Nagababu : సీఎం రేవంత్ కు జై కొట్టిన మెగా బ్రదర్ నాగబాబు
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం
- By Sudheer Published Date - 06:00 PM, Sun - 1 September 24

మెగా బ్రదర్ నాగబాబు (Nagababu)..తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి సపోర్ట్ చేయడమే కాదు ఆయనపై ప్రశంసలు కురిపించారు. హైదరాబాద్ నగరంలో ‘హైడ్రా’ (HYDRA ) బుల్డోజర్లు హడలెత్తిస్తున్న సంగతి తెలిసిందే. అక్రమ నిర్మాణాలు అని పిర్యాదు అందితే చాలు చాలు వెంటనే ఆ నిర్మాణాల ఇంటి ముందు బుల్డోజర్లు అడుగుపెడుతున్నాయి. నోటీసులు వంటివి ఏమి లేకుండా కూల్చేస్తున్నాయి. ఇప్పటికే పదుల సంఖ్యలో అక్రమ నిర్మాణాలను హైడ్రా కూల్చేసింది. అధికార పార్టీ నేతలు , బడా రాజకీయ నేతలు , సినీ , బిజినెస్ ప్రముఖులు ఇలా ఎవర్ని వదిలిపెట్టడం లేదు. అంతెందుకు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడికి సైతం నోటీసులు ఇచ్చారంటే హైడ్రా ఎంత స్టిక్ గా వ్యవహరిస్తుందో అర్ధం చేసుకోవాలి. హైడ్రా దూకుడు ఫై సామాన్య ప్రజలే కాదు రాజకీయాయేతర పార్టీ నేతలు సైతం హర్షం వ్యక్తం చేస్తూ..సీఎం రేవంత్ తీసుకున్న ఈ నిర్ణయం ఫై ప్రశంసలు కురిపిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
తాజాగా జనసేన నేత, మెగా బ్రదర్ నాగబాబు సైతం సీఎం రేవంత్ ను అభినందిస్తూ ట్వీట్ చేసారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో గత రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు పడుతున్న సంగతి తెలిసిందే. ఈ వర్షాలకు వందలాది ఇళ్లలో వరద నీరు చేరింది. దీంతో అంత ఇల్లులు ఖాళీ చేసి సురక్షిత ప్రాంతాలకు తరలి పోతున్నారు. ఈ సందర్భంగా హైడ్రాను ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేసి వార్తల్లో నిలిచారు. వర్షాలకు తూములు తెగిపోయి, చెరువులు, నాళాలు ఉప్పొంగిపోయి అపార్ట్మెంట్లలోకి కూడా నీళ్లు రావడం మనం చూస్తున్నాం. దీనికి ప్రజలు ప్రాణాలు కోల్పోవడం బాధాకరం. వీటికి ముఖ్య కారణం చెరువులను ఆక్రమించి నిర్మాణాలు చేయడమే అని ట్వీట్ చేశారు. దీనికి నివారణగా సీఎం రేవంత్ ధైర్యంగా హైడ్రా కాన్సెప్ట్ తీసుకొచ్చారు. దీనికి అందరూ సపోర్ట్ చేయాలి అని ట్వీట్ చేశారు. ఇప్పటికైనా అర్థ అయ్యిందా సీఎం రేవంత్ రెడ్డి తీసుకువచ్చిన హైడ్రా చేస్తున్న పని మంచిదే అన్నారు. పర్యావరణాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది, అదే పర్యావరణాన్ని మనం భక్షిస్తే కచ్చితంగా అది శిక్షిస్తుంది… కచ్చితంగా…అంటూ నాగబాబు ట్వీట్ చేసారు.
వర్షాలు పడి తూములు తెగిపోయి,చెరువులు నాళాలు ఉప్పొంగి పోయి అపార్ట్మెంట్ లకి కూడ నీళ్లు రావడం,కొన్ని సామన్య ప్రాణాలు కూడ బలికావడం చాల బాధకారం వీటికి ముఖ్య కారణం చెరువుల్ని నాళాలని అక్రమ కబ్జా చేసి నిర్మాణాలు చేయడమే ..
ఇప్పటికైన అర్ధమైందా తెలంగాణ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
— Naga Babu Konidela (@NagaBabuOffl) September 1, 2024
Read Also : Telangana Rains : తెలంగాణకు తొమ్మిది ఎన్డీఆర్‌ఎఫ్ బృందాలను పంపుతున్న కేంద్రం