New Wine Shops : తెలంగాణ లో కళకళాడుతున్న కొత్త మద్యం షాపులు
శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాప్స్ ఓపెన్ కావడం తో మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు
- Author : Sudheer
Date : 02-12-2023 - 2:05 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ (Telangana) రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు (New Wine Shops) కళకళలాడుతున్నాయి. డిసెంబర్ 1 నుండి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త మద్యం షాపులు ఓపెన్ అయ్యాయి. సాధారణంగా ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి మద్యం దుకాణాలకు ప్రభుత్వం లైసెన్సులను అందచేస్తుంది.ఒకసారి లైసెన్స్ పొందిన వ్యాపారి రెండేళ్ల పాటు షాప్ ను నిర్వహించుకోవచ్చు.రెండేళ్లకోసారి అక్టోబర్ నెల చివరిలో నోటిఫికేషన్ విడుదల చేసి నవంబర్ లో అనుమతులు అందిస్తారు. ఇక అదే నెలలో మొత్తం ఫీజ్ లో నాలుగో వంతు చెల్లించిన వారికి డిసెంబర్ ఒకటిన దుకాణాలకు లిక్కర్ చేరుతుంది.
We’re now on WhatsApp. Click to Join.
ఈసారి అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఆగస్ట్ నెలలోనే ఈ ప్రక్రియ చేపట్టారు. కాగా నూతన మద్యం దుకాణాలకు డ్రా ద్వారా అనుమతి దక్కిన వారు సెప్టెంబర్ లోనే ప్రభుత్వానికి నాలుగో వంతు తమ ఫీజ్ చెల్లించినప్పటికీ…. ఎన్నికలు లిక్కర్ సేల్స్ కు అంతరాయం కలిగించింది. నవంబర్ 30 నాటికే మద్యం చేరాల్సి ఉండగా ఎన్నికల దృష్ట్యా శుక్రవారం ఉదయం నుంచే మద్యం సరఫరా కావడంతో కొన్ని చోట్ల సాయంత్రం నుండి కొత్త షాప్స్ ఓపెన్ అయ్యాయి. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని వైన్ షాప్స్ ఓపెన్ కావడం తో మందు బాబులు సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నికల నేపథ్యంలో బెల్ట్ షాప్స్ బంద్ కావడం..వైన్ షాప్స్ లలో సరైన మందు దొరకకపోవడం తో చాల నిరాశకు లోనయ్యారు. ఇక ఇప్పుడు కొత్త షాప్స్ ఓపెన్ అవ్వడం..అన్ని బ్రాండ్స్ అందుబాటులో ఉండడంతో సంబరాలు చేసుకుంటున్నారు.
ఈ క్రమంలో తొలిరోజు ఉమ్మడి ఖమ్మం(Khammam) జిల్లాలో దాదాపు రూ.31కోట్ల విలువైన మద్యాన్ని కొత్త వైన్ షాపులకు సరఫరా చేశారు. మద్యం డిపో నుంచి రాత్రి 11గంటల వరకు కూడా ఈ సరఫరా కొనసాగింది. ఖమ్మం జిల్లాలోని 122, భద్రాద్రిలోని 89 వైన్‌షాపులు, 50బార్లు, 3క్లబ్బులు ఉండగా.. వీటన్నింటికీ వైరా(Wyra)లోని ఐఎంఎల్ డిపో నుంచి మద్యాన్ని తరలించారు.
Read Also : YS Sharmila Gift: కేసీఆర్ సూట్ కేసు పట్టుకుని సర్దుకునే టైం వచ్చింది: వైఎస్ షర్మిల