ సింగరేణి అధికారులు, పోలీసులు ఆమెను గేటు వద్దే అడ్డుకున్న
Date : 11-07-2026 - 11:28 IST -
Cm Revanth: కేటీఆర్ కు సీఎం రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్
ఖమ్మం జిల్లాలో జరిగిన ‘ప్రజా ఆశీర్వాద సభ’ (రైతు ఆశీర్వాద సభ) వేదికగా ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) లక్ష్యంగా అత్యంత ఘాటు పదజాలంతో విరుచుకుపడ్డారు. ఇటీవల కేటీఆర్ కన్నెపల్లి పంప్‌హౌస్ ప్రాంతాన్ని సందర్శించి, మేడిగడ్డ బ్యారేజీలో తక్షణమే నీటిని నింపాలని చేసిన వ్యాఖ్యలపై సీఎం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఇంజనీరింగ్ లోపాలతో ఇ
Date : 11-07-2026 - 10:52 IST -
Telangana Govt Jobs: తెలంగాణలోని నిరుద్యోగులకు తీపి కబురు
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్రంలోని నిరుద్యోగులకు మరో తీపి కబురు అందించింది. టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డిపార్ట్‌మెంట్‌లో ఖాళీగా ఉన్న 7 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి సరికొత్త నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ ఉద్యోగాలలో స్టేట్ లెవెల్ క్యాడర్‌లో 2 పోస్టులు, అలాగే మల్టీ జోనల్ క్యాడర్‌లో 5 పోస్టులు అందుబాటులో ఉన్నాయి. అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వార
Date : 11-07-2026 - 10:26 IST -
Monsoon Rains: మునుపెన్నడూ చూడని వాతావరణ మార్పులు
ప్రస్తుత వర్షాకాలం సీజన్ కాస్తా ఎండాకాలాన్ని తలపిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ‘ఎల్నినో’ (El Niño) ప్రభావం కారణంగా రుతుపవనాల గమనం దెబ్బతిని, ఆశించిన స్థాయిలో వర్షాలు కురవకపోగా భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. సాధారణంగా జూన్, జూలై నెలల్లో భారీ వర్షాలతో చెరువులు, కుంటలు నిండాల్సి ఉండగా, దానికి భిన్నంగా తెలుగు ర
Date : 11-07-2026 - 10:05 IST -
Rythu Ashirvada Sabha: రైతు ఆశీర్వాద సభకు భారీ ఏర్పాట్లు
జిల్లా పరిధిలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించ తలపెట్టిన ‘రైతు ఆశీర్వాద సభ’కు జిల్లా యంత్రాంగం అన్ని రకాల ఏర్పాట్లను పూర్తి చేసింది. సభకు హాజరయ్యే రైతులు, ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా వేదిక నిర్మాణం, తాగునీరు, నీడ వంటి మౌలిక వసతులను అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు. భారీ ఎత్తున జనం తరలివచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో, సభా ప్రాంగణం వద్ద మరియు పరిసర ప్రాంతాలలో ఎలాం
Date : 10-07-2026 - 10:31 IST -
Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”
“తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటా” అని ముద్దుల మనవడు అడిగితే తాత ఎలా కాదనగలరు? ఎంత బిజీ రాజకీయ, ప్రజా జీవితంలో ఉన్నప్పటికీ.. మనవడి కోరిక మేరకు కిచెన్‌లోకి అడుగుపెట్టారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పక్కనే మనవడు రుద్రదేవ్, దోసిట్లో నవ్వులు చిందిస్తూ.. నిరంతరం ప్రజా సేవ, అధికారిక సమీక్షలతో బిజీగా గడిపే సీఎం.. తన మనవడితో కలిసి పూరీలు వేస్తూ గడిపిన ఈ కొన్ని క్షణాల
Date : 09-07-2026 - 5:43 IST -
Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు
రాష్ట్రంలో తీవ్ర సంచలనం సృష్టించిన పోక్సో (POCSO) కేసులో కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథకు లీగల్ పరంగా పెద్ద ఉపశమనం లభించింది. భగీరథ్ దాఖలు చేసిన రెగ్యులర్ బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు గురువారం ఆయనకు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ కీలక తీర్పు వెలువరించింది. ఈ కేసులో ఇరుపక్షాల సుదీర్ఘ వాదనలు విన్న అనంతరం హైకోర్టు తుది తీర్పు
Date : 09-07-2026 - 5:09 IST -
Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం
హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ నగరాల సరసన నిలిపేందుకు తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టులో కీలక ముందడుగు పడింది. ఈ మెగా ప్రాజెక్టు పరిధిలోని ప్రాధాన్యతా ప్రాంతాల అభివృద్ధి కోసం రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ రూ.7,345.12 కోట్ల భారీ బడ్జెట్‌కు పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ త
Date : 09-07-2026 - 4:29 IST -
kavitha kalvakuntla: కేటీఆర్ పై కల్వకుంట్ల కవిత ఫైర్
తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను బీఆర్ఎస్‌లోకి వెళ్తానని ప్రచారం చేస్తున్నారని.. అయితే తన కంఠంలో ప్రాణం ఉండగా మళ్లీ బీఆర్ఎస్‌లోకి వెళ్లేదే లేదని, ఆ పార్టీతో జతకట్టేదే లేదని ఆమె స్పష్టం చేశారు. వ్యక్తిగతంగా తాను ఎన్నో అవమానాలకు గురయ్యానని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణి బాయి బాటలో భాగంగా కొత్తగూడెం పర్యటనకు వెళ్లిన సందర్భంగా
Date : 09-07-2026 - 2:57 IST