MP Santosh Kumar: నేనెప్పుడూ కేసీఆర్ సేవలోనే ఉంటా..!!
TRS MP సంతోష్ కుమార్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు వినిపించాయి. సీఎం కేసీఆర్ ...సంతోష్ కుమార్ ను మందలించడంతోనే..ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేకేత్తించాయి.
- Author : hashtagu
Date : 29-09-2022 - 10:06 IST
Published By : Hashtagu Telugu Desk
TRS MP సంతోష్ కుమార్ గురించి ఈ మధ్య రకరకాల వార్తలు వినిపించాయి. సీఎం కేసీఆర్ …సంతోష్ కుమార్ ను మందలించడంతోనే..ఆయన ఫోన్ స్విచ్చాఫ్ చేసుకున్నారన్న ప్రచారం రాజకీయ వర్గాల్లో కలకలం రేకేత్తించాయి. దీంతో గులాబీ కోట బద్దలు ఖాయం అంటూ ప్రతిపక్షాలు సైతం విమర్శలు మొదలెట్టాయి. అయితే ఈ వార్తలను ఎంపీ సంతోష్ కుమార్ తీవ్రంగా ఖండించారు. అసలేం జరిగిందో తెలియక…ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కేసీఆర్ కు అత్యంత సన్నిహితుడు…భార్య తరపు బంధువు కావడంతో…కేసీఆర్ వ్యక్తగత వ్యవహారాలతోపాటు…పార్టీ కార్యకలాపాల్లో చురుకుగా ఉంటూ వస్తున్నారు సంతోష్ కుమార్. కేసీఆర్, సంతోష్ మద్య వాగ్వాదం జరిగిందని…దీంతో సంతోష్ కలత చెంది అజ్ఝాతంలోకి వెళ్లారంటూ ఓ దినపత్రికలో వార్త ప్రచురితం అయ్యింది.
ఇది కూడా చదవండి : ఎంపీ సంతోష్ కుమార్ ఎక్కడ? టీఆర్ఎస్ నేతల అయోమయం..!!
తనపై వస్తున్న వార్తలను ఖండించిన సంతోష్ కుమార్… ఆ దినపత్రికకు వివరణ ఇచ్చారు. నేనెప్పడూ కేసీఆర్ సేవలోనే ఉంటాను..ఆయనకు సేవ చేయడమే నా జీవితంలో ఉన్న ఏకైక పని అని స్పష్టం చేశారు. నేను మనిషినే…నాకు సమస్యలు ఉంటాయి. బ్యాడ్ మూమెంట్ ఉంటుంది. ఆరోగ్య సమస్యలు కూడా ఉంటాయంటూ తనపై వచ్చిన వార్తలను ఖండించారు.
ఇది కూడా చదవండి: ఢిల్లీలో తెలంగాణ ఆత్మగౌవర పతాకం ఎగిరే రోజులు దగ్గరలోనే ఉన్నాయి: కవిత
తాను హైదరాబాద్ లోనే ఉన్నానని..ఎక్కడికి వెళ్లలేదని పార్టీశ్రేణులకు స్పష్టం చేశారు. ప్రస్తుతం ప్రగతి భవన్ లోనే ఉన్నానని…ఎక్కడ ఉండాలో అక్కడే ఉంటానని సంతోష్ కుమార్ స్పష్టం చేవారు. అనవసరంగా వ్యక్తిగత విషయాలను రాజకీయాల్లోకి లాగకూడదంటూ అభిప్రాయపడ్డారు.