HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Notification For The Recruitment Of Anganwadi Teacher Posts

Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

  • Author : Vamsi Chowdary Korata Date : 30-06-2026 - 3:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Notification for the recruitment of Anganwadi teacher posts!
Notification for the recruitment of Anganwadi teacher posts!

తెలంగాణలో అంగన్‌వాడీ టీచర్లు, హెల్పర్ల ఖాళీల భర్తీకి జిల్లాల వారీగా నోటిఫికేషన్లు విడుదలవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 15 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసే ప్రక్రియలో భాగంగా కలెక్టర్లు తమ తమ జిల్లాల్లో నోటిఫికేషన్లు ఇస్తున్నారు. ఇప్పటికే పెద్దపల్లి, మహబూబ్‌నగర్, నల్గొండ జిల్లాల్లో అధికారిక నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. తాజాగా.. జోగులాంబ గద్వాల జిల్లాలోని నిరుద్యోగ మహిళలకు జిల్లా కలెక్టర్ తీపి కబురు అందించారు. జిల్లాలోని ICDS ప్రాజెక్టుల పరిధిలో సుదీర్ఘ కాలంగా ఖాళీగా ఉన్న అంగన్వాడీ టీచర్లు, గిరిజన ప్రాంతాల అంగన్వాడీ పోస్టుల భర్తీకి అధికారికంగా గ్రీన్ సిగ్నల్ లభించింది. ఈ పోస్టుల భర్తీకి సంబంధించిన అధికారిక నోటిఫికేషన్‌ను విడుదల చేసినట్లు జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఒక ప్రకటనలో స్పష్టం చేశారు. స్థానిక మహిళలకు ఉపాధి కల్పించడంతో పాటు, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో శిశు సంక్షేమ సేవలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ నియామకాలు చేపడుతున్నట్లు ఆయన పేర్కొన్నారు.

జిల్లాలోని మొత్తం మూడు ప్రధాన ఐసీడీఎస్ ప్రాజెక్ట్ కార్యాలయాల పరిధిలో ఈ ఖాళీలు ఉన్నాయి. మొత్తం 73 పోస్టులలో 64 అంగన్వాడీ టీచర్ పోస్టులు కాగా.. 9 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. ఐసీడీఎస్ గద్వాల అర్బన్ ప్రాజెక్టు పరిధిలో అత్యధికంగా ఖాళీలు ఉన్నాయి. మొత్తం 33 పోస్టులను భర్తీ చేయనున్నారు. ఇందులో 28 అంగన్వాడీ టీచర్ పోస్టులు ఉండగా.. 5 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ పోస్టులు కేటాయించారు. ఐసీడీఎస్ మల్దకల్ ప్రాజెక్టు పరిధిలో మొత్తం 26 పోస్టుల భర్తీకి అనుమతి లభించింది. ఇందులో 22 అంగన్వాడీ టీచర్ పోస్టులు, 4 గిరిజన ప్రాంతాల అంగన్వాడీ పోస్టులు ఉన్నాయి. ఐసీడీఎస్ మానవపాడు ప్రాజెక్టు పరిధిలో కేవలం అంగన్వాడీ టీచర్ పోస్టులు మాత్రమే ఖాళీగా ఉన్నాయి. మొత్తం 14 అంగన్వాడీ టీచర్ పోస్టులను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారు.

దరఖాస్తు విధానం- గడువు..

ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అర్హులైన మహిళా అభ్యర్థులు పూర్తిగా ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది.

జూన్ 29 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ అందుబాటులోకి వచ్చింది.

జూలై 8వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే దరఖాస్తు చేసుకునేందుకు గడువు.

అభ్యర్థులు ఆన్‌లైన్ ద్వారా సమర్పించిన దరఖాస్తులను మాత్రమే అధికారులు పరిగణనలోకి తీసుకుంటారు. ఎలాంటి వ్యక్తిగత, ఆఫ్‌లైన్ దరఖాస్తులు స్వీకరించబడవు.

ఉద్యోగానికి కావలసిన విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్ నిబంధనలు, గ్రామాల వారీగా ఖాళీల వివరాలు, దరఖాస్తును ఎలా సబ్మిట్ చేయాలనే పూర్తి వివరాల కోసం మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారిక వెబ్‌సైట్ అయిన https://www.wdcw.tg.nic.in/ ను సందర్శించాలని కలెక్టర్ సూచించారు. అభ్యర్థులు దరఖాస్తు చేసేటప్పుడు తమ సర్టిఫికేట్లను జాగ్రత్తగా అప్‌లోడ్ చేయాలన్నారు. అలాగే, పరిపాలనా కారణాల దృష్ట్యా అవసరమైతే ఈ నియామక ప్రక్రియను ఏ దశలోనైనా రద్దు చేసే లేదా మార్పులు చేసే పూర్తి అధికారం జిల్లా కలెక్టర్‌కు మాత్రమే ఉంటుందని ప్రకటనలో స్పష్టంగా పేర్కొన్నారు.

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 74 Vacancies
  • anganwadi
  • Anganwadi Jobs
  • Anganwadi wokers
  • Job Vacancies
  • telangana

Related News

    Latest News

    • Hyderabad: హైదరాబాద్ సరూర్ నగర్లో భారీ బ్లాస్ట్

    • Sudha Kongara: రెమ్యునరేషన్ వివాదం పై కోర్టుకు వెళ్లిన ‘పరాశక్తి’ డైరెక్టర్ సుధా కొంగర

    • Allari Naresh: అల్లరి నరేష్ పుట్టినరోజు కానుకగా ‘రంభ ఊర్వశి మేనక’ ఫ‌స్ట్ లుక్ రిలీజ్

    • Anganwadi Jobs: అంగన్‌వాడీ టీచర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.!

    • Raghava Lawrence: పొలిటికల్ ఎంట్రీపై ఊహించని ట్విస్ట్.. లారెన్స్ షాకింగ్ నిర్ణయం

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd