HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Padi Kaushik Reddy Explain To Ncw Notice Over Telangana Governor Tamilisai

Padi Kaushik Reddy React: ఆ వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదు: పాడి కౌశిక్ రెడ్డి

ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి  (Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యారు.

  • Author : Balu J Date : 21-02-2023 - 4:53 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Koushik Reddy
Koushik Reddy

ఇవాళ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌషిక్ రెడ్డి  (Padi Kaushik Reddy) జాతీయ మహిళా కమిషన్ ముందు హాజరు అయ్యారు. తెలంగాణ గవర్నర్ తమిళసై పై కౌషిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను సుమోటాగా స్వీకరించిన మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది. తన వ్యాఖ్యలపై వివరణ ఇవ్వాలంటూ నోటీసులు రావడంతో మంగళవారం ఆయన ఢిల్లీ వెళ్లారు. జాతీయ మహిళా కమిషన్ ముందు వివరణను ఇచ్చారు. తాను చేసిన వ్యాఖ్యల్లో ఎలాంటి తప్పు లేదని కౌశిక్ రెడ్డి Padi Kaushik Reddy చెప్పారు. తెలంగాణ యాసలో మాట్లాడానని.. తాను వాడిన ఒక పదాన్ని పట్టుకొని అంతా రచ్చ చేస్తున్నారని.. అసలు మొత్తం విషయం వింటే తాను కావాలని అన్నానా లేదా అనే విషయం అర్థం అవుతుందని కౌశిక్ రెడ్డి కమిషన్‌కు తెలియజేసినట్లు సమాచారం.

తాను తప్పేం మాట్లాడలేదని కౌశిక్ రెడ్డి చెప్పుకొచ్చారు. ఒక వేళ తాను అన్నది తప్పని అనుకుంటే ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha)పై ఎంపీ అరవింద్ చేసిన వ్యాఖ్యలకు మహిళా కమిషన్ ఎందుకు రియాక్ట్ కాలేదని ప్రశ్నించారు. బీజేపీ ఎంపీలు బండి సంజయ్, ధర్మపురి అరవింద్ మాట్లాడిన మాటలకు సంబంధించిన వీడియోల ఆధారంగా వారిపై ఫిర్యాదు చేస్తానని కూడా కౌశిక్ చెప్పారు. కాగా, జనవరి 26న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ పాడి కౌశిక్ హుజూరాబాద్‌ (Huzurabad)లో జరిగిన ఒక సమావేశంలో గవర్నర్‌ను ఉద్దేశించి పలు వ్యాఖ్యలు చేశారు. అసెంబ్లీలో తీర్మానం చేసిన ఫైళ్లను గవర్నర్ తొక్కి పెట్టారనే విషయాన్ని మాట్లాడుతూ ఒక అభ్యంతరకరమైన పదాన్ని వాడారు.

గవర్నర్ (Governor) కారణంగా ఒక్క బిల్లు కూడా పాస్ కావడం లేదని ఆరోపించారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలపై సరూర్‌నగర్ పోలీస్ స్టేషన్‌లో బీజేపీ కార్పొరేటర్ కేసు నమోదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలకు వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. గత నెల 28న బీసీ పొలిటికల్ జేఏసీ ఇదే విషయంపై రాష్ట్ర మానవ హక్కుల సంఘానికి కూడా ఫిర్యాదు చేసింది. ఆయనను వెంటనే ఎమ్మెల్సీ పదవి నుంచి భర్తీ చేయాలని డిమాండ్ చేసింది. రాజ్యాంగ పదవిని కౌశిక్ అగౌరవ పరిచాడని పేర్కొన్నది. కానీ కౌశిక్ (Padi Kaushik Reddy) మాత్రం తాను ఎలాంటి తప్పు చేయలేదని బదులిచ్చాడు. పాడిపై మహిళా కమిషన్ ఏం నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే.

Also Read: Boy Killed by Street Dogs: హైదరాబాద్ లో దారుణం.. వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • governor issue
  • governor tamilisai
  • Padi Koushik Reddy
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

  • Draft Of 'core Urban Region

    GHMC : పాత జీహెచ్‌ఎంసీ చట్టానికి స్వస్తి .. హైదరాబాద్‌‌లో కొత్త రూల్స్ ..!

Latest News

  • Revanth Reddy: “తాత.. నువ్వు పూరీలు వేస్తేనే తింటాను”

  • Bandi Bhageerath: బండి భగీరథ్‌కు హైకోర్టు బెయిల్ మంజూరు

  • BSNL శాటిలైట్ ఫోన్‌ను విడుదల చేసింది

  • Musi Riverfront: మూసీ పునరుజ్జీవనానికి గ్రీన్ సిగ్నల్.. రూ.7 వేల కోట్లతో ప్రాజెక్టుకు ప్రభుత్వం ఆమోదం

  • Buggana Rajendranath: సీఎం చంద్రబాబు వల్లే వర్షాలు పడడం లేదు మాజీ మంత్రి

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd