HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Nagarjuna Will Send Legal Notices To Minister Surekha

Nagarjuna : మంత్రి సురేఖకు లీగల్‌ నోటీసులు పంపనున్న నాగార్జున..?

Nagarjuna : ఇప్పటికే తనపై చేసిన కామెంట్లకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రి సురేఖకు లీగన్‌ నోటీలు పంపిన విషయం తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారురు.

  • Author : Latha Suma Date : 03-10-2024 - 12:26 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Nagarjuna Defamation Case
Nagarjuna Defamation Case

Legal notices : మంత్రి కొండా సురేఖ సమంత, నాగచైతన్యపై అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటున్నాని సురేఖ ప్రకటించారు. అయితే ఇప్పట్లో ఈ వివాదానికి ఫుల్‌స్టాప్‌ పడేలా లేదు. మంత్రి మంటలపై నాగార్జున వెనక్కి తగ్గేదే లేదంటున్నారు. ఆమెకు లీగల్‌ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమవుతున్నారు. తన కుటుంబాన్ని అవమానించేలా మాట్లాడిన సురేఖకు త్వరలో నోటీసులు పంపించనున్నట్లు తెలుస్తున్నది.

Read Also: Ram Gopal Varma: సీఎం రేవంత్‌కు రామ్ గోపాల్ వ‌ర్మ స్పెష‌ల్ రిక్వెస్ట్‌

ఇప్పటికే తనపై చేసిన కామెంట్లకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ మంత్రి సురేఖకు లీగన్‌ నోటీలు పంపిన విషయం తెలిసిందే. తన ప్రతిష్ఠకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని పేర్కొన్నారురు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్టప్రకా రం పరువు నష్టం దావా వేయడంతోపాటు క్రిమినల్‌ కేసులు పెడతానని హెచ్చరించారు. తాను మంత్రిగా ఉన్న కాలంలో ఫోన్‌ ట్యాపింగ్‌ చేశానని, నాగచైతన్య-సమంత విడిపోవడానికి ప్రధాన కారణం తానేనని, కొన్ని దురుద్దేశపూర్వక వ్యాఖ్యలు చేశారని, గౌరవానికి, ప్రతిష్ఠకు భంగం కలిగించాలన్న లక్ష్యంగానే అడ్డగోలు వ్యాఖ్యలు చేశారని లీగల్‌ నోటీసులో పేరొన్నారు. కేవలం రాజకీయ కక్షతో, రాజకీయ ప్రయోజనాల కోసం తన పేరును సురేఖ వాడుకుంటున్నారని తెలిపారు.

సినిమా నటుల పేరును వాడుకొని వారి వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడటం దురదృష్టకరం అని వెల్లడించారు. అసలు తనకు సంబంధమే లేని ఫోన్‌ ట్యాపింగ్‌, ఇతర అంశాలపై సురేఖ చేసిన వ్యాఖ్యలు అసత్యపూరితమని అన్నారు. ఎలాం టి సాక్ష్యాధారాలు చూపించకుండా అడ్డగోలుగా మాట్లాడిన సురేఖ ఒక మంత్రి అని, ఆమె చేసిన వ్యాఖ్యలను సాధారణ ప్రజలు నిజాలుగా భ్రమపడే అవకాశం ఉన్నదని చెప్పారు. మంత్రిగా తన సహచర అసెంబ్లీ సభ్యుడు అని సోయి కూడా లేకుండా సురేఖ మా ట్లాడటం ఆశ్చర్యానికి గురిచేసిందని తెలిపారు. గతంలో ఇవే అడ్డగోలు మాటలు మాట్లాడిన సురేఖకు ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నోటీసులు పంపించిన విషయాన్ని గుర్తుచేశారు. ఇలాంటి అవాంఛనీయ వ్యాఖ్యలు చేసిన సురేఖకు భారత ఎన్నికల సంఘం గట్టి హెచ్చరిక చేసిందని, అయినా ఇలాంటి దురుద్దేశపూర్వక వ్యాఖ్యలను కొనసాగిస్తున్నారని పేర్కొన్నారు. 24 గంటల్లోగా కొండా సురేఖ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావాతోపాటు క్రిమినల్‌ కేసులు పెడతానని హెచ్చరించారు.

Read Also: Roopa Ganguly : కోల్‌కతాలో రూపా గంగూలీ అరెస్టు…


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • ktr
  • Legal Notices
  • Minister Konda Surekha
  • Naga Chaitanya Divorce issue
  • Nagarjuna Akkineni
  • Samantha

Related News

Dhanush

హీరో ధనుష్‌కు నిర్మాణ సంస్థ లీగల్ నోటీసులు..రూ.20 కోట్లు కట్టు!

Dhanush రూ.20 కోట్లు నష్టపరిహారంగా చెల్లించాలంటూ సినీ నటుడు ధనుష్‌కు తమిళ నిర్మాణ సంస్థ తేనాండాళ్ ఫిల్మ్స్ లీగల్ నోటీసులు పంపించింది. చాలాకాలంగా వాయిదాపడుతున్న ఒక సినిమా ప్రాజెక్టుకు సంబంధించి ఈ నోటీసులు పంపించింది. ఆయన కమిట్‌మెంట్ పూర్తి చేయకపోవడం వల్ల తమ సినిమా ఆలస్యమై ఆర్థికంగా ఇబ్బందులు ఎదురయ్యాయని నిర్మాణ సంస్థ పేర్కొంది. ప్రస్తుతం ఈ అంశం కోలీవుడ్‌లో చర్చనీయాంశంగ

    Latest News

    • టీ20 వరల్డ్ కప్ 2026.. నెదర్లాండ్స్‌పై భారత్ ఘనవిజయం!

    • విజయ్-రష్మిక వివాహం.. రాజకీయ, సినీ ప్రముఖుల రాక!

    • భార‌త్ వ‌ర్సెస్ నెద‌ర్లాండ్స్ మ్యాచ్‌.. క్యాచ్ ఎలా ప‌ట్టాడో చూశారా?!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. అహ్మదాబాద్‌లో భారత్ vs దక్షిణాఫ్రికా!

    • తిరుమల నెయ్యి టెండర్లపై ‘వైసీపీ’ దుష్ప్రచారం.. వాస్తవాలను వెల్లడించిన టీటీడీ చైర్మన్!

    Trending News

      • భారత్ నుండి ఐసీసీ టోర్నమెంట్‌ల తరలింపు? బీసీసీఐకి భారీ షాక్!

      • Gold Silver Rate Today: బంగారం, వెండి ధరల్లో మళ్లీ పరుగు.. వెండి ఏకంగా రూ. 8,000 పైకి!

      • భారత్‌లో బిగ్ బాష్ లీగ్? చెన్నై వేదికగా తొలి మ్యాచ్ నిర్వహించేందుకు ఆస్ట్రేలియా ప్లాన్!

      • ఆధార్ కార్డ్‌లో భారీ మార్పులు.. ఏంటంటే?

      • సెమీఫైనల్‌కు దూసుకెళ్లిన ఇండియా-ఏ.. పాక్‌తో ఫైన‌ల్ మ్యాచ్!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd