Delhi Liquor Policy Case : ఎమ్మెల్సీ కవిత కు నో బెయిల్..
తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా..కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది
- Author : Sudheer
Date : 08-04-2024 - 10:23 IST
Published By : Hashtagu Telugu Desk
ఢిల్లీ లిక్కర్ కేసు (Delhi Liquor Policy Case)లో అరెస్టయి తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై రౌస్ అవెన్యూ కోర్టు తుది తీర్పు ఇచ్చింది. తన చిన్న కుమారుడికి పరీక్షల నేపథ్యంలో బెయిల్ మంజూరు చేయాలని కోర్టును ఆశ్రయించగా..కోర్ట్ మాత్రం బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. కవిత బయటకు వెళ్తే..సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని ఈడీ గట్టిగా చెప్పడం తో కోర్ట్ ఆమెకు బెయిల్ ఇచ్చేందుకు నిరాకరించింది. దీంతో ఆమె తీహార్ జైలు కు పరిమితం కాబోతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఢిల్లీ లిక్కర్ కేసులో గత నెల 15న హైదరాబాద్‌లోని ఆమె నివాసంలో ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. 16న ఆమె ను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరుచగా, 10 రోజులపాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. కస్టడీ ముగియడంతో మార్చి 26న తీహార్ జైలుకు తరలించారు. దీంతో ఆమె జ్యుడీషియల్ కస్టడీ మంగళవారంతో ముగియనుంది. కవిత సాధారణ బెయిల్ పిటిషన్‌పై ఈ నెల 20న ఇరుపక్షాల వాదనలు వింటామని కోర్టు స్పష్టం చేసింది. మరోపక్క కవితను ప్రశ్నించేందుకు సీబీఐకి కోర్టు అనుమతించింది. ఈ తరుణంలోనే తన చిన్న కుమారుడికి పరీక్షలు ఉన్న నేపథ్యంలో… తనకు బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కవిత కోరారు. అయితే, కవిత బెయిల్ పై బయటకు వెళ్తే సాక్షులను ప్రభావితం చేస్తారని కోర్టులో ఈడీ వాదనలు వినిపించింది. ఇప్పటికే కొందరిని కవిత బెదిరించిందని కోర్టుకు తెలిపింది. ఈడీ వాదనలతో ఏకీభవించిన కోర్టు… కవిత బెయిల్ పిటిషన్ ను తిరస్కరించింది. దీంతో ఆమె నిరాశకు గురైంది. మధ్యంతర బెయిల్ వస్తుందని ఆమెతో పాటు ఆమె కుటుంబ సభ్యులు భావించారు కానీ కోర్ట్ మాత్రం షాక్ ఇచ్చింది.
Read Also : CM Kejriwal: కేజ్రీవాల్ సీఎం పదవి ఊడినట్టేనా? ఈ రోజు విచారణపై ఉత్కంఠ