Nallala Odelu : బీఆర్ఎస్‌లో చేరినందుకు క్షమించాలి.. ఇకపై కాంగ్రెస్.. మరో నియోజకవర్గంలో బీఆర్ఎస్‌కి తలనొప్పులు..
గతంలో రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా చేసిన నల్లాల ఓదెలు(Nallala Odelu) ఈ సారి టికెట్ ఆశించి భంగపడ్డారు.
- Author : News Desk
Date : 22-09-2023 - 6:35 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ ఎలక్షన్స్(Telangana Elections) కొన్ని నెలల ముందే బీఆర్ఎస్(BRS) పార్టీ తమ అభ్యర్థుల్ని ప్రకటించింది. అప్పట్నుంచి పార్టీలో అంతర్గతంగా విబేధాలు వస్తూనే ఉన్నాయ్. పలు నియోజకవర్గాల్లో టికెట్ రాని వాళ్ళు అసంతృప్తితో పార్టీలు మారుతుండగా కొన్నినియోజక వర్గాల్లో టికెట్ వేరేవాళ్లకి ఇవ్వాలని గొడవలు చేస్తున్నారు. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల్లో ఈ తలనొప్పులు మొదలవ్వగా ఇప్పుడు తాజాగా మరో నియోజకవర్గం చేరింది.
చెన్నూర్(Chennur) నియోజకవర్గంలో ప్రస్తుతం బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా బాల్క సుమన్(Balka Suman) ఉన్నారు. ఈ సారి కూడా ఆయనకే టికెట్ ఇచ్చారు. దీంతో గతంలో రెండు సార్లు టీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యే గా చేసిన నల్లాల ఓదెలు(Nallala Odelu) ఈ సారి టికెట్ ఆశించి భంగపడ్డారు. నల్లాల ఓదెలు గతంలో కాంగ్రెస్ లో చేరి మళ్ళీ బీఆర్ఎస్ కి వచ్చి టికెట్ రాకపోవడంతో ఇటీవలే కొన్ని రోజుల క్రితమే కాంగ్రెస్ లో చేరారు.
తాజాగా కాంగ్రెస్ లో చేరిన అనంతరం చెన్నూర్ లో ప్రెస్ మీట్ పెట్టిన నల్లాల ఓదెలు ప్రస్తుత చెన్నూర్ ఎమ్మెల్యే బాల్క సుమన్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
నల్లాల ఓదెలు మాట్లాడుతూ.. ఎమ్మెల్యే బాల్క సుమన్ ఆగడాలను భరించలేకపోతున్నాం. బాల్క సుమన్ ని చెన్నూర్ నియోజకవర్గం నుండి పంపించేయాలి. చెన్నూరు నియోజకవర్గం రజాకార్ల చేతిలోకి వెళ్లిపోయింది. జిల్లా పరిషత్ చైర్మన్ పదవి మా ఆవిడకు బీఆర్ఎస్ పార్టీ ఇచ్చింది, బాల్క సుమన్ కాదు. ఆనాడు కేటీఆర్ పిలిచి మీరు పార్టీలోనే ఉండండి ఎమ్మెల్యే అవకాశం మరోసారి కల్పిస్తామన్నారు. కానీ మాట తప్పారు. మళ్ళీ బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్లినందుకు ప్రజలు నన్ను క్షమించాలి. రెండుసార్లు ఎమ్మెల్యే బాల్క సుమన్ ఇంటికొచ్చి ఎమ్మెల్సీ పదవి ఇప్పిస్తానని చెప్పాడు. ప్రజలు అవకాశం ఇస్తే చెన్నూరు నియోజకవర్గం అభివృద్దే లక్ష్యంగా పనిచేస్తా. చెన్నూర్ నియోజకవర్గంలో బాల్క సుమన్ 500 కోట్లు అక్రమంగా సంపాదించాడు. ఇప్పుడు నేను చనిపోయే వరకు కాంగ్రెస్ లోనే ఉంటాను. నాకు కాంగ్రెస్ టికెట్ ఇవ్వకపోయినా కాంగ్రెస్ అభ్యర్థికే సపోర్ట్ చేస్తా. బీఆర్ఎస్ లో ఒకసారి మోసపోయాను. మళ్ళీ మోసపోవాలనుకోవట్లేదు అని అన్నారు.
దీంతో నల్లాల ఓదెలు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. ఇన్ని రోజు బీఆర్ఎస్ లో మంచి పట్టు ఉండి ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లడంతో అతని క్యాడర్ కూడా కాంగ్రెస్ వైపు చూస్తుంది. దీంతో నల్లాల ఓదెలు వల్ల చెన్నూరులో బీఆర్ఎస్ గెలవాలంటే ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది.
Also Read : Vijayashanthi : సొంత పార్టీ నేతలే నాపై తప్పుడు ప్రచారం చేయిస్తున్నారు.. రాములమ్మ..