HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Not For Bcs Is The Protest Only For Muslim Reservations Bandi Sanjay Is Angry With The Congress

Bandi Sanjay : బీసీల కోసం కాదు? ముస్లింల రిజర్వేషన్ల కోసమే ధర్నా?.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ఆగ్రహం

తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు బీసీల గురించి చర్చించమని చెబుతూ, ముస్లింల ఓట్ల కోసమే ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటున్నారు.

  • By Latha Suma Published Date - 11:26 AM, Wed - 6 August 25
  • daily-hunt
North Eastern states
North Eastern states

Bandi Sanjay : బీసీ రిజర్వేషన్ల అంశంపై ఢిల్లీలో జంతర్‌మంతర్ వద్ద కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఈ ధర్నా నిజంగా బీసీల కోసం కాదు. ముస్లింలకు ప్రత్యేకంగా 100 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తోందే గానీ, బీసీల హక్కుల కోసం కాదంటూ ఆయన ఆరోపించారు. తెలంగాణలో బీసీ హక్కుల కోసం తాము పోరాడుతామని చెబుతున్న కాంగ్రెస్ పార్టీకి నిజమైన ఉద్దేశాలు లేవని విమర్శించారు. కామారెడ్డి డిక్లరేషన్‌ను కాంగ్రెస్ పూర్తిగా విస్మరించిందని గుర్తుచేశారు బీసీల గురించి చర్చించమని చెబుతూ, ముస్లింల ఓట్ల కోసమే ముస్లిం డిక్లరేషన్ అమలు చేయాలనుకుంటున్నారు. ఇది బీసీలను మోసం చేయడమే అని బండి సంజయ్ ఆరోపించారు.

బీసీలకు మద్దతు ఉండదన్న కాంగ్రెస్ భయం

బీసీల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు లేదని, అందుకే మైనారిటీ ఓట్ల మీదే ఎక్కువగా దృష్టి పెట్టిందని బండి సంజయ్ చెప్పారు. తెలంగాణలో బీసీలు కాంగ్రెస్‌ను విశ్వసించడం లేదు. బీసీలను దగా చేస్తూ, వారిని వంచించి ముస్లింలకు అదనంగా రిజర్వేషన్లు ఇవ్వాలని కుట్ర చేస్తున్నారు అని ఆరోపించారు.

రిజర్వేషన్ల లోపల రాజకీయ లెక్కలు

బీసీలకు 5 శాతం మాత్రమే పెంచుతామని చెప్పి, ముస్లింలకు అదనంగా 10 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నది కాంగ్రెస్ దురుద్దేశం. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. బీసీలకు మొత్తం 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తేనే మేము బిల్లుకు మద్దతు ఇస్తాం. లేదంటే ఆ బిల్లును అడ్డుకుంటాం అని బండి సంజయ్ స్పష్టం చేశారు.

చరిత్రలో బీసీలకు న్యాయం చేశారా?

కాంగ్రెస్ పార్టీ తన పాలనలో ఎప్పుడైనా బీసీ వ్యక్తిని ప్రధానిగా చేసిన దాఖలాలు ఉన్నాయా? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 48 ఏళ్లపాటు పాలనలో ఒక్క బీసీని ముఖ్యమంత్రిగా చేశారా? అని బండి సంజయ్ ప్రశ్నించారు. బీసీల కోసం పోరాడుతున్నట్టు చెప్పడం కేవలం డ్రామా మాత్రమే అని ధ్వజమెత్తారు.

కేంద్రంపై నెపం, కానీ స్వయంగా తప్పుకోవడం

బీసీ రిజర్వేషన్ల బాధ్యత కేంద్రంపై మోపి కాంగ్రెస్ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. కేంద్రంపై నిందలు వేయడం సులువు, కానీ బీసీల కోసం పనిచేయాలన్న సంకల్పం కాంగ్రెస్‌లో లేదు అన్నారు.

తెలంగాణలోనూ కాంగ్రెస్ పతనం తప్పదు

తెలంగాణలో కూడా పశ్చిమబెంగాల్, బీహార్, ఉత్తరప్రదేశ్‌లలో కాంగ్రెస్ అనుభవించిన దుస్థితే ఎదురవుతుందని బండి సంజయ్ జోస్యం చెప్పారు. ప్రజలు మోసాలు గుర్తించారు. బీసీలను మోసం చేసే పార్టీలను ఇక వారు అంగీకరించరు అని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలతో బీజేపీ మరియు కాంగ్రెస్ మధ్య బీసీ రిజర్వేషన్ల అంశంపై రాజకీయం మరింత ముదిరినట్టయింది. జాతి, కులాలను కేంద్రీకరించుకుని రిజర్వేషన్ల రాజకీయాన్ని కొనసాగిస్తున్న పరిణామాలు రాష్ట్ర రాజకీయాల్లో కీలక మలుపుకు దారి తీసే అవకాశముంది.

Read Also: RBI: ఆర్‌బీఐ రెపోరేట్లు యథాతథం.. 5.5% శాతంగానే వడ్డీరేట్లు

 


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Bandi Sanjay
  • BJP Criticism
  • Congress party protest
  • Jantar Mantar
  • Kamareddy Declaration
  • Minority votes
  • Muslim Reservations

Related News

BRS leaders are responsible for Kaleshwaram corruption: Bandi Sanjay

BRS : కాళేశ్వరం అవినీతికి బాధ్యులు బీఆర్‌ఎస్‌ నేతలే : బండి సంజయ్‌

బీజేపీ ఎప్పటి నుంచో కాళేశ్వరం అవినీతి అంశంపై సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తూ వస్తోంది. కానీ అప్పట్లో కాంగ్రెస్ మౌనం సంతరించుకుంది. ఇప్పుడు మాత్రం అవినీతికి తలవంచి సీబీఐకి అప్పగించేందుకు సిద్ధమవడం ఆశ్చర్యంగా లేద అన్నారు.

    Latest News

    • Lunar Eclipse : రేపు తిరుమల శ్రీవారి ఆలయం మూసివేత

    • Pushpa 3 : సైమా వేదిక గా పుష్ప-3 అప్డేట్ ఇచ్చిన సుకుమార్

    • Drugs : హైదరాబాద్లో డ్రగ్స్ తయారీ ఫ్యాక్టరీ గుట్టు రట్టు

    • CM Revanth Reddy : నిమజ్జనంలో సడన్ ఎంట్రీ ఇచ్చిన సీఎం రేవంత్ రెడ్డి

    • Maharashtra : శృంగారానికి ఒప్పుకోలేదని కాబోయే భార్యను రేప్ చేసి హతమార్చాడు

    Trending News

      • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

      • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

      • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

      • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

      • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd