Revanth Reddy -Owaisi : రేవంత్, ఒవైసీలకు ఆ మెసేజ్.. ఇద్దరూ ఏమన్నారంటే ?
Revanth Reddy -Owaisi : ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లు కొందరు ప్రతిపక్ష నాయకుల ఐఫోన్లను హ్యాక్ చేసే ముప్పు ఉందంటూ యాపిల్ కంపెనీ పంపిన అలర్ట్ మెసేజ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.
- Author : Pasha
Date : 31-10-2023 - 3:38 IST
Published By : Hashtagu Telugu Desk
Revanth Reddy -Owaisi : ప్రభుత్వం మద్దతు కలిగిన హ్యాకర్లు కొందరు ప్రతిపక్ష నాయకుల ఐఫోన్లను హ్యాక్ చేసే ముప్పు ఉందంటూ యాపిల్ కంపెనీ పంపిన అలర్ట్ మెసేజ్‌ను టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ పార్టీ నేతల ఫోన్లను బీఆర్ఎస్ ప్రభుత్వం హ్యాక్ చేస్తోందని ఆయన ఆరోపించారు. స్పైవేర్‌ను ఉపయోగించి తమ ఫోన్లను హ్యాక్ చేసే దుష్టపన్నాగంలో బీఆర్ఎస్ పార్టీ ఉందని మండిపడ్డారు. ఈవిధమైన హ్యాకింగ్ ప్రయత్నాలు.. వ్యక్తిగత గోప్యతకు, మానవ గౌరవానికి, రాజకీయ హక్కులకు భంగం కలిస్తాయని రేవంత్ పేర్కొన్నారు.
We’re now on WhatsApp. Click to Join.
ఎన్ని పన్నాగాలు పన్నినా.. తెలంగాణ ప్రజల కోసం తమ పోరాటాన్ని కొనసాగిస్తామని రేవంత్ స్పష్టం చేశారు. తుది శ్వాస దాకా తెలంగాణ ప్రజల కోసం పోరాడుతూనే ఉంటానని తేల్చి చెప్పారు. ప్రజల హక్కుల పరిరక్షణ, న్యాయం కోసం పోరాడడమే కాంగ్రెస్ పార్టీ ఏకైక లక్ష్యమని తెలిపారు. ఇక మజ్లిస్ పార్టీ చీఫ్, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి కూడా యాపిల్ కంపెనీ నుంచి ఇదే విధమైన అలర్ట్ మెసేజ్ వచ్చింది. ఈవిషయాన్ని మంగళవారం ఉదయం ఆయన కూడా ధ్రువీకరించారు. తన ఫోన్ హ్యాకింగ్‌కు గురవుతుందేమో అనే అనుమానం కలుగుతోందన్నారు. ఇవాళ ఉదయం మెయిల్‌ను తెరిచి యాపిల్ నుంచి వచ్చిన మెసేజ్‌ను చదివానని ఒవైసీ (Revanth Reddy -Owaisi) చెప్పారు.