HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >New Incharge For Telangana Congress Details About Meenakshi Natarajan Background

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్ ఎవరు ? ఆమె మొదటి టార్గెట్ అదేనా ?

మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.

  • By Pasha Published Date - 08:04 AM, Sat - 15 February 25
  • daily-hunt
Meenakshi Natarajan Telangana Congress New Incharge

Meenakshi Natarajan : మీనాక్షి నటరాజన్‌.. తెలంగాణ కాంగ్రెస్‌కు కొత్త ఇంఛార్జిగా నియమితులు అయ్యారు. ఇప్పటివరకు ఆమె కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ టీమ్‌లో విధులు నిర్వర్తించారు. తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలు సమీపించిన వేళ రాహుల్‌గాంధీ ప్రత్యేక శ్రద్ధతో మీనాక్షి నటరాజన్‌కు ఈ ముఖ్యమైన బాధ్యతలను అప్పగించారు. ఇంతకీ మీనాక్షి ఎవరు ? ఆమె నేపథ్యం ఏమిటి ?

Also Read :Cabinet Expansion : మంత్రివర్గ విస్తరణ ను రాహుల్ నేడు ఫైనల్ చేస్తాడా..?

మీనాక్షి నటరాజన్‌ నేపథ్యం ఇదీ.. 

  • మీనాక్షి నటరాజన్(Meenakshi Natarajan) మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో 1973 జులై 23న జన్మించారు.
  • ఆమె బయో కెమిస్ట్రీలో పీజీ చేశారు. ఎల్‌ఎల్‌బీ  చేశారు.
  • మధ్యప్రదేశ్‌లోని రత్లాంలో మీనాక్షి తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించారు.
  • 1999–2002 వరకు ఎన్ఎస్‌యూఐ రాష్ట్ర అధ్యక్షురాలిగా మీనాక్షి పనిచేశారు.
  • 2002-2005 మధ్య కాలంలో మధ్యప్రదేశ్ యువజన కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సేవలు అందించారు.
  • 2008లో ఏఐసీసీ కార్యదర్శిగా మీనాక్షి ఎంపికయ్యారు.
  • మీనాక్షి రాసిన పుస్తకాల పేర్లు “1857-Bhartiya paripeksh” “Apne-Apne Kurukshetra”.
  •  2009 లోక్‌సభ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లోని మంద్‌సౌర్ స్థానం నుంచి పోటీ చేసే అవకాశాన్ని మీనాక్షికి రాహుల్ గాంధీ కల్పించారు. ఆ ఎన్నికల్లో 30వేల ఓట్ల మెజారిటీతో ఆమె గెలిచారు. 1971 నుంచి వరుసగా ఎన్నికల్లో గెలుస్తూ వస్తున్న బీజేపీ అభ్యర్థి లక్ష్మీనారాయణ్ పాండేను మీనాక్షి ఓడించారు.
  • 2009 యూపీఏ ప్రభుత్వంలో సర్కారీ సిబ్బంది,  ప్రజా విన్నపాలు, న్యాయశాఖ, మహిళా సాధికారతలపై ఏర్పాటు చేసిన కమిటీలో సభ్యురాలిగా మీనాక్షి వ్యవహరించారు.
  • 2014 లోక్‌సభ ఎన్నికల్లో మంద్ సౌర్ లోక్‌సభ స్థానంలో మీనాక్షి ఓడిపోయారు. అక్కడ బీజేపీ అభ్యర్థి సుధీర్ గుప్తా ఏకంగా 3 లక్షల మెజారిటీతో గెలిచారు.
  • మీనాక్షి నటరాజన్ గురించి ఒకసారి కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ‘‘ఎలాంటి నిందను/అపవాదును మోపలేని 100 శాతం స్వచ్ఛమైన మెటీరియల్ మీనాక్షి నటరాజన్’’ అని ఆయన చెప్పారు. దీన్నిబట్టి రాజకీయాల్లో ఆమె ఎంత సూటిగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు.
  • అందుకే తెలంగాణ ఇంఛార్జిగా మీనాక్షికి కీలక బాధ్యతలను అప్పగించారు.
  • మంత్రివర్గ విస్తరణ విషయంలో తెలంగాణలోని కాంగ్రెస్ నేతల మధ్య ఏకాభిప్రాయం కుదరడం లేదు. వాటన్నింటినీ కొలిక్కి తెచ్చే చాతుర్యం మీనాక్షికి ఉంది. అందుకే ఆమెను రాహుల్ ఇక్కడికి పంపారు. తదుపరిగా ఆమె ఆ అంశంపైనే ఫోకస్ చేసే అవకాశం ఉంది.

Also Read :Shock : ఒకే రోజు 400 మందికిపైగా ఉద్యోగుల తొలగించిన ఇన్ఫోసిస్‌


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • congress
  • Meenakshi Natarajan
  • telangana
  • telangana congress
  • Telangana Congress New Incharge

Related News

Heavy Rains

Alert : 13న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు!

Alert : ఆంధ్రప్రదేశ్ మాదిరిగానే తెలంగాణలో కూడా ఈ అల్పపీడనం తీవ్ర ప్రభావం చూపనుంది. ముఖ్యంగా సెప్టెంబర్ 13 తర్వాత వర్షాలు భారీగా కురిసే అవకాశం ఉంది

  • Hyderabad

    Hyderabad: గ్రేటర్‌లో నిమజ్జనానికి సర్వం సన్నద్ధం!

  • Harish Rao

    Harish Rao: లండ‌న్‌లో జ‌రిగిన మీట్ అండ్ గ్రీట్ కార్య‌క్ర‌మంలో పాల్గొన్న హ‌రీష్ రావు!

  • New direction for Telangana education system: CM Revanth Reddy

    Telangana : తెలంగాణ విద్యావ్యవస్థకు కొత్త దిశ : సీఎం రేవంత్‌రెడ్డి

  • CM Revanth Reddy

    CM Revanth Reddy: తెలంగాణలో వరద నష్టంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష!

Latest News

  • Mumbai: అప్పటి వరకు ముంబయి వీధుల్లో డ్రోన్లపై నిషేధం

  • Balapur laddu: బాలాపూర్‌ గణేష్‌ లడ్డూకు రికార్డు ధర..ఈసారి ఎన్ని లక్షలంటే..?

  • PM Modi : భారత్‌–అమెరికా సంబంధాల్లో ఉద్రిక్తతలు : ఐరాస సమావేశాలకు మోడీ గైర్హాజరు!

  • Khairatabad Ganesh : గంగమ్మ ఒడికి బయలుదేరిన ఖైరతాబాద్ మహాగణపతి

  • Trade War : భారత్‌పై అమెరికా వాణిజ్య కార్యదర్శి తీవ్ర వ్యాఖ్యలు

Trending News

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

    • Sara Tendulkar: సచిన్ కుమార్తె సారా టెండూల్కర్‌కు నిజంగానే ఎంగేజ్‌మెంట్ జ‌రిగిందా?

    • IPL Tickets: క్రికెట్ అభిమానులకు తీపి, చేదు వార్త.. ఐపీఎల్‌పై జీఎస్టీ పెంపు, టికెట్లపై తగ్గింపు!

    • New GST: జీఎస్టీలో కీల‌క మార్పులు.. రూ. 48,000 కోట్లు న‌ష్టం?!

    • GST Slashed: హెయిర్‌కట్, ఫేషియల్ చేయించుకునేవారికి గుడ్ న్యూస్‌.. ఎందుకంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd