HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Harish Raos Flag Against The Congress Government

రైతులకు కన్నీరు.. బీరు ఫ్యాక్టరీలకు నీరు ! – కాంగ్రెస్ సర్కార్ పై హరీష్ రావు ధ్వజం

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు

  • Author : Sudheer Date : 29-01-2026 - 2:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish Rao Pm
Harish Rao Pm

Harish Rao : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందని మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్ హయాంలో డిసెంబర్ నెలలోనే ‘టింగు టింగు’మంటూ ఫోన్లలో మోగే రైతు బంధు నిధులు, ఫిబ్రవరి వచ్చినా ఇప్పటికీ విడుదల కాకపోవడాన్ని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు. పెట్టుబడి సాయం అందక రైతులు ప్రైవేటు వడ్డీలకు తెచ్చి సాగు చేస్తున్నారని, దాని భారం రైతులపై పడుతోందని మండిపడ్డారు. పదేళ్ల కేసీఆర్ పాలనలో ఎప్పుడూ ఎరువుల కొరత రాలేదని, కానీ నేడు ఎరువుల కోసం తెల్లవారుజామున 3 గంటలకే వచ్చి చెప్పులను లైన్లో పెట్టే ‘చీకటి రోజులు’ మళ్ళీ వచ్చాయని ఆయన విమర్శించారు.

రైతుల కంట కన్నీరు – బీరు ఫ్యాక్టరీలకు నీళ్లు ఫుల్!

మెదక్ జిల్లాలోని సింగూరు మరియు గణపురం ప్రాజెక్టుల కింద సుమారు 70 వేల ఎకరాలకు క్రాప్ హాలిడే ప్రకటించడంపై హరీష్ రావు నిప్పులు చెరిగారు. మరమ్మతుల పేరుతో రైతులకు సాగునీరు నిలిపివేస్తూ, బీరు ఫ్యాక్టరీలకు మాత్రం నిరంతరాయంగా నీటి సరఫరా చేయమని ఎక్సైజ్ కార్యదర్శి ఆదేశించడం విడ్డూరమని అన్నారు. “మీకు రైతుల కంటే బీరు ఫ్యాక్టరీల యజమానుల కమిషన్లే ముఖ్యమా?” అని ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. పంట మార్పిడి విధానాన్ని పాటించి కందులు, ఆయిల్ పామ్ వంటి పంటలు వేయాలని రైతులకు సూచిస్తూనే, కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన రూ. 8,000 మద్దతు ధరను దళారులకు దక్కకుండా రైతులే వినియోగించుకోవాలని కోరారు.

Revanth Nirmal

Revanth

హామీలు గాల్లోనే.. పోరాటమే శరణ్యం!

గత ఏడాది అకాల వర్షాల వల్ల పంట నష్టపోయినప్పుడు ముఖ్యమంత్రి హెలికాప్టర్‌లో వచ్చి ఎకరానికి రూ. 10 వేలు ఇస్తామని ప్రకటించినా, ఏడాది గడిచినా ఒక్క పైసా విదల్చలేదని హరీష్ రావు ఆరోపించారు. పెండింగ్‌లో ఉన్న రూ. 1100 కోట్ల బోనస్ నిధులు, పంట నష్టపరిహారం తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం కేవలం ప్రతిపక్షాలపై కేసులు పెట్టడం, సిట్ నోటీసులు ఇవ్వడంపై చూపే శ్రద్ధ రైతుల సమస్యలపై చూపడం లేదని ఎద్దేవా చేశారు. వెంటనే రైతు భరోసా, బోనస్, మరియు పంట నష్ట పరిహారం చెల్లించకపోతే బీఆర్ఎస్ పార్టీ పక్షాన రైతుల కోసం పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs
  • Congress Govt
  • Congress Promises
  • farmers Problems
  • harish rao

Related News

Revanth Speech

CONGRESS vs BRS : ప‌వ‌ర్ పాలిటిక్స్‌.. ఉచిత విద్యుత్‌పై రేవంత్ స‌వాల్‌కు బీఆర్ఎస్ సైలెంట్‌..?

తెలంగాణలో రైతులకు 24 గంటల ఉచిత విద్యుత్ అంశం మరోసారి రాజకీయ చర్చకు కేంద్రబిందువైంది. ఉచిత విద్యుత్, వ్యవసాయ పంపుసెట్లకు స్మార్ట్ మీటర్ల వ్యవహారంపై అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి.  ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరా కొనసాగుతుందనితేల్చి చెప్పారు.ఈ విషయంలో కాంగ్రెస్ ప్రభు

  • Balka Suman

    BRS : మాజీ ఎమ్మెల్యే  బాల్కా సుమన్ అరెస్ట్.. రెచ్చగొట్టే వ్యాఖ్యలపై కేసు నమోదు

  • Supreme Court

    Telangana : గవర్నర్ కోటా ఎమ్మెల్సీ నామినేషన్లపై సుప్రీంకోర్టులో విచారణ

  • KTR- Harish Rao

    BRS : కేటీఆర్, హరీష్ రావు తమ కార్యకర్తలకు బోధిస్తున్న సిద్ధాంతం ఇదేనా?.. తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చ

Latest News

  • Bengaluru : మటన్ పేరుతో బీఫ్ విక్రయం?.. బెంగళూరులో ఇద్దరు రెస్టారెంట్ యజమానుల అరెస్ట్

  • IPL : ఆర్‌సీబీ అభిమానులకు ఉచిత మెట్రో ప్రయాణం.. ప్ర‌చారాన్ని ఖండిచిన బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేష‌న్‌

  • Minister Komatireddy : మానవత్వం చాటుకున్న మంత్రి కోమటిరెడ్డి.. “భ‌విత ” బంగారు భ‌విష్య‌త్ కోసం అండ‌గా

  • TDP NRI : లాస్ ఏంజెల్స్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు వేడుకలు

  • Health : హైబీపీ – సైలెంట్ కిల్లర్‌ను నిర్లక్ష్యం చేయకండి – డా. చింతా ప్ర‌భాక‌ర్ రెడ్డి

Trending News

    • fake news: లిక్కర్ కేసులో నా భార్యకు నోటీసులు రావడం అంతా అబద్ధం.. కేశినేని చిన్ని !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd