Jubilee Hills : జూబ్లీహిల్స్ నుంచి స్వతంత్ర అభ్యర్థిగా నవీన్ యాదవ్.. ఎంఐఎం టికెట్ ఆశించి రాకపోవడంతో రెబల్‌గా బరిలోకి..!
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్స్‌కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు
- By Prasad Published Date - 08:03 AM, Thu - 9 November 23

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో నామినేషన్స్‌కు మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీ అభ్యర్థులు అంతా నేడు నామినేషన్లు దాఖలు చేస్తున్నారు.ఇటు హైదరాబాద్ నగరంలో జూబ్లీహిల్స్ సీటు కోసం ప్రధాన పార్టీల పోరు చర్చనీయాంశమైంది. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసిన నవీన్ యాదవ్.. ఈ సారి కూడా స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగుతున్నారు. నవీన్ యాదవ్ నేడు (గురువారం) నామినేషన్ దాఖలు చేయనున్నారు. 2014 ఎన్నికల్లో నవీన్ యాదవ్ AIMIM నుండి జూబ్లీహిల్స్ నుండి పోటీ చేసి 41,656 ఓట్లు సాధించారు. 2018 లో AIMIM నుండి రాజీనామా చేసి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికలలో పోటీ చేశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసినప్పటికీ జూబ్లీహిల్స్‌లో అధిక ఓట్లు సాధించారు. స్వతంత్ర అభ్యర్థిగా నవీన్ యాదవ్ రెండో స్థానంలో నిలిచారు. అధికార పార్టీ ఎన్ని హామీలు ఇచ్చినా ఏ ఒక్కటీ నెరవేర్చలేదని నవీన్ యాదవ్ ఆరోపించారు. చాలా పార్టీలు కూడా తమ పార్టీ నుండి పోటీ చేయమని తనను సంప్రదించాయని.. కాని తాను ఒంటరిగా పోటీ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు.